భాగవతం - ప్రథమ స్కంధం - అమ్మల గన్నయమ్మ
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
తాత్పర్యం: ఆమె అమ్మలందరికీ అమ్మ. ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ. అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ. మ్రుక్కిడులైన రక్కసిమూకలను ఉక్కడగించిన అమ్మ. నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండుగుండెలలో నివసించే అమ్మ. దయాపయోనిధియైన మాయమ్మ దుర్గాభవాని మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి.
0 comments:
Post a Comment