వేమన పద్యం - ఎలుగు తోలు తెచ్చి యెన్నాళ్లు నుదికినా
ఎలుగు తోలు తెచ్చి యెన్నాళ్లు నుదికినా
నలుపు నలుపే కాని తెలుపు కాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినా పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఎలుగు తోలు తెచ్చి ఎంత ఉతికినా నల్లగానే ఉంటుంది. కానీ తెల్లగా మారదు. అలాగే చెక్కబొమ్మను తెచ్చి ఎంత కొట్టినా అది మాట్లాడదు. అంటే ........ సహజ సిద్ద స్వభావాలు మార్చలేము.
0 comments:
Post a Comment