Pages

Showing posts with label Mahabharata Quiz. Show all posts
Showing posts with label Mahabharata Quiz. Show all posts

The Mahabharata Quiz - part 5

                                                          మహాభారత క్విజ్ # 5
1. భారతంలో ఎన్ని క్లిష్టమైన శ్లోకాలు ఉన్నాయి? - (8800 శ్లోకాలు అతి క్లిష్టంగా ఉంటాయి)

2. భారతాన్ని పూర్తి చేసినప్పటికీ వ్యాసమహర్షికి ఎందుకు సంతృప్తి కలగలేదు? - (రచన పూర్తి అయింది. మానవాళికి అందించవలసి ఉంది. అందుకు ప్రచారం అవసరం. అందుకని వ్యాసుడు నలుగురిని ప్రచారానికి నియమించారు)

3. వ్యాసుడు ఎవరెవరిని ప్రచారానికి వినియోగించారు? - (దేవలోకంలో నారద మహర్షిని, పితృలోకంలో అసితదేవలుని, గంధర్వలోకంలో శుకదేవుని, మానవ లోకంలో వైశంపాయనుడిని నియమించారు)

4. జనమేజయుడు ఏ యాగం చేశారు? -  (సర్పయాగం)

5. సర్పయాగం సందర్భంగా వైశంపాయనుడు ఏం చేశారు? - (మహాభారత కథను వినిపించారు)

6. భారత కథ చెబుతున్న సమయంలో  అక్కడ ఎవరు ఉన్నారు? - (ఉగ్రశ్రవుడు)

7. ఉగ్రశ్రవుడు ఎవరి కుమారుడు? - (రోమహర్షణుని కుమారుడు)

8. మహాభారత ప్రాశస్త్యాన్ని ఏమని వివరించారు? - (సర్వప్రాణులకు వర్జన్యుడు జీవనప్రదాత. ఈ మహాభారత వృక్షం అటువంటిదే. కవులు రచించే ముఖ్య రచనలకు ఈ మహాభారతం వర్జన్యుని లాగ ఆధారభూతం అవుతుంది)

9. మహాభారతం గురించి ఇంకా ఏమని ప్రశంసించారు? - (ఈ పురాణం పూర్ణచంద్రుని వంటిది. వేదాల వెన్నెలలు విరజిమ్ముతుంది. మనిషిలో మనోహరమైన వెన్నెలలను విరబూయిస్తుంది అని ప్రశంసించారు)

The Mahabharata Quiz - part 4

మహాభారత క్విజ్ # 4
1. వ్యాసుడిని వేదవ్యాసుడు అని ఎందుకు అంటారు? - (వ్యాసుడు వేదాలను వ్యాసం చేయడం వల్ల వేదవ్యాసుడు అయ్యాడు)

2. వ్యాసుడు వేదాలను వ్యాసం చేసేనాటికి వేదాల స్వభావం ఎలా ఉండేది? - (ఆనాటికి వేదాలకు రూపం లేదు. ఏది కనపడినా దానిని వేదమనే పిలిచేవారు. ఏది వేదమో ఏది వేదం కాదో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఆ సమయంలో వ్యాసుడు వేదాలన్నింటినీ సేకరించాడు.)

3. వేదాలను ఎన్ని విభాగాలుగా విభజించాడు? వాటి పేర్లు ఏమిటి? - (4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం)

4. వేదాలను వ్యాసుడు ఇంకా ఏమి చేశారు? - (వేదాలను క్రోడీకరించి, మానవాళికి గొప్ప ఉపకారం చేశాడు. వేదప్రమాణాలను గ్రహించడానికి ఒక మార్గం ఏర్పరిచారు. అలా ఒక మహత్కార్యం, బృహత్కార్యం సాధించాడు)

5. ఇన్ని పన్నులు చేసిన వ్యాసుడి అంతరంగం ఏ విధంగా ఉంది? - (వ్యాసుని అంతరంగం  సంతృప్తికరంగా లేదు)

6. వ్యాసుడికి ఎందువలన సంతృప్తి కలగలేదు? - (వేదం కొందరికి మాత్రమే ఉపకరిస్తుంది)

7. వేదం అందరికీ ఉపయోగపడేలా వ్యాసుడు ఏం చేశారు? - (భారత సంహిత కల్పనకు పూనుకున్నారు)

8. భారతం దేనితో సమానమైనది? - (భారతం వేదాలతో సమానమైనది, పవిత్రమైనది, ఉత్తమమైనది. శ్రవ్యకావ్యాలతో ఉత్తమమైనది, పురాణమైనది)

9. భారత సంహితను ఎవరు సంస్తుతించారు? - (ఋషులు)

10. వేదవ్యాసుడు దేనిని కల్పించినాడు? - (భారత కావ్యాన్ని)

11. భారత కావ్య కల్పన చేసిన వ్యాసుని అంతరంగం ఎలా ఉంది? - (మరింత వ్యధ వ్యాసుని మనసులో మొదలైంది)

12. వ్యాసునిలో వ్యధ ఎందుకు మొదలైంది? - (కావ్యకల్పన జరిగింది కానీ, దీనికి అక్షర నిర్మాణం కావాలి. అది ఎలా ..... అనే  విచారం)

13. వ్యాసుడికి ఎవరు ప్రత్యక్షమయ్యారు? - (బ్రహ్మదేవుడు)

14. బ్రహ్మదేవునితో వ్యాసుడు ఏ విధంగా సంభాషించారు? - (దేవా! నేను మనసులో మహాభారతాన్ని సంకల్పించాను)

15. భారతంలో వ్యాసుడు ఏమేమి చేర్చాడు? - (వేదాల సారాన్ని, ఉపనిషత్తులను చేర్చారు. పురాణాలు వివరించారు, భూత - భవిష్యత్ - వర్తమానాలను వివరించారు, బాల్య , యవ్వన, జరామరణాల గురించి వివరించారు, భగవంతుడి అనేక అవతారాలను పరిచయం చేశారు.)

16. భారత సంహితను ఏవిధంగా పోల్చారు? - (సముద్రం, మేరు పర్వత రత్నాలకు నిలయం. భారత సంహిత అటువంటిదే)

17. అక్షరాకృతి ఎందుకు కావాలన్నారు? - (అక్షరాకృతి లేకపోతే లోకానికి, లోకులకు ఉపకరించదు. వారికి ఉపకరించని కావ్యం వ్యర్థం అని)

18. వ్యాసుని ప్రార్థనకు పరవశం చెందిన బ్రహ్మదేవుడు ఏమని చెప్పారు? - (మహర్షి!  నువ్వు లోకకళ్యాణం కోసం ఒక సంహితను సంకల్పించావు. దానికి అక్షరరూపం ఇవ్వగల శక్తి వినాయకుని మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయనను ప్రార్థించు' అని చెప్పి అంతర్థానమయ్యారు)

The Mahabharata Quiz # 4

మహాభారతం క్విజ్ # 4
1. వ్యాసుడి గుణగణాలు ఏమిటి? (వ్యాసుడు పరమ తేజస్వి, జ్ఞాని, లోకకల్యాణ కారకుడు.)

2. పరాశరుని మనోగతం ఎలావుంది? (పరాశరుడు సత్యవతిని చూసి ఆనందించాడు. వ్యాసుని చూసి మురిసిపోయాడు. ఇరువురినీ ఆశీర్వదించి తన దారిన తాను పోయాడు)

3. వ్యాసుని వేషధారణ ఏవిధంగా ఉంది? - (లేడిచర్మం ధరించాడు. ఎర్రటి జటాజూటాలు కలిగి, కమండలం ధరించాడు. తల్లికి మొక్కాడు)

4. వ్యాసుడు తల్లితో ఏమన్నాడు? - ("నేను తపస్సు చేసుకొనడానికి వెళ్తున్నాను. నీవు తలచుకోగానే వస్తాను" అని చెప్పాడు)

5. వ్యాసుడు తపస్సు కోసం ఎక్కడికి వెళ్ళాడు? - (బదరీవనానికి)

6. వ్యాసుడికి ఏమని పేరు వచ్చింది? - (బదరీవనానికి వెళ్లడం వల్ల బాదరాయణుడనే పేరు వచ్చింది)

The Mahabharata Quiz - part 3

                                                     మహాభారతం క్విజ్ # 3
1. మత్స్యగంధికి పరాశరుడు ఏమని వరమిచ్చాడు? - (ఆమె కన్యాత్వం వికలం కాదని వరమిచ్చాడు)

2. మత్స్యగంధి తన జన్మ గురించి ఏమని వివరించింది? - (తాను చేప కడుపున పుట్టినందున తన ఒంటి నిండ చేప వాసన ఉందని వివరించింది)

3. మత్స్యగంధి మీద మనసు పడిన పరాశరుడు ఏం చేశాడు? - (ఆమెను యోజన గంధిని చేశాడు. ఆమె శరీరం మీద నుంచి పరిమళాలు యోజనం వరకు వ్యాపించేలా వరం ఇచ్చాడు. నాటి నుంచి ఆమె యోజన గంధి అయింది)

4. యోజన గంధి అసలు పేరేమిటి? - (సత్యవతి)

5. సిగ్గుపడుతున్న సత్యవతిని చూసి పరాశరుడు ఏం చేశాడు? - (సత్యవతి వెలుగులో సిగ్గుపడుతుండటంతో, మంచుతెర కల్పించాడు. చీకటిని సృష్టించాడు)

6. సత్యవతిపరాశరులు ఎక్కడకు చేరుకున్నారు? - (కృష్ణద్వీపానికి)

The Mahabharata Quiz - part 2

మహాభారతం క్విజ్ # 2
1. వశిష్ఠుని కుమారుడు ఎవరు? - (శక్తి)

2. శక్తి కుమారుడు ఎవరు? - (పరాశరుడు)

3. పరాశరుని కుమారుడు ఎవరు? - (వ్యాసుడు)

4. వ్యాసుడి కుమారుడు ఎవరు? - (శుకుడు)

5. పరాశరుడు ఎక్కడకు బయలుదేరాడు? - (తీర్థయాత్రలకు)

6. పరాశరుడు ఏ నదికి చేరుకున్నాడు? -  (యమునా)

7. యమునా నది సమీపంలో ఎవరు కనిపించారు? - (మత్స్యగంధి)

8. మత్స్యగంధి ఎవరు? - (దాశరాజు కుమార్తె)

9. మత్స్యగంధి వృత్తి ఏమిటి? - (ప్రజలను నావ దాటించడం)

10. మత్స్యగంధిని చూసి పరాశరుడు ఏం చేశాడు? - (నావ ఎక్కాడు)

11. నది మధ్యలోకి వచ్చిన సమయంలో పరాశరునికి ఏం జరిగింది? - (మత్స్యగంధి మీద మనసు కలిగి ఆమెకు తెలిపాడు)

12. పరాశరుని మాటలకు మత్స్యగంధి ఏమంది? - (ఆ మహర్షి మాటలకు ఆమె సిగ్గు పడుతూ, తాను కన్యనని, తన కన్యత్వం చెడకూడదని అంది. )

The Mahabharata Quiz - part 1

మహాభారతం - క్విజ్ 
1. బ్రహ్మర్షులు సత్రయాగం నిర్వహించిన ప్రదేశం ఏది? - (నైమిశారణ్యం)

2. బ్రహ్మర్షులచే  సత్రయాగం చేయించిన ముని ఎవరు? - (శౌనకుడు)

3. శౌనకాది మునులకు మహాభారత కథను ఎవరు వినిపించారు? -  (ఉగ్రశ్రవనుడు)

4. మహాభారత రచన ఎంతకాలం సాగింది? - (మూడు సంవత్సరాలు)

5. దేవలోకంలో మహాభారతం వినిపించమని వ్యాసుడు ఎవరిని కోరాడు? -  (నారద మహాముని)

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు