Pages

Telugu Grammar - మాదిరి ప్రశ్నలు - సంధులు, సమాసాలు

 Telugu Grammar - మాదిరి ప్రశ్నలు - సంధులు, సమాసాలు 

1. పితౄ  ణము పదాన్ని విడదీసి రాస్తే

ఎ) పితౄ  + ఋణం   బి) పితృ + ఋణం  సి) పితృ + రుణం  డి) పితృ  + ఋణము     (బి)

 2. ఒకే స్థాన కరణ ప్రయత్నంలో ఉత్పత్తి అయ్యే అక్షరాలను ఏమంటారు?

ఎ) గుణాలు  బి) వృద్ధులు  సి) సవర్ణాలు  డి) స్వరాలు     (సి)

3. 'అత్యంత' పదాన్ని విడదీసి రాస్తే

ఎ) అత్య + అంత  బి) అత + యంత  సి) అత్య + ఆంత  డి) అతి + అంత     (డి)

4. 'య - వ - ర' లను ఏమంటారు?

ఎ) యణ్ణులు బి) వృద్ధులు సి) గుణాలు  డి) ఇక్కులు      (ఎ)

 5. పూర్వపర స్వరంబులకు పరస్వరం ఏకాదేశమగునుటను ఏమంటారు?

ఎ) సమాసము  బి) సంధి  సి) సవర్ణము  డి) అలంకారము    (బి)

6. ఈ క్రింది వాటిలో వృద్ధులు ఏవి?

ఎ) ఆ - ఈ  బి) ఏఐ  సి) ఐ ఔ  ಡಿ)ಓ ಔ        (సి)

7. 'వాజ్మ..యము' పదాన్ని విడదీసి రాస్తే 

ఎ) వాక్కు + మయము  బి) వాగ్ + మయము   సి) వాజ.. + మయము  డి) వాక్ +మయము        (డి)

8. 'నెమ్మనము' పదాన్ని విడదీసి రాస్తే?

ఎ) నెఱ + మనము  బి) నెమ్ని + మనము  సి) నెమ్ము + మనము  డి) నే + మనము     (ఎ)

9. 'ఏ - ఓ - ఆర్” లను ఏమంటారు?

ఎ) వృద్ధులు  బి) గుణాలు  సి) యజ్ఞులు  డి)త్రికాలు       (బి)

10. హింద్వార్యులు' పదం ఏ సంధి?

ఎ) గుణ సంధి  బి) వృద్ధి సంధి  సి) యణాదేశ సంధి  డి) సవర్ణదీర్ఘ సంధి      ( సి)

11. ఒక + ఒక కలిస్తే వచ్చే పదం

ఎ) ఒకొక  బి) ఒక్కొక  సి) ఒక యొక డి) ఒకానొక    ( డి)

12. 'మా + అత్త' పదాన్ని సంథి చేసి రాస్తే

ఎ) మాయత్త - బి) మా అత్త సి) మాయ యత్త డి) మాయఅత్త      (ఎ)

13. ఏకైక పదం ఏ సంధి?

ఎ) గుణసంధి  బి) వృద్ధి సంధి  సి) యణాదేశ సంధి  డి) సవర్ణదీర్ఘ సంధి     (బి)

14. రెండు అచ్చుల మధ్య సంధి జరుగనపుడు వచ్చే కార్యం ఏది ?

ఎ) వైకల్పికం  బి) నిత్యం  సి) యడాగమము  డి) నుగానమము        (సి)

15. ఈ క్రింది వాటిలో ద్విరుక్తటకార సంధి పదాలు

ఎ) కుట్టు సురు  బి) చిట్టెలుక  సి) కట్టెదరు  డి) పైవన్నీ   (డి)

16. సమాసంలో మొదటి పదం నామవాచకంగా, రెండో పదం విశేషంగా వచ్చే సమాసం పేరు?

ఎ) విశేషణోత్తర పదకర్మధారయం   బి) ఉపమాన పూర్వపద కర్మధారయం

  సి) విశేషణ పూర్వపదకర్మధారయం   డి) ఉపమాన ఉత్తర పదకర్మధారయం          (ఎ)

17. పదాంతంలోని 'క - చ - ట - త - ప' లకు 'న - మ' అనునాసికాలు పరమైతే వచ్చే సంధిని ఏమంటారు?

ఎ) యణాదేశ సంథి  బి) అనునాసిక సంధి  సి) జశ్త్వ సంథి డి) గుణసంధి          (బి)

18. ఇత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి

ఎ) యడాగమం  బి) బహుళం  సి) వైకల్పికం  డి) నిత్యం       (సి)

19. కేవల సంస్కృత పదాలతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?

ఎ) సాధ్యము  బి) మిశ్రమం  సి) ఆచ్ఛికం  డి) సిద్ధము              (డి)

20. స కారత వర్గానికి చ కార, చవర్గాక్షరాలు పరంగా వస్తే వరుసగా శకార చవర్గాక్షరాలే వచ్చే సంథిని ఏమంటారు?

 ఎ) జశ్త్వ సంధి బి) శ్చుత్వసంధి సి) విసర్గ సంధి డి) ష్టుత్వసంధి           (బి)

21. ఒకే పదాన్ని రెండు సార్లు ఉచ్ఛరించిన పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఏమంటారు?

ఎ) పునరుక్తి  బి) ఫుతం  సి) ఆశ్రుడితం  డి) ద్విరుక్తం         ( సి)

22. సంఖ్యావాచకం పూర్వ పదంగా ఉన్న సమాసం ఏది?

ఎ) ద్వంద్వము  బి) తత్పురుష  సి) బహువ్రీహి  డి) ద్విగువు            (డి)

23. 'ప్రతిదినం' పదం ఏ సమాసం? 

ఎ) అవ్యయిభావం                                    బి) ద్వంద్వము  

సి) విశేషణ పూర్వపదకర్మధారయం  డి) ఉపమాన పూర్వపద కర్మధారయం          (ఎ)

24. ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి

ఎ) వైకల్పికము  బి) నిత్యం  సి) బహుళం  డి) యడాగమం    (బి)

25. 'పది + తొమ్మిది' పదాలను సంధి చేసి రాస్తే

ఎ) పది తొమ్మిది బి) పది దొమ్మిది  సి) పందొమ్మిది డి) తొమ్మిది పది        ( సి)

26. ఇ - ఉ - ఋ లకు అసవర్ణము లైన అచ్చులు పరమగునపుడు జరిగే సంధి

ఎ) గుణ సంధి బి) యణాదేశ సంధి సి)  జశ్త్వ సంధి డి) శ్చుత్వ సంథి      (బి)

27. సమాసం అంటే? 

ఎ) పూర్వ సరస్వరాల కలయిక                            బి) బహువచనం 

 సి) రెండు విభిన్న పదాలు ఏక పదంగా కలయిక  డి) విభిన్న పదాలు    (సి)

28. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము?

ఎ) ఆదేశం  బి) బహుళం  సి) ఏకాదేశం  డి) వైకల్పికం       ( బి)

29. సమాసాలు దేన్ని అను సరించి ఏర్పడతాయి?

ఎ) అర్థాన్ని బట్టి  బి) శబ్దాన్ని బట్టి  సి) శబ్దార్థాలను బట్టి  డి) స్వతంత్రంగా   (సి)

30. కర్మధారయ యందలి పేదాది శబ్దాలకు 'ఆట' శబ్దము పరమగునపుడు

ఎ) టుగాగమంబగు  బి) రుగాగమంబగు  సి) నుగాగమంబగు  డి) దుగాగమంబగు     (బి)

31. సమాసంలో మొదటి పదాన్ని ఏమంటారు? -

ఎ) ఉత్తర పదం బి) తటస్థ పదం సి) పూర్వపదం డి) పూర్వోత్తర పదం           (సి)

32. మీగడ పదాన్ని విడదీసిరాస్తే

ఎ) మీ + కడ  బి) మీదు + కడ  సి) మీదు + గడ  డి) మీ + గడ        (బి)

33. 'తటా కోదకము' పదం ఏ సమాసం?

ఎ) సాధ్యము   బి) మిశ్రమం   సి) సిద్ధము   డి) ఆచ్ఛికం           (సి) 

34. సమాసంలో పదాల మధ్య సంబందాన్ని స్పష్టపరచేవి?

ఎ) ప్రత్యయం   బి) విగ్రహవాక్యం   సి) విభక్తి   డి) అర్థభేదం          (బి)

35. 'సిరివల్లభుడు' పదం ఏ సమాసం?

ఎ) సాధ్య సమాసం  బి) ఆచ్ఛిక సమాసం  సి) మిశ్ర సమాసం  డి) సిద్ధ సమాసం          (సి)

36. శబ్దాన్ని అనుసరించి ఏర్పడే సమాసాలు ఎన్ని? 

ఎ) రెండు  బి) మూడు  సి) నాలుగు  డి) ఐదు                 (బి) 

37. అర్ధాన్ని బట్టి సమాసాలు ఎన్ని విధాలు? 

ఎ) ఐదు  బి) నాలుగు  సి) ఆరు  డి) ఏడు             (సి) 

38. తత్యమ పదాలతో ఏర్పడే సమాసాన్ని ఏమంటారు?

ఎ) సిద్ధం  బి) సాధ్యం   సి) మిశ్రమం  డి) ఆచ్ఛికం                (బి)

39. విగ్రహవాక్యంలో 'అందు' ప్రత్యయం వచ్చే తత్పురుషం ఏది?

ఎ) ద్వితీయా  బి) తృతీయా  సి) సప్తమ  డి) పంచమీ             (సి)

40. 'రాజునాజ్ఞ' పదం ఏ సమాసం?

ఎ) సిద్ధము  బి) సాధ్యము  సి) మిశ్రమం  డి) ఆచ్ఛికం           (బి)

41. 'శీతోష్ణాలు' పదం ఏ సమాసం?

ఎ) విశేషణ పూర్వపద కర్మధారయం   బి) విశేషణోత్తర పదకర్మధారయం  

సి) విశేషణోభయ పదకర్మధారయం  డి) ఉపమాన పూర్వపద కర్మధారయం             (సి)

42. ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం పేరు?

ఎ) కర్మ ధారయం  బి) తత్పురుష  సి) ద్వంద్వము  డి) బహువ్రీహి            (బి)

43. అన్య పదప్రాధాన్యం గల సమాసం ఏది? 

ఎ) ద్విగువు  బి) ద్వంద్వము   సి) బహువ్రీహి  డి) విశేషణోత్తర పదకర్మధారయం                 (సి)

44. విశేషణ విశేష్యాలతో ఏర్పడే సమాసం ఏది ?

ఎ) తత్పురుష  బి) కర్మధారయం  సి) వ్యధికరణం  డి) ద్విగువు            (బి)    

45. 'పద్మముఖి' పదం ఏ సమాసం?

ఎ) ఉపమానోత్తర పదకర్మధారయం   బి) ఉపమాన పూర్వపదకర్మధారయం 

 సి) విశేషణోత్తర పదకర్మధారయం   డి) బహువ్రీహి          (బి)

46. కమలనాభుడు పదం ఏ సమాసం? 

ఎ) తత్పురుష                       బి) బహువ్రీహి   

సి) ఉపమాన పూర్వపదం  డి) ఉపమానోత్తర పదకర్మధారయం            (బి)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు