భర్తృహరి సుభాషితాలు - విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్
విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే.
అర్థం: పురుషునికి విద్యయే రూపము. విద్యయే రహస్యముగా దాచి పెట్టబడిన ధనము. విద్యయే సకల భోగములను, కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్యలేనివాడు మనుషుడే కాదు.
0 comments:
Post a Comment