భాస్కర శతకం - శ్రీగలభాగ్య శాలికడ
శ్రీగలభాగ్యశాలికడఁ జేరగఁగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగముచేసి రత్ననిలయం డనికాదె సమస్త వాహినుల్
సాగరుఁ జేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి భాస్కరా
తాత్పర్యము: మానవులెన్ని కష్టములు పడియైనను ధనవంతుని చెంతనే చేరెదరు.నదులెన్ని వంకలు దిరిగినా తుదకు రత్నములుగలవాడనియే కదా సముద్రుని చేరుట జరుగుతున్నది.
0 comments:
Post a Comment