Pages

Showing posts with label Vemana Poems. Show all posts
Showing posts with label Vemana Poems. Show all posts

Vemana Poem - Janana Maranamulaku

వేమన పద్యం - జననమరణములకు 
జననమరణములకు సరిస్వతంత్రుఁడు కా ఁడు 
మొదట ఁగర్తకా ఁడు తుదనుకా ఁడు 
నడుమఁ గర్తననుట నగుబాటుకాదొకో   
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:మూర్ఖుడు తానే సర్వమునకు కారణమని భావించి గర్వించుచుండును. పుట్టుకకు గాని, తుదకు మరణమునకుగాని తాను కర్తకాడు. నడుమమాత్ర మెట్లగును?

Vemana Poem - Kunda Chillipadina

వేమన పద్యం - కుండ చిల్లిపడిన 
కుండ చిల్లిపడిన గుడ్డ దోఁపఁగవచ్చు 
పనికి వీలుపడును బాగుగాను 
కూలఁబడిన నరుఁడు కుదురుట యరుదయా! 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:కుండకు రంధ్రం పడిన, దానికి గుడ్డను దోపిన యెడల,  ఆ కుండను ఉపయోగించవచ్చును. కాని మానవుడు చెడ్డతనమునకు దిగినచో తిరిగి మంచిదారికి రాదు. 

Vemana Poems - Kotinokati Decchi

వేమన పద్యం - కోతినొకటి  దెచ్చి క్రొత్తపుట్టము గట్టి  
కోతినొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి 
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్టు 
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు 
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:కొండముచ్చులు కోతిని తెచ్చి, కొత్త వస్త్రం కట్టి పూజించినట్టే, నిర్భాగ్యులు గుణము లేని వారిని కొలుస్తారు. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు