Pages

హాస్యం

తాయారు: (భర్తతో) ఈ కుక్కపిల్ల ఎక్కడిదండీ? నేను పుట్టింటికి వెళ్లేటప్పుడు లేదుగా?
కనకయ్య : నేనే తెచ్చా. నువ్వు ఊరు వెళ్ళినప్పటి నుంచి ఇల్లంతా సందడి లేకుండా పోయింది........!

బంగారయ్య : స్నానానికి వేన్నీళ్ళు కాచావా ?
తాయారు : లేదండి, చన్నిళ్ళే మరగించాను.
ఆఆఆఆఅ..........................

టీచర్ : అతిశయోక్తి కి ఒక మంచి ఉదాహరణ చెప్పు చంటి?
చంటి : మీరు పాఠం అద్భుతముగా చెబుతారు టీచర్.

డాక్టర్ : మీవారు బాగా విశ్రాంతి తీసుకోవాలమ్మ.అందుకని నిద్ర మాత్రలు రాస్తున్నాను.
అమ్ములు : ఎప్పుడెప్పుడు వేయమంటారు డాక్టర్ ?
డాక్టర్ : ఆ మాత్రలు ఆయనకి కాదమ్మా, నీకు!
ఆఆఆఆఅ..................................


డ్రైవర్  : సార్! పెట్రోల్ అయిపోయింది. కారు కొంచెం కూడా ముందుకు కదలదు....
అప్పారావు: సరే, అయితే వెనక్కి పోనీ!


బాబురావు: ఇప్పటికే ఆరు ఐస్ క్రీములు తెచ్చుకుని తిన్నావ్? పెళ్ళివారు ఏమనుకుంటారే?
అమ్ములు: నా గురుంచేమనుకోరు. ప్రతిసారీ మీకని చెప్పే తెస్తున్నాను! ఆ.........
నాని:ఏరా రాజు!నువ్వు ఒక జామకాయేగా కొన్నావ్.మరి మూడుఎలావచై?
రాజు:ఒకటే కొన్నా.రెండోది దొంగిలించి పారిపోతుంటే వాడు మరూ జామకాయ కొట్టాడు...! 


(ముగ్గరు పిల్లలు ఇలా మాట్లాడుకునతున్నారు )
మొదటి వాడు ఇలా చెబుతున్నాడు ;మా నాన్న రెండు  చేతులతో  కార్  నీ ఎత్తుతాడు 
రెండవ  వాడు  ఇలా చెబుతున్నాడు;మా  నాన్న  ఒక్క చేతితో  కార్  నీ ఎత్తుతాడు 
మూడవ  వాడు ఇలా చెబుతున్నాడు :మా నాన్న ఒకేసారి వంద  కార్లను  ఆపుతాడు
ఎలాగంటే ట్రాఫ్ఫిక్  పోలీసు  కాబట్టి.



0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు