పోతన భాగవతం - క్షోణితలంబునన్
క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీక చయ సుందరవేణికి రక్షితామర
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్
తాత్పర్యము: నేలకు నెన్నుదురు సోకునట్లు సాగిలపడి మ్రొక్కి సైకత శ్రోణీ, చదువుల వాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను. ఆ చల్లని తల్లి ఒక చేతిలో అక్షమాలనూ, మరొకచేతిలో రాచిలుకనూ, ఇంకొకచేతిలో తామర పువ్వునూ, వేరొక చేతిలో పుస్తకాన్నీ ముచ్చటగా ధరిస్తుంది. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షిస్తుంది. తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరిస్తుంది.
0 comments:
Post a Comment