Showing posts with label గేయాలు. Show all posts
Showing posts with label గేయాలు. Show all posts
తేనెల తేటల మాటలు - బాలల గేయం 8
తేనెల తేటల మాటలతో
మన దేశ మాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకుని
నవజీవన యానం చేయుదమా //తేనెల//
సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
స్వేచ్ఛాగానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు //తేనెల//
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే //తేనెల//
ఎందరొ వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరినీ తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని //తేనెల//
మన దేశ మాతనే కొలిచెదమా
భావం, భాగ్యం కూర్చుకుని
నవజీవన యానం చేయుదమా //తేనెల//
సాగరమేఖల చుట్టుకొని
సురగంగ చీరగా మలచుకొని
స్వేచ్ఛాగానం పాడుకొని
మన దేవికి ఇవ్వాలి హారతులు //తేనెల//
గాంగ జటాధర భావనతో
హిమశైల రూపమే నిలబడగా
గలగల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే //తేనెల//
ఎందరొ వీరుల త్యాగఫలం
మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరినీ తలచుకొని
మన మానసవీధిని నిలుపుకొని //తేనెల//
ఎందుకని? - బాలల గేయం 7
![]() | కోయిల పాడే దెందుకని? పాటలు బాగా పాడమని |
![]() | కోడి కూసేదెందుకని ? వేకువ జామున లేవమని |
![]() | నెమలి ఆడేదెందుకని ? ఆనందముగా ఉండమని |
![]() | ఉడత గంతులు ఎందుకని ? చింతలు లేక మెలగమని |
![]() | పావురం చెప్పేదేమిటని ? శాంతిని ఎపుడూ కోరమని |
![]() | తాబేలు చెప్పేదేమిటని ?తొందరపాటు తగదని |
![]() | సాలీడు చెప్పేదేమిటని ?పట్టుదలగ పైకెదగమని |
![]() | కుందేలు చెప్పేదేమిటని ?ఖుషీ ఖుషీ గా ఉండమని |
![]() | ఒంటెలు చెప్పేదేమిటని ? ఒంటరితనం వీడమని |
![]() | చేపలు చెప్పేదేమిటని ?చురుకుగా ఎప్పుడు ఉండమని |
Subscribe to:
Posts (Atom)









