వేమన పద్యం - కుండ చిల్లిపడిన
కుండ చిల్లిపడిన గుడ్డ దోఁపఁగవచ్చు
పనికి వీలుపడును బాగుగాను
కూలఁబడిన నరుఁడు కుదురుట యరుదయా!
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:కుండకు రంధ్రం పడిన, దానికి గుడ్డను దోపిన యెడల, ఆ కుండను ఉపయోగించవచ్చును. కాని మానవుడు చెడ్డతనమునకు దిగినచో తిరిగి మంచిదారికి రాదు.
0 comments:
Post a Comment