తెలుగు వ్యాకరణం - భాషా భాగములు
తెలుగు భాషలోని పదములను 5 విధములుగా విభజించవచ్చును. అవి:
1. నామవాచకములు
2. సర్వనామములు
3. విశేషణములు
4. క్రియలు
5. అవ్యయములు
1. నామవాచకములు : మనుష్యుల యొక్క గాని, జంతువులయొక్క గాని, వస్తువుల యొక్క గాని, పేర్లను తెలియ జేయు పదములను నామవాచకములు అందురు. నామవాచకములకు విశేష్యములని నామాంతరం కలదు.
ఉదా: శివుడు, గోవు, చెట్టు, చిలుక మొదలగునవి.
ఈ నామవాచకములు 4 విధములు.
1. సంజ్ఞా నామవాచకములు
2. జాతి నామవాచకములు
3. గుణ నామవాచకములు
4. క్రియా నామవాచకములు
1. సంజ్ఞా నామవాచకములు : దేశములు, కొండలు, నదులు మొదలగు వాని పేర్లను తెలియజేయు వానిని సంజ్ఞా నామవాచకములు అందురు.
ఉదా: ధర్మరాజు, ఆంధ్ర ప్రదేశ్, యమున, కృష్ణ మొదలగునవి.
2. జాతి నామవాచకములు: ఒక జాతిని గాని, తెగను గాని తెలుపు పదములను జాతి నామవాచకములు అందురు.
ఉదా: మనుష్యుడు, నది, పక్షి, చెట్టు మొదలగునవి.
3. గుణ నామవాచకములు : నామవాచకముల గుణములను తెలియజేయు పదములను గుణ నామవాచకములు అందురు.
ఉదా: ఎరుపు, తెలుపు, మంచి, చెడు మొదలగునవి.
4. క్రియా నామవాచకములు: క్రియల వలన పుట్టిన పదములను క్రియా నామవాచకములు అందురు.
ఉదా: పాడుట, తినుట, చదువుట, వండుట మొదలగునవి.
Super sir
ReplyDeletebut not open another Bhashabaagaalu