Pages

తెలుగు వ్యాకరణం - భాషా భాగాలు, వచనాలు, కాలాలు - మాదిరి ప్రశ్నలు

 తెలుగు వ్యాకరణం -  భాషా భాగాలు, వచనాలు, కాలాలు - మాదిరి ప్రశ్నలు  

1. క్రియా నామ వాచకానికి గల మరోపేరు? 

ఎ) గుణ నామవాచకం బి) జాతి నామవాచకం 

 సి) కృదంత నామవాచకం డి) సమస్త నామవాచకం      (సి)


2. నావువాచకానికి మరోపేరు?

ఎ) విశేషణం  బి) సర్వనామం  సి) విశేష్యం  డి) అవ్యయం    (సి)


3. అవ్యయాలు ఎన్ని విధాలు? 

ఎ) నాలుగు  బి) మూడు  సి) రెండు  డి) ఐదు    (సి)


4. సంస్కృత భాషలో వచనాలు ఎన్ని?

ఎ) రెండు  బి) నాలుగు  సి) మూడు  డి) ఐదు    (సి)


5. 'సదస్సు' - అనేది ఏ నామవాచకం? 

ఎ) సమస్త నామవాచకం  బి) జాతి నామవాచకం 

 సి) సంజ్ఞా నామవాచకం డి) గుణ నామవాచకం  (బి)

 

6. 'తర్వాత' అనే అర్థం వచ్చే క్రియా పదం ఏది?

ఎ) శత్రర్థకం  బి) అనంతర్యార్థకం  సి) భేదర్థకం  డి) తుమన్నర్థకం     (బి)


7. 'మంచి' అనే పదం ఏ విశేషణం?

ఎ) క్రియా విశేషణం  బి) గుణ విశేషణం  సి) విధేయ విశేషణం  డి) ఏదీకాదు     (బి)


8. 'ఆ - ఈ - ఏ అనేవి ఏ సర్వనామాలు? 

ఎ) సంబంధ సర్వనామాలు  బి) నిర్దేశాత్మక సర్వనామాలు

  సి) సంఖ్యావాచక సర్వనామాలు డి) పురుష బోధకాలు     (బి)


9. భూత కాలాన్ని తెలిపే అసమాపక క్రియను ఏమంటారు?

ఎ) భేదర్థకం  బి) శత్రర్థకం  సి) తుమన్నర్థకం  డి) క్త్వార్థం       (డి)


10. అన్ని కాలాల్లో వర్తించే క్రియా పదాలు ఏవి?

ఎ) క్వార్థకాలు  బి) సమాపక క్రియలు  సి) భూతకాల క్రియలు  డి)తద్ధర్మార్థక క్రియలు    (డి)


11. సంభార వాచక పదాలు ఏవి?

ఎ) బియ్యం  బి) చింత పండు  సి) ఉప్పు  డి) పైవన్నీ    (డి)


12. ఈ క్రింది వాటిలో స్థల వాచక పదాలు? 

ఎ) అక్కడ  బి) ఎక్కడ సి) ఇక్కడ డి) పైవన్నీ     (డి)


13. 'వండితే, తింటే' అనేవి ఏ క్రియా రూపాలు? 

ఎ) భేదర్థకాలు  బి) శత్రర్థకాలు  సి) క్వార్థకాలు  డి) తుమన్నర్థకాలు      (ఎ)


14. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనం ఏది? 

ఎ) పాలు  బి) చేలు  సి) చెట్లు  డి) ఆకులు    (ఎ)

 

15. ప్రస్తుతాన్ని తెలియ జేసే కాలాన్ని ఏమంటారు? 

ఎ) వర్తమాన కాలం బి) భూత కాలం సి) భవిష్యత్ కాలం డి) తద్ధర్మ   (ఎ)


16. తెలుగుభాషలో వచనాలు ఎన్ని?

ఎ) మూడు  బి) రెండు  సి) నాలుగు  డి) ఐదు   (బి)


17. 'సాటి' పదం ఏ వాచక పదం ?

ఎ) సంఖ్యావాచకం  బి) తుల్యవాచక పదం  సి) గుణ వాచకం  డి) సంజ్ఞా వాచకం    (బి)

 

18. తెలుగుభాష లో ప్రధానంగా వాడుకలో ఉన్న కాలాలు ఏన్ని?

ఎ) నాలుగు  బి) మూడు  సి) రెండు  డి) ఆరు     (బి)


19. కృష్ణానది ఏ వాచక పదం?

ఎ) గుణ వాచకం  బి) సంభార వాచకం  సి) సంజ్ఞా వాచకం  డి) స్థల వాచకం     (సి)


20. సహజ సిద్ధంగా జరిగే పనులను తెలియజేసే కాలాన్ని ఏమంటారు?

ఎ) భూత  బి) భవిష్యత్  సి) తద్ధర్మ  డి) వర్తమాన    (సి)


21. గత కాలాన్ని తెలిపేది?

ఎ) భవిష్యత్ బి) వర్తమాన  సి) భూత  డి) తద్ధర్మ    (సి)


22. ఈ క్రింది వాటిలో క్రీడా వాచక పదం కానిది?

ఎ) అచ్చన గాయలు బి) చొట్టు  సి) ఓమన గుంటలు డి) పెసలు    (డి)


23. ఈ క్రింది వాటిలో సర్వనాము పదాలు ఏవి?

ఎ) అందరు  బి) కొందరు  సి) ఎందరు  డి) పైవన్నీ    (డి)


24. 'రమ్య' చదువుతున్నది - ఇది ఏకాలం?

ఎ) భూత   బి) తద్ధర్మ  సి) భవిష్యత్  డి) వర్తమాన    (డి)


25. తెలుగు భాషలో లేనిది, సంస్కృతంలో ఉన్న వచనమేది?

ఎ) ఏకవచనం  బి) ద్వివచనం  సి) బహువచనం  డి) ఏదీకాదు    (బి)


26. 'వానలు కురిసిన పంటలు పండును' - ఇది ఏ కాలం?

ఎ) భూత  బి) తద్దర్మ  సి) వర్తమాన   డి) భవిష్యత్    (బి) 


27. 'సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు' - ఏ కాలం?

ఎ) భూతకాలం  బి) తద్ధర్మ  సి) వర్తమాన  డి) భవిష్యత్    (బి)


28. జరుగబోవు పనిని తెలియజేసే కాలాన్ని ఏమంటారు?

ఎ) వర్తమాన  బి) భూత  సి) భవిష్యత్ డి) తద్ధర్మ         (సి)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు