భాగవతం - ప్రథమ స్కంధం - అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్ర
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రి కా
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీథి విశ్రుత విహారిణి, నన్ గృపఁజూడు భారతీ!
తాత్పర్యం: అమ్మా! భారతీదేవీ! వికాసప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై, శరచ్చంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో, అలంకరించుకొన్న ఆభరణాల మణిదీప్తులు దిగ్ దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్తకవుల భావాంబర వీథులలో స్వేచ్చగా విహరించే బంగారుతల్లీ! నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు.
0 comments:
Post a Comment