నిత్యసత్యాలు - ఆణిముత్యాలు
ధర్మాన్ని మనం రక్షిస్తే - ధర్మం మనలను రక్షిస్తుంది. |
జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి. |
చేసిన మేలు మరచిపో - పొందిన మేలు గుర్తించుకో |
శ్రేష్టకర్మల జ్ఞానమే భాగ్యరేఖలు గీసే కలము |
చితి నిర్జీవులను కాలుస్తుంది - చింత సజీవులను దహిస్తుంది |
జీవితం కరిగిపోయే మంచు - ఉన్నంతలో నలుగురికి పంచు |
తినటం కోసం జీవించకు - జీవించటం కోసం తిను |
మణుగుల కొద్ది మాటల కన్నా - చిన్నమెత్తు ఆచరణ మిన్న |
కష్టాలు ఒంటరిగా రావు - అవి అవకాశాలను వెంట తీసుకువస్తాయి |
ఆచరణ లేని ప్రచారం పంట పండని భూమి వంటిది |
సంసార సాగరం దాటాలంటే - సంస్కారముల పరివర్తన కావాలి |
కోరికలు పెరిగే కొలది ఆనందం తగ్గుతుంది |
మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది |
శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు |
వాంఛల త్యాగమే మహోన్నతికి మార్గము |
0 comments:
Post a Comment