Pages

పురాణం క్విజ్ - Mythography quiz

పురాణం ప్రశ్నలు - సమాధానాలు 
1. గాయత్రీ మంత్రం ఏ వేదంలోనిది? - (ఋగ్వేదం)

2. మన్మథుని మరోపేరు ఏమిటి? - (అనంగుడు)

3. విశ్వామిత్రుడిచ్చిన అస్త్రాలన్నింటినీ రామలక్ష్మణులు ఎక్కడ ధరించారు? - (మనసులో)

4. నచికేతునికి యముడు బోధించిన ఉపనిషత్తు పేరేమిటి? - (కఠోపనిషత్తు)

5. పూర్వజన్మలో అంజనాదేవి ఎవరు? - (పుంజికస్థల అనే అప్సరస)

6. శత్రువు శౌర్యాన్ని, తేజస్సును నశింపజేయగల అస్త్రం ఏది? - (తేజప్రభ)

7. పరీక్షిత్తు ఎవరి కుమారుడు? - (అభిమన్యుడు)

8. వశిష్ఠుడి వద్ద ఉన్న గోవు పేరేమిటి? - (శంబల)

9. జనకుడి సోదరుడు ఎవరు? - (కుశధ్వజుడు)

10. పూష, గభస్తిమాన్, సువర్ణ సదృశ, హిరణ్యరేత అనే పేర్లు ఎవరికీ ఉన్నాయి? - (సూర్యుడికి)

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు