Pages

వాన - బాలల గేయం 3

వెళ్ళిందీ ఎండాకాలం
భగభగ మంటలు మండే కాలం
వచ్చిందీ వానాకాలం
వర్షాలు కురిసే కాలం.

చిటపట చిటపట చినుకులు కురియా
బొటబొట బొటబొట ధారలు కారా
చూరుల వెంబడి ధారలు కారా
బాలుర కెంతో ఆనందం                                                 //వెళ్ళిందీ//

జలజల పారే నీటికాలువలో
పడవలగట్టి వదలంగా
చరచర చరచర పడవలు నడువా
అరయుట కెంతో ఆనందం                                           //వెళ్ళిందీ//

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు