Pages

Showing posts with label ఎందుకని? - బాలల గేయం 7. Show all posts
Showing posts with label ఎందుకని? - బాలల గేయం 7. Show all posts

గేయం - Geyam



నాన్న అంగడికి పోయాడు
తీయటి బెల్లం తెచ్చాడు
       అమ్మ పిండితో కలిపింది
       బెల్లం కుడుములు చేసింది
అక్కకు , నాకు పెట్టింది
అన్నకు , చెల్లికి దాచింది
      మామయ్య ఇంటికి వచ్చాడు
      మామిడి పళ్ళు తెచ్చాడు 

ఎందుకని? - బాలల గేయం 7

కోయిల పాడే దెందుకని? పాటలు బాగా పాడమని 
కోడి కూసేదెందుకని ? వేకువ జామున లేవమని 
నెమలి ఆడేదెందుకని ?  ఆనందముగా ఉండమని 
ఉడత గంతులు ఎందుకని ? చింతలు లేక మెలగమని 
పావురం చెప్పేదేమిటని ? శాంతిని ఎపుడూ కోరమని 
తాబేలు చెప్పేదేమిటని ?తొందరపాటు తగదని 
సాలీడు చెప్పేదేమిటని ?పట్టుదలగ పైకెదగమని 
కుందేలు చెప్పేదేమిటని ?ఖుషీ ఖుషీ గా ఉండమని 
ఒంటెలు చెప్పేదేమిటని ? ఒంటరితనం వీడమని 
చేపలు చెప్పేదేమిటని ?చురుకుగా ఎప్పుడు ఉండమని 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు