Pages

శ్రీ వేమన పద్య సారామృతము - వేమన పద్యాలు # 3

    శ్రీ వేమన పద్య సారామృతము - వరనారీ దూరగుడై, 

వరనారీ దూరగుడై, 

పరధనముల కానపడక పరహితచారై, 

పరులలిగిన తానలుగక 

పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమా!

అర్థం: పర స్త్రీలకు దూరంగా ఉండి, యితరుల సొమ్ముకు ఆశపడక పరుల మంచిని కోరుతూ, పరులను కోపింపక పరులు ఒకవేళ తనపై అలిగినా తాను కోపం తెచ్చుకోక పరులచేత సెభాష్ అనిపించుకున్నవాడే బుద్ధిమంతుడు.


  శ్రీ వేమన పద్య సారామృతము - అజ్ఞానము శూద్రత్వము, 

అజ్ఞానము శూద్రత్వము, 

సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా 

యజ్ఞాన ముడిగి వాల్మికి

సుజ్ఞానపు బ్రహ్మమొందె జూడర వేమా! 

అర్థం: జ్ఞానం లేనివాడే శూద్రుడనబడును. సుజ్ఞానం అనగా బ్రహ్మం. అది శ్రుతుల వినికిడి వల్ల లభ్యం అవుతుంది. కాబట్టి ఓ నరుడా! శ్రుతులను వింటూ వుంటాడు. అజ్ఞానం విడిచి వాల్మీకి మహర్షి సుజ్ఞానవంతుడై బ్రహ్మమును పొందినాడు కదా.


  శ్రీ వేమన పద్య సారామృతము - నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు 

నీళ్ళలోని చేప నెరి మాంస మాశకు 

గాల మందు జిక్కి గూలినట్లు 

యాశ బుట్టి మనుజు డారీతి జెడిపోవు 

విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నీటిలో హాయిగా జీవిస్తున్న చేప మాంసమందున్న మక్కువ చేత ఎరను పట్టబోయి గాలానికి చిక్కుకుని చస్తుంది. అలాగే మనుజుడు దురాశతో చెడిపోతున్నాడు.


  శ్రీ వేమన పద్య సారామృతము - బొంది యెవరి సొమ్ము పోషింప పలుమారు  

బొంది యెవరి సొమ్ము పోషింప పలుమారు 

ప్రాణ మెవరి సొమ్ము భక్తి సేయ 

ధనము యెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము 

విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం:  శరీరానికి ఎంత చేసినా చాలదు. ఇంతకీ ఆ శరీరం ఎవరిది? భక్తితో  కాలక్షేపం చేసే ప్రాణం ఎవరి సొమ్ము? ఇటువంటప్పుడు ధనం దేని సొమ్ము?   ఆలోచించగా ధనం కంటే ధర్మమే ప్రధానం.


  శ్రీ వేమన పద్య సారామృతము - నమశివ యనవచ్చు నారాయణనవచ్చు  

నమశివ యనవచ్చు నారాయణనవచ్చు 

మేలు వారి నమ్మి మెచ్చవచ్చు 

కొంగు కాసు విడిచి గొబ్బున నీలేడు 

విశ్వదాభిరామ వినుర వేమ!

అర్థం: నమశ్శివాయ అని పంచాక్షరిని జపించవచ్చు. నారాయణ మంత ఉచ్చరించవచ్చు. పుణ్య చరిత్రుల జీవితాలను గురించి తెలుసుకొని, విశ్వసించి వారిని ఎంతగానో శ్లాఘించవచ్చు. 

 శ్రీ వేమన పద్య సారామృతము - మేడిపండు జూడ మేలిమై యుండును 

మేడిపండు జూడ మేలిమై యుండును 

పొట్టవిప్పి చూడ పురుగులుండు 

బెరుకు వాని మదిని బింకె మీలాగురా

విశ్వదాభిరామ వినుర వేమ! 

అర్థం: చూడ్డానికి మేడిపండు ఎంతో బావుంటుంది. కాని దాన్ని విప్పి చూస్తే అన్నీ పురుగులే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఎన్నో వీరాలాపాలు చేస్తాడు. కాని లోపల మాత్రం అంతా పిరికితనమే. అతడు కనబరిచే బింకం అంతా మేకపోతు గాంభీర్యమే.

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు