భర్తృహరి సుభాషితాలు - తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
అర్థం:ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందు నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్మునైనను సాధింపవచ్చును. కాని మూఢుని మనస్సును మాత్రము సమాధానపెట్టుట సాధ్యము కాదు.
0 comments:
Post a Comment