పోతన భాగవతం - మొదటి స్కంధము - ఆతత సేవఁ
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయసౌఖ్య విధాతకు వేద రాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకు గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్
తాత్పర్యం: చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడూ, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడూ, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడూ, నాయకుడై బృందారక బృందాన్ని దిద్ది తీర్చినవాడూ, భక్తుల పాపాలను పోకార్చిన వాడూ, దీన జనులను ఓదార్చినవాడూ, తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చినవాడూ ఐన మహానుభావుణ్ణి బ్రహ్మ దేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను.
0 comments:
Post a Comment