Pages

Showing posts with label భర్తృహరి సుభాషితాలు. Show all posts
Showing posts with label భర్తృహరి సుభాషితాలు. Show all posts

భర్తృహరి సుభాషితాలు - ప్రాణిలోకంబు సంసార పతితమగుట

 భర్తృహరి సుభాషితాలు - ప్రాణిలోకంబు సంసార పతితమగుట 

ప్రాణిలోకంబు సంసార పతితమగుట 

వసుధపై గిట్టి పుట్టని వాడుగలడె 

వాని జన్మంబు సఫల మెవ్వాని వలన

వంశ మధి కోన్నతి వహించి వన్నెకెక్కు 

అర్థం: చావు పుట్టుకలు అనునవి ఎప్పుడును వుండు ఈ సంసార చక్రమున చచ్చి పుట్టని వాడే ఉండడు. పుట్టిన వారిలో నశింపనివాడు వుండడు. ఎవని పుట్టుకల వలన వంశము గొప్పకీర్తి చేత ప్రసిద్ధి చెందునో వాడే జన్మించినవాడు. వాని పుట్టుకే గణనీయమైనది అగును.

భర్తృహరి సుభాషితాలు - సత్యసూక్తి ఘటించు ధీజడిమ మాన్చు

భర్తృహరి సుభాషితాలు - సత్యసూక్తి  ఘటించు ధీజడిమ మాన్చు 

సత్యసూక్తి  ఘటించు ధీజడిమ మాన్చు

గౌరవమొసంగు జనులకు కలుషమడచు

 కీర్తి ప్రకటించు చిత్తవిస్పూర్తి జేయు

సాధుసంగంబు సకలార్థ సాధనంబు . 

అర్థం:మంచివారితో స్నేహము బుద్ధిమాంద్యమును పోగొట్టును. సత్యవాక్యములనే పలుకునట్లు చేయును. మనస్సును నిర్మలము చేయును. దిక్కుల యందు కీర్తిని వ్యాపింపజేయును. అది సకల ప్రయోజనములను కలుగ జేయును.


భర్తృహరి సుభాషితాలు - విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్

భర్తృహరి సుభాషితాలు - విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ 

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ 

విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్ 

విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్

విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే. 

అర్థం: పురుషునికి విద్యయే రూపము. విద్యయే రహస్యముగా దాచి పెట్టబడిన ధనము. విద్యయే సకల భోగములను, కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇట్టి విద్యలేనివాడు మనుషుడే కాదు.

భర్తృహరి సుభాషితాలు - తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

 భర్తృహరి సుభాషితాలు - తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు 

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు 

తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు 

అర్థం:ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూఢుని మనస్సును మాత్రము సమాధానపెట్టుట సాధ్యము కాదు.

భర్తృహరి సుభాషితాలు - తెలియని మనుజుని సుఖముగ

భర్తృహరి సుభాషితాలు - తెలియని మనుజుని సుఖముగ 

తెలియని మనుజుని సుఖముగ 

తెలుపందగు సుఖతరముగ తెలుపగవచ్చున్

దెలిసిన వానిం దెలిసియు

తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే. 

అర్థం: పూర్తిగా తెలియని వానికి సులభముగ దెలపవచ్చును. చక్కగా తెలిసిన వానికి తెలియచేయుట మరింత సులభము. కానీ స్వల్పజ్ఞానము కలిగి సర్వజ్ఞుడనని గర్వపడు వానిని సృష్టికర్త బ్రహ్మ కూడా రంజింపచేయలేడు.

భర్తృహరి సుభాషితాలు

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు