Pages

Showing posts with label Bhagavatham. Show all posts
Showing posts with label Bhagavatham. Show all posts

The Mahabharata Quiz - part 6

 1. పరీక్షిత్తు ఎవరి మనుమడు?(అర్జునుడు)

2. పరీక్షిత్తు ఎవరి కుమారుడు?(ఉత్తర అభిమన్యుల కుమారుడు)

3. ఎవరి తరవాత పరీక్షిత్తు రాజయ్యాడు?(పాండవుల తరువాత)

4. పరీక్షిత్తుకు దేని మీద మక్కువ ఎక్కువ?(వేట మీద)

5. పరీక్షిత్తు దేనిని వేటాడాడు అది ఎక్కడకు పరుగు తీసింది ? (మృగాన్ని, శమీక ముని ఆశ్రమంలోకి)

 6. శమీకుడు ఎటువంటివాడు?(శాంత స్వభావుడు, ఒక చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్నాడు )

7. పరీక్షిత్తు మృగం కోసం ఆశ్రమానికి వచ్చి ఏం చేశాడు? (తన మృగం కోసం మునిని అడిగాడు. ముని మౌనంగా ఉన్నాడు. దానితో పరీక్షిత్తుకి కోపం వచ్చి అక్కడ  చచ్చి పడి ఉన్న పాముని శమీక ముని  మెడలో వేసి, తన రాజధాని చేరుకున్నాడు)

8. శమీకుని కుమారుడు ఎవరు? (శృంగి. అతడు యోగి. బ్రహ్మ గురించి తపస్సు చేస్తున్నాడు)

9. శృంగి వద్దకు ఎవరు వచ్చారు? ( క్రుశుడు అనే ముని)

10. జరిగినది తెలుసుకున్న శృంగి ఏం చేశాడు?(దోసిటలోకి నీరు తీసుకుని, తన తండ్రిని అవమానిం చిన వాడు నేటికి ఏడవ నాడు తక్షక సర్పదష్టుడై మరణి స్తాడు' అని శపించాడు.)

భాగవతం - ప్రథమ స్కంధం - అమ్మల గన్నయమ్మ

భాగవతం - ప్రథమ స్కంధం - అమ్మల గన్నయమ్మ 
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె 
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, దన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా 
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. 

తాత్పర్యం:  ఆమె అమ్మలందరికీ అమ్మ. ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకూ మూలమైన అమ్మ. అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ. మ్రుక్కిడులైన రక్కసిమూకలను ఉక్కడగించిన అమ్మ. నమ్ముకొన్న వేల్పుటమ్మల నిండుగుండెలలో నివసించే అమ్మ. దయాపయోనిధియైన మాయమ్మ దుర్గాభవాని మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. 

భాగవతం - ప్రథమ స్కంధము - అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ

భాగవతం - ప్రథమ స్కంధం - అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్ర
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రి కా 
డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా 
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా 
వాంబరవీథి విశ్రుత విహారిణి, నన్ గృపఁజూడు భారతీ!

తాత్పర్యం:  అమ్మా! భారతీదేవీ! వికాసప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై, శరచ్చంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో, అలంకరించుకొన్న ఆభరణాల మణిదీప్తులు దిగ్ దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్తకవుల భావాంబర వీథులలో స్వేచ్చగా విహరించే బంగారుతల్లీ! నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు. 

భాగవతం - ప్రథమ స్కంధము - శారదనీరదేందు

                                  భాగవతం - ప్రథమ స్కంధము - శారదనీరదేందు  
శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం 
దార సుధాపయోనిధి సితతామర సామర వాహినీ శుభా 
కారత నొప్పు నిన్ను మదిఁగానఁగ నెన్నడు గల్గు భారతీ!


తాత్పర్యం : తల్లీ! భారతీ! తెల్లవి కాంతులు వెల్లివిరిసే శరన్మేఘకదంబమూ, శారదచంద్రబింబమూ, పచ్చకర్పూరమూ, పటీరమూ, రాజహంసలూ, జాజిచెండ్లూ, నీహారమూ, డిండీరమూ, వెండికొండా, రెల్లుపూలూ, ఆదిశేషుడూ, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రమూ, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా - ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జ్వలమైన ఉపమానాలు, అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా! 

భాగవతం - ప్రథమ స్కంధము - పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ

                                  భాగవతం - ప్రథమ స్కంధము - పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ 
పుట్టం బుట్ట శిరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్ 
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతు దత్సరిణి నా కీవమ్మ! యో యమ్మ! మేల్ 
పట్టున్ నాకగుమమ్మ! నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

తాత్పర్యం : అమ్మా సరస్వతీ! నేను శిరస్సు పై పుట్ట పెరిగిన ఆదికవి వాల్మీకిగా పుట్టలేదు. పడవలో ఫ్రభవించిన వ్యాసుడను కాను. కవికులతిలకుడైన కాళిదాసుడనూ కానమ్మా! అయినా తగుదు నమ్మా అని పురాణాన్ని తెలిగించటానికి పూనుకున్నాను. ఎం చెయ్యాలో, ఏమీ తోచటం లేదు. ఇటువంటి సమయంలో ఎటువంటి మార్గం అవసరమో అది నీవే నాకు అనుగ్రహించి 
నా చేయి పట్టుకొని నడిపించు, ముమ్మాటికి నిన్నే నమ్ముకున్నాను తల్లీ! నీవే నాకు ఆధారం. నాకు తెలుసు తల్లీ! నీ కరుణ అపార పారావారం. 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు