సామెతలు - అర్థం
సామెత | వివరణ |
అండ ఉంటే కొండలు దాటవచ్చు | సహాయసహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. |
గోరంతలు కొండంతలు చేయడం | చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పటం |
అందని ద్రాక్ష పండ్లు పుల్లన | దొరకని దానిలో లోపాన్ని ఎంచడం |
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు | ప్రయోజనం లేని శ్రమ |
అగ్నికి వాయువు తోడైనట్లు | ఒక బలవంతుడికి మరొక బలవంతుడు తోడై ఇంకా బలవంతుడు అవడం |
అంబలి తాగే వాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు | చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం |
అడవిపంది చేను మేస్తే, ఊరపంది చెవులు కోసినట్లు | తప్పు చేసిన వారిని శిక్షించలేక, నిరపరాధిని శిక్షించడం |
గుడ్డికన్న మెల్ల మేలు | అసలేమీ లేనిదాని కంటే, ఏదో ఒకటి ఉండడం మంచిది |
అభ్యాసము కూసు విద్య | అభ్యాసంతో ఎంతకష్టమైన పనైనా సులభమవుతుంది |
విత్తు మంచిదైతే, మొక్క మంచిదవుతుంది | ఆలోచన మంచిదైతే, ఫలితం కూడా బాగానే ఉంటుంది |
అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు | గొప్పతనం కోసం అర్హత లేని పనులు చేయడం |
ముంజేతి కంకణానికి అద్దమేల? | ఎదుట కనిపించేదానికి ఋజువు అవసరం లేదు |
అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం | ఉపకారికి అపకారం చేయడం |
ఆలూ లేదు, చూలూ లేదు అబ్బాయి పేరు సోమలింగం | పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచించడం |
అర్థ బలం కంటే అంగబలం ఎక్కువ | డబ్బుతో కంటే మానవసహాయంతో ఎలాంటి ఘనకార్యాన్నైనా సులభంగా సాధించవచ్చు |
మొక్కై వంగనిది మానై వంగునా? | మార్పు అనేది చిన్నవయసు లోనే రావాలి |
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు | అవసరాలు లోపాలను ఎంచనివ్వవు |
తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు | ఒక విషయాన్ని గురించి ఆరా తీస్తే, ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు |
ఆవును చంపి, చెప్పులు దానం చేసినట్లు | స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టం కలిగించడం |
చెలిమితో చేదైనా తినిపించవచ్చు కానీ బలిమితో పాలైనా తాగించలేము | మంచితనంతో ఏ పని నైనా సాధించవచ్చు |
ఇల్లు అలకగానే పండుగౌతుందా? | పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు |
గోరుచుట్టు మీద రోకటి పోటు | కష్టాల మీద కష్టాలు రావడం |
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి | అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం |
తింటే గాని రుచి తెలియదు, దిగితే గాని లోతు తెలియదు | స్వానుభవం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు |
అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు | అన్ని రకాలు గాను ఆటంకాలు కలిగించడం |
తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్లు | తన చేతిలో లేని పని |
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం | మన ప్రవర్తనను బెట్టే, ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది |
చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి | చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు |
ఎంత చెట్టుకు అంత గాలి | శక్తిని బట్టే ఫలితం కూడా ఉంటుంది |
మా తాతలు నేతులు తాగారు, మేము వారి మూతులు వాసన చూస్తున్నాము | సొంత ప్రతిభ లేకపోవడం |
కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం | ఎటూ చెప్పలేని పరిస్థితి |
తుంగ దించి బండను ఎత్తుకున్నట్లు | చిన్నచిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించి, అధిక కష్టాలను పొందడం |
ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే | ఎంత ప్రయత్నించినా, మంచి మంచిగానే ఉంటుంది. చెడు చెడుగానే ఉంటుంది |
తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది? | సహజ బలసంపద లేని విషయాలు కలకాలం నిలవవు |
ఏనుగునైనా ఎంటితో కట్టవచ్చు | ఐకమత్యంతో ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు |
గోడమీది పిల్లి వాటం | సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం |
ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు | అవసరం తీరాకా సహాయం చేసిన వారిని నాశనం చేసినట్లు |
సూపర్
ReplyDeleteనేను పేపర్లు చింపుతాను కానీ, పిచ్చివాడిని కాను..... నేను అడుక్కుంటాను కానీ, బిచ్చగాడిని కాను.... ఎవరు నేను....?
ReplyDelete