Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 2

   శ్రీ వేమన పద్య సారామృతము - తాను గుడువ లేక తగవేది యాప్తుల

తాను గుడువ లేక తగవేది యాప్తుల 

జేర నివ్వడట్టి చెనటి; గోవు 

చేనిలోక బొమ్మజేసి కట్టిన యట్లు 

విశ్వదాభిరామ వినుర వేమ ! 

అర్థం: ఒక్కొక్కడు ఎంత కలిమి ఉన్నా తాను అనుభవంచడు. ఎవరికి పెట్టడు. ఇది ఎలా ఉందంటే ఆవు బొమ్మను చేసి చేలో కట్టినట్లుంది. 


  శ్రీ వేమన పద్య సారామృతము - పూర్వ జన్మమందు పూణ్యంబు సేయని 

పూర్వ జన్మమందు పూణ్యంబు సేయని 

పాపి ధనము కాశపడుట యెల్ల 

విత్తు మరచి గోయ వెదకిన చందంబు

విశ్వదాభిరామ వినుర వేమ! 

అర్థం: గతం జన్మలో పూణ్యం చేయని పాపాత్ముడు ధనానికి ఆశపడటం ఎలా ఉందంటే విత్తుడం మరసిపోయి చేనుకోయడానికి వెళ్ళటం లాంటిది.


  శ్రీ వేమన పద్య సారామృతము - చమురు గలుగు దివ్వె నరవితో మండును 

చమురు గలుగు దివ్వె నరవితో మండును 

చమురు లేని దివ్వె సమసిపోవు 

తనువు తీరునేని తలపు తోడనె తీరు 

విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: దీపంలో చమురు ఉన్నంత వరకూ మంచి కాంతితో మెరుస్తూ ఉంటుంది. చమురు అయిపోయిన తరువాత ఆ దీపం ఆరిపోతుంది. మృతి చెందిన శవానికి యింక తలంపులేముంటాయి?


  శ్రీ వేమన పద్య సారామృతము - భూపతి కృప నమ్మి భూమి జెరుచువాడు 

భూపతి కృప నమ్మి భూమి జెరుచువాడు 

ప్రజల యుసురు దాకి పడును పిదప 

యెగరవేయు బంతి యెందాక నిల్చురా 

విశ్వదాభిరామ వినుర వేమ! 

అర్థం:  ప్రభువు దయను నమ్మి భూమిని పాడుచేసేవాడు ప్రజల ఉసురు తగిలి పతనమైపోతాడు. ఎగరేసిన బంతి పైన ఎంతసేపుండును? 'వెంటనే అది క్రిందికి పడిపోతుంది.


  శ్రీ వేమన పద్య సారామృతము - పాప మనగ వేరె పరదేశమున లేదు 

పాప మనగ వేరె పరదేశమున లేదు 

తనదు కర్మములను దగిలియుండు 

కర్మతంత్రి గాక గనుకని యుంటొప్పు 

విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: పాపం అన్నది ఎక్కడో లేదు. అది తను చేసుకున్న కర్మననుసరించియే ఉంటుంది. కుత్సిత కర్మలు చేస్తూ సంబరపడడం కాక మంచి చెడులను చూసి మసలడం మంచిపని.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు