పోతన భాగవతం - మొదటి స్కంధము - వాలిన భక్తి మ్రొక్కెద
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికి( గపాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికిన్
తాత్పర్యం: కరాన ముమ్మొనవాలూ, ఉరాన పునుకల పేరూ, శిరాన నెలవంకా ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్ప దర్పహరుడు. పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రఫుల్లం కావించే ప్రభాకరుడు. నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెత్తిమ్మి విరులలో విహరించే మత్తమధుకరుడు.
0 comments:
Post a Comment