Pages

తెలుగు వ్యాకరణం - నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపుకథలు - మాదిరి ప్రశ్నలు

తెలుగు వ్యాకరణం - నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపుకథలు - మాదిరి ప్రశ్నలు

1. 'కళ్యాణం' పదానికి నానార్థాలు ఏవి ?

ఎ) పెళ్లి   బి) శుభం   సి) మంగళం   డి) పైవన్నీ            (డి)


1. నానార్థాలు అంటే ఏమిటి?

ఎ) ఒకే అర్థాన్నిచ్చే వేరు వేరు పదాలు  బి) ఒకే పదానికి ఉన్న అనే కార్థాలు  

సి) ఒకే పదానికి 'పుట్టు' పూర్వోత్తరాలు  డి) ఒకే పదానికి వ్యతిరేక పదాలు   (బి)


2. రాజు పదానికి నానార్థాలు ఏవి?

ఎ) రాజు,పాలకుడు  బి) రాజు, రక్షకుడు  

సి) క్షత్రియుడు, ప్రభువు, చంద్రుడు  డి) పాలకుడు, ఆధిపతి      (సి)


3. వ్యుత్పత్యర్థాల ప్రయోజనం ఏమిటి? 

ఎ) భాషా సంపద పెంపు  బి) పదాల మూలం సి) పదం పుట్టు పూర్వోత్తరాలు డి) పైవన్నీ      (డి)


4. పితామహుడు పదానికి నానార్థాలు ఏవి?

ఎ) బ్రహ్మ, తండ్రి   బి) బ్రహ్మ, తాత  సి) తాత,ముత్తాత    డి) బ్రహ్మ, విష్ణువు          (బి)


5. వంశము పదానికి నానార్థాలు ఏవి?

ఎ) కులము, మతము     బి) మొలక, వెదురు   సి) కులము, వెదురు, పిల్లనగ్రోవి   డి) కులము, గోత్రము          (సి)


6. సుధ పదానికి నానార్థాలు ఏవి?

ఎ) అమృతం, సున్నం   బి) నేయి, తెనె    సి) అమృతం, నేయి   డి) అమృతం , పాలు      (డి)


7. 'ధ్వని' నానార్థాలు ఏవి?

ఎ) దిక్కు, శబ్దం   బి) శబ్దం, వ్యంశ్యం   సి) దిశ, దెస   డి) స్వర్గం, తరంగం          (బి)


8. 'అమరులు' పదానికి వ్యుత్పత్తి అర్థం ఏది? 

ఎ) అమరం రానివారు  బి) అర మరలు లేనివారు

  సి) మరణం లేనివారు  డి) మరలు తెలియని వారు          (సి) 


9. 'కంఠీరవము' అనగా వ్యుత్పత్తి ఏది?

 ఎ) కంఠమందు విషము గలది  బి) కంఠమందు ఆభరణం గలది 

  సి) కంఠమందు భాష గలది  డి) కంఠమందు శబ్దము గలది.          (డి)


 10. 'విషయం' పదానికి నానార్థాలు ఏవి? 

ఎ) సంగ్రహం, సంక్షిప్తం  బి) దేశం, వస్తువు, సమాచారం  

సి) సమాచారం, పరిజ్ఞానం  డి) సంగతి, సమాచారం         (బి)


11. 'పుత్రుడు' పదానికి వ్యుత్పత్తి ఏది? 

ఎ) పితృలోక వారసుడు  బి) పున్నామ నరకానికి పంపేవాడు 

సి) పున్నామ నరక రక్షకుడు  డి) వంశానికి వారసుడు           (సి)


12. పొడుపుకథ అంటే ఏమిటి?

 ఎ) నిగూఢార్థం కలది  బి) జ్ఞాన దాయకమైంది   సి) మనసుకు హత్తుకొనేది   డి) పైవన్నీ    (డి)


13. వ్యుత్పత్యర్థం అంటే ఏమిటి?

ఎ) పదానికి అర్థం  బి) పదానికి మూలం   సి) పదానికి నానార్థం  డి) పదానికి పర్యాయపదం       (బి)


14. 'మానవుడు' పదానికి వ్యుత్పత్తి ఏది?

ఎ) భూలోక వాసి    బి) జరామరణాలున్న వాడు.  

సి) మనువు వల్ల పుట్టినవాడు  డి) మనసుతో ఆలోచించేవాడు.            (సి)


15. పొడుపు కథ లక్షణం ఏమిటి?

ఎ) కొండంత భావాన్ని గోరంతలో చెప్పేది   బి) తికమక పెట్టేది  

 సి) మానసిక ఆనందం  కలిగించేది   డి) పైవన్నీ          (డి)


16. 'దైత్యులు' పదానికి వ్యుత్పత్తి ఏది?

 ఎ) ద్విజులు  బి) దితి యొక్క కుమారులు   సి) దేవతలు  డి) సురలు          (బి)


17. పొడుపు కథకు మరోపేరు?

ఎ) సామెత   బి) జాతీయం   సి) ప్రహేళిక   డి) నానుడి     (సి)


18. పొడుపు కథల్లో కనిపించే అలంకారం ఏది?

ఎ) ఉపమా   బి) రూపకం   సి) అతిశయోక్తి    డి) రూపకాతిశయోక్తి          (డి)


19. 'పద్మభవుడు' పదానికి వ్యుత్పత్తి ఏది?

ఎ) పద్మం నాభిలో ఉన్న వాడు  బి) పద్మం నుంచి పుట్టినవాడు  

 సి) పద్మం అలంకారంగా కలవాడు  డి) పద్మాన్ని వికసింపజేసేవాడు.           (బి)


20. ఏడు బారలమాను వంగి నీళ్లు త్రాగుతుంది ఏమిటి?

ఎ) కొబ్బరి చెట్టు  బి) తాటి చెట్టు  సి) ఏతాము  డి) ఒంటె         (సి) 


21. అందడు, ఆగడు, అరగడు ఎవరాతడు? -

ఎ) చంద్రుడు    బి) సూర్యుడు   సి) శివుడు   డి) నక్షత్రం     (బి)

 

22. ఒళ్లంతా కళ్లుంటాయి. కాని ఇంద్రుడు కాడు, మెడనల్లగా ఉంటుంది, కాని శివుడు కాడు, పాములను పట్టి చంపుతుంది. గరత్మంతుడు కాదు

ఎ) ఇంద్రుడు   బి) శివుడు   సి) నెమలి    డి) గరుత్మంతుడు           (సి)


23. ఆరు కాళ్లున్నాయి. కాని తుమ్మెదకాదు. తొండం ఉంటుంది. దోవు కాదు,  రెక్కలుంటాయి కాని పక్షి కాదు. ఏమిటది? 

ఎ) తుమ్మెద   బి) ఈగ  సి) పక్షి   డి) దోమ         (బి)


24. అక్కా చెల్లెళ్లు ఏడుస్తారు. ఐతే దగ్గరకు చేరలేరు. 

ఎ) కాళ్లు   బి) చేతులు   సి) కళ్లు  డి) చెవులు          (సి)


25. నెత్తి మీద రాయి. నోట్లో వేలు. ఏమిటి దీని అర్థం?

ఎ) కంఠహారం   బి) వడ్డాణం   సి) ఉంగరం  డి) నాగరం         (సి)


0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు