సుమతీ పద్యం - తలనుండు విషము ఫణికిని
తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
భావం : పాముకు విషం కోరల్లో ఉంటుంది. తేలుకు తోక చివరన ఉంటుంది. కానీ దుర్మార్గుడికి విషం శరీరమంతా వ్యాపించి ఉంటుంది. అందుచేత దుర్మార్గుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
0 comments:
Post a Comment