వేమన పద్యం - గురువునకును
గురువునకును పుచ్చుకూరైన నీయరు
అరయ వేశ్యకిత్తు రర్థమెల్ల
గురుడు వేశ్యకన్న గుణహీనుడేమొకో!
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:మూర్ఖులు గురువు గారికి పుచ్చిపోయిన కూరగాయల నిచ్చుటకైన ఇష్టపడరు గాని వేశ్యకు కోరిన ధనము నిత్తురు. వేశ్య కంటె గురువు తక్కువ అని వారు భావింతురు.
0 comments:
Post a Comment