పోతన భాగవతం - ఆదర మొప్ప మ్రొక్కిడుదు
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రపన్న వినోదికి విఘ్నవల్లికా
చ్చేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్
తాత్పర్యము: హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి, కలికల్మషాలను భేదించి, ఆపన్నుల విన్నపాలను ఆమోదించి, ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకూ విశేష సంతోషాన్ని ప్రసాదించి, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లు కడుపు నిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి, ముల్లోకాలకూ మోదప్రదాయకుడైన వినాయకునకు కై మోడ్పులు ఘటిస్తాను.
0 comments:
Post a Comment