- ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు "సంధి పదం" ఏర్పడుతుంది.
- రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను "తెలుగు సంధులు" అంటారు.
- వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల కలయికను "సంధి" అని, ఆ రెండు స్వరాల మధ్య జరిగే మార్పును "సంధి కార్యం" అని అంటారు.
- మొదటి పదం చివరి అక్షరంలోని స్వరాన్ని"పూర్వస్వరం" అని, రెండవ స్వరాన్ని"పరస్వరం" అని అంటారు.
సవర్ణదీర్ఘ సంధి
సూత్రము : అ - ఇ - ఉ - ఋ అనే వర్ణాలకు(సవర్ణాలు) కలిసినప్పుడు దీర్ఘం తప్పనిసరిగా రావడాన్ని "సవర్ణదీర్ఘ సంధి" అంటారు.
'అ' వర్ణానికి 'అ - ఆ' లు సవర్ణాలు
'ఇ ' వర్ణానికి 'ఇ - ఈ' లు సవర్ణాలు
'ఉ' వర్ణానికి 'ఉ - ఊ' లు సవర్ణాలు
'ఋ' వర్ణానికి 'ఋ - ౠ' లు సవర్ణాలు
ఉదాహరణలు: రామానుజుడు = రామ + అనుజుడు = (అ + అ = ఆ)
కవీంద్రుడు = కవి + ఇంద్రుడు = (ఇ + ఇ = ఈ)
భానూదయం = భాను + ఉదయం = (ఉ + ఉ = ఊ)
పితౄణం = పితృ + ఋణం = (ఋ + ఋ = ౠ)
(మరి కొన్ని ఉదాహరణలు: రామాలయం, కవీశ్వరుడు, వధూపేతుడు, మాతౄణం, విద్యార్థి, మహానందం, మహీంద్రుడు, కోటీశ్వరులు, సువర్ణాధ్యాయం, కరీంద్రం, సమరాంగణం, శుభారంభం, కపీంద్రులు)
ఉదాహరణలు :
ఉదాహరణలు :
మహాత్మ= మహా + ఆత్మ | జనార్థనుడు = జన + అర్థనుడు |
0 comments:
Post a Comment