భాస్కర శతక పద్యం - ఎప్పు డదృష్టతామహిమ
ఎప్పు డదృష్టతామహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁ గాక యది యొప్పని పిమ్మట రూపు మాయఁగా
నిప్పున నంటియున్న యతినిర్మలినాగ్ని గురు ప్రకాశముల్
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా!
తాత్పర్యము : పురుషు డదృష్టమహిమ గలిగినంతవఱకును కళ గల్గియుండును. అది లేనప్పుడు, పూర్వపుయాకారమును విడుచును. అగ్నితోగలిసియుండు నంతఁ దనుక ప్రకాశించిన బొగ్గు ఆ యగ్ని చల్లారినంతనె నల్లనైపోవును.
0 comments:
Post a Comment