భాస్కర శతకము పద్యాలు - ఘను డొకవేళఁ గీడ్పడినఁ
ఘను డొకవేళఁ గీడ్పడినఁ గ్రమ్మఱ నాతని లేమి నాపగాఁ
గనుఁగొన నొక్కసత్ప్రభువుగాక నరాధము లోప రెందరున్
బెనుచెఱు వెండినట్టితరి బెల్లున మేఘుఁడు గాక నీటితో
దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా!
తాత్పర్యం: చెఱువు ఎండిపోయినచో దానిని నీటితో నిండించుటకు మేఘుడే సమర్థుడుకాని, మంచుతుంపర లెన్నయిననూ ఆ చెరువును నిండింపలేవు. అట్లే గొప్పవాడు హీనస్థితిలో నుండినచో సామాన్యు లెవరును వాని నుద్దరింపలేరు. అతని నుద్దరింప రాజే సమర్థుడు.
0 comments:
Post a Comment