పర్యాయపదాలు, నానార్ధాలు, పొడుపుకథలు కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు
1. "అంబోధి" పదానికి అర్థం?
1) సరస్సు 2) కొలను 3) సముద్రం 4) చెరువు (3)
2. ‘అహరహం’ అంటే అర్థం?
1) రాత్రి 2) పగలు 3) సాయంత్రం 4) ప్రతిదినం (4)
3. ‘ఈప్సితం’ అంటే అర్థం?
1) జుగుప్స 2) అసహ్యం 3) కోరిక 4) బీభత్సం (3)
4. ‘ఉద్వృత్తి’ అంటే అర్థం?
1) ఆపద 2) గర్వం 3) ఉపవృత్తి 4) భిక్షాటనం (2)
5. జతపరచండి.
పదం:
a) ఖలుడు b) హాలికుడు c) కులిశం d) కూర్మం
అర్థం
i) రైతు ii) నీచుడు iii) తాబేలు iv) వజ్రాయుధం
1) a-i, b-iii, c-ii, d-iv
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-i, b-ii, c-iv, d-iii (2)
6. ఒక పదానికి ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను ఏమంటారు?
1) నానార్థాలు 2) పర్యాయ పదాలు 3) వ్యుత్పత్త్యర్థాలు 4) జాతీయాలు (2)
7. 'అంబోధి' పదానికి పర్యాయ పదం ఏది?
1) సముద్రం 2) కడలి 3) సాగరం 4) పైవన్నీ (4)
8.'భేకం, దర్దురం, మండూకం' పర్యాయ పదాలున్న పదం?
1) మకరం 2) భ్రమరం 3) కప్ప 4) చేప (3)
9. ‘ఖగం’ పదానికి పర్యాయ పదం ఏది?
1) పక్షి 2) విహంగం 3) పులుగు 4) పైవన్నీ (4)
10. 'నిశ, యామిని, రజనీ' పర్యాయ పదాలున్న పదం?
1) రాత్రి 2) వెన్నెల 3) చీకటి 4) చంద్రుడు (1)
11. ‘కంఠీరవం’ పదానికి పర్యాయ పదం?
1) కేసరి 2) మృగరాజు 3) సింహం 4) పైవన్నీ (4)
12.ఒక పదానికి అనేక అర్థాలుంటే దాన్ని ఏమంటారు?
1) పర్యాయ పదాలు 2) నానార్థాలు 3) వ్యుత్పత్యర్థాలు 4) నైఘంటికార్థాలు (2)
13. ‘అనృతం’ పదానికి నానార్థాలు?
1) అసత్యం 2) సేద్యం 3) వాణిజ్యం 4) పైవన్నీ (4)
14.'మిత్రుడు' పదానికి నానార్థాలు?
1) సూర్యుడు 2) స్నేహితుడు 3) హితుడు 4) పైవన్నీ (4)
15. 'సింహం, గుర్రం, ఆంజనేయుడు' అనే అర్థాలున్న పదం?
1) పుండరీకం 2) కేసరి 3) కరము 4) అశని (2)
16. 'పుండరీకం' పదానికి నానార్థం కానిది?
1) పులి 2) తీయమామిడి 3) ఆకాశం 4) తెల్ల తామర (3)
17. 'గుణం' పదానికి నానార్థాలు?
1) వింటినారి 2) స్వభావం 3) దారం 4) పైవన్నీ (4)
18. 'కుండలి' పదానికి నానార్థాలు?
1) పాము 2) నెమలి 3) వరుణుడు 4) పైవన్నీ (4)
19. ఒక పదానికి సంబంధించిన పుట్టుక, నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసే పదాలు?
1) పర్యాయ పదాలు 2) వ్యుత్పత్త్యర్థాలు 3) నైఘంటికార్థాలు 4) నానార్థాలు (2)
20. ‘మరణం పొందనిది’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) అనృతం 2) ఘృతం 3) అమృతం 4) అనఘం (3)
21. ‘స్వభావం చేత ఐశ్వర్యం గలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) ఇంద్రుడు 2) విష్ణువు 3) కుబేరుడు 4) ఈశ్వరుడు (4)
22. ‘అజ్ఞానమనెడి అంధకారాన్ని పోగొట్టేవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) సూర్యుడు 2) చంద్రుడు 3) గురువు 4) దేవుడు (3)
23. ‘సాధువుల హృదయాన శయనించి ఉండువాడు మంగళ ప్రదుడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) బ్రహ్మ 2) శివుడు 3) విష్ణువు 4) ఇంద్రుడు (2)
24. ‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?
1) దశరథుని కుమారుడు 2) దశరథుని తమ్ముడు
3) దశరథుని పురోహితుడు 4) దశరథుని గురువు (1)
25. ‘పద్మము గర్భముగా కలవాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) బ్రహ్మ 2) విష్ణువు 3) ఇంద్రుడు 4) నారదుడు (1)
26. ‘పున్నామ నరకం నుంచి తప్పించువాడు’ అనే వ్యుత్పత్తి ఉన్న పదం?
1) కుమారుడు 2) పుత్రుడు 3) తనయుడు 4) ఆత్మజుడు (2)
27. ‘ఆదేశం, ఆన, ఉత్తరువు, నిర్దేశం’ అనే పర్యాయ పదాలున్న పదం?
1) ఆకరం 2) ఆరోపం 3) అనుమతి 4) ఆజ్ఞ (4)
28. పదాల అర్థం ఉన్నదున్నట్లుకాకుండా, దాన్ని పరిశీలిస్తే జాతి వాడుకలో ఉన్న ప్రసిద్ధమైన భాషా విశేషం స్ఫురించడాన్ని ఏమంటారు?
1) సామెత 2) జాతీయం 3) వ్యుత్పత్తి 4) పొడుపు కథ (2)
29. ‘చెవికి ఇంపును కలిగించు’ అనే అర్థంలో ఉన్న జాతీయం?
1) చెవిలో జోరీగ 2) చిలుక పలుకులు 3) వీనుల విందు 4) తలలో నాలుక (3)
30. ‘ఆరంభంలోనే ఆటంకం’ కలిగే సందర్భంలో ఉపయోగించే జాతీయం?
1) పురిటిలోనే సంధి 2) ఆరంభ శూరత్వం
3) ఆదిలోనే హంసపాదు 4) ఆదిలోనే ఆటంకం (3)
31.‘గురువు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టినందున రవి చెడిపోయాడు’- ఈ వాక్యంలో ‘పెడచెవినిపెట్టు’ అనే జాతీయానికి అర్థం?
1) విని ఆచరించడం 2) పూర్తిగా మునిగిపోవడం
3) చెప్పుచేతల్లో నడవడం 4) పట్టించుకోక పోవడం (4)
32. ‘విశేష జ్ఞానం సంపాదించు’ అనే అర్థం వచ్చే జాతీయం?
1) నల్లేరుపై బండినడక 2) నాలుగాకులెక్కువ చదవడం
3) భగీరథ ప్రయత్నం 4) నోరు మెదల్చడం (2)
33. అల్పాక్షరాల్లో అనల్ప భావాన్ని, అనుభవాన్ని సందేశాత్మకంగా అందించేదాన్ని ఏమంటారు?
1) జాతీయం 2) సామెత 3) పొడుపు కథ 4) తట్టుకథ (2)
34. 'సామెత'కు పర్యాయ పదాలు?
1) నానుడి-జనశ్రుతి 2) సుద్దు 3) సాటువ-శాస్త్రం 4) పైవన్నీ (4)
35. ‘ఉల్లి చేసే మేలు తల్లిైయెునా చేయదు’ అనేది ఏ రకమైన సామెత?
1) మనస్తత్వ సామెత 2) హాస్యపు సామెత 3) వైద్యపు సామెత 4) ఆరోగ్య సామెత (3)
36. ‘చిన్నతనంలో మాట విననివాడు పెద్దయ్యాక అసలే వినడు’ అనే అర్థంలో ప్రసిద్ధమైన సామెత?
1) హితం వినని మూర్ఖుడు 2) చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు
3) ఉట్టికెగరలేనివాడు స్వర్గానికెగిరినట్లు 4) మొక్కై వంగనిది మ్రానై వంగునా (4)
37. నిగూఢార్థస్ఫోరకంగా, అంతు చిక్కకుండా తికమకలు పెట్టేది?
1) జాతీయం 2) సామెత 3) పొడుపు కథ 4) నానుడి (3)
39. ‘నెత్తి మీద రాయి నోట్లో వేలు’ అనే పొడుపు కథకు అర్థం?
1) ఉంగరం 2) వడ్డాణం 3) తాయెత్తు 4) అంత్రం (1)
40.‘తండ్రి గరగర, తల్లి పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు’ ఈ పొడుపు కథకు విడుపు?
1) కొబ్బరికాయ 2) పనసపండు 3) దోసకాయ 4) బీరకాయ (2)
41. ‘కిటకిట తలుపులు కిటారు తలుపులు, ఎప్పుడు తీసినా చప్పుడు కావు’ ఏమిటవి?
1) చూపులు 2) కిటికీ తలుపులు 3) కనురెప్పలు 4) పెదవులు (3)
42. 'పుత్రుడు' పదానికి వికృతి?
1) తనయుడు 2) కొమరుడు 3) బొట్టెడు 4) బొట్టె (4)
43. ‘జాతర’ పదానికి ప్రకృతి?
1) జాత్ర 2) యాతర 3) యాత్ర 4) జాగృత (3)
45. ‘గరువము, జతనము’ అనే పదాలకు ప్రకృతి రూపాలు?
1) గారవము, ప్రయత్నము 2) గర్వము, యత్నము
3) గార్వము, ప్రయత్నము 4) గీము, ప్రయత్నము (2)
46.‘ధూర్జటి ’ అనే పదానికి అర్థం?
1) విఘ్నేశ్వరుడు 2) విష్ణువు 3) బ్రహ్మ 4) శివుడు (4)
47. 'వల్మీకం' అంటే అర్థం?
1) చెట్టు 2) ఊరు 3) పుట్ట 4) అడవి (3)
48. ‘దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం’ అనే అర్థం వచ్చే జాతీయం?
1) కాలుగాలిన పిల్లి 2) కడలో నీరు కదలకుండా
3) ఆటకట్టుచేయు 4) గోతికాడనక్క (4)
49. ‘ఇనుడు’ అనే మాటకు పర్యాయ పదాలు?
1) రవి, చంద్రుడు 2) రవి, ఇంద్రుడు 3) రవి, భానుడు 4) భానుడు, ఇంద్రుడు (3)
50.‘భృంగారం’ అనే మాటకు వికృతి?
1) భారం 2) భంగారం 3) బొంగరం 4) బంగారం (4)
51. ‘పారు’ అనే క్రియా రూపానికి నానార్థాలు?
1) పాలు, క్షీరం 2) ప్రవ హించు, పరుగెత్తు 3) కీర్తి, యశస్సు 4) ప్రవహించు, నాశనం (2)
52. ‘హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధ గతినందున్’ - ఈ వాక్యంలో ‘హరిత్తులు’ అనే పదానికి అర్థం?
1) పులులు 2) నాగళ్లు 3) సింహాలు 4) పాములు (3)
53. ‘వజ్రంబు శిరీష పుష్పంబులనూహించు భేదింప’ ఈ వాక్యంలో శిరీషపుష్పమనగా?
1) మంకెన పూవు 2) మోదుగు పూవు 3) దిరిసెన పూవు 4) సంపెంగ పూవు (3)
54.‘వారిజ గర్భుడు’ అను పదానికి పర్యాయ పదాలు?
1) సూర్యుడు, రవి 2) రవి, బ్రహ్మ 3) బ్రహ్మ, చతుర్ముఖుడు 4) రవి, చతుర్ముఖుడు (3)
55. ‘తాత, ముత్తాతల కాలం నుంచి వస్తున్నది’ అనే అర్థానిచ్చే పదం?
1) వంశపారంపర్యం 2) పెట్టింది పేరు 3) ఉట్టిపడుట 4) చూడముచ్చట (1)
56. ‘శ్రీరామ రక్ష, గీటురాయి, స్వస్తి వాచకం’ అనే మాటలు?
1) చిట్టిమాటలు 2) సామెతలు 3) జాతీయాలు 4) పెద్దల మాటలు (3)
57. ‘గురువు’ అనే పదానికి ఉన్న నానార్థాలు?
1) తండ్రి, పురోహితుడు, ఉపాధ్యాయుడు 2) తండ్రి, ఇంద్రుడు, పురోహితుడు
3) బ్రహ్మ, ఒజ్జ, ఇంద్రుడు 4) బ్రహ్మ, యముడు, సూర్యుడు (1)
58. సిరియె భోగోలబ్ధికి ‘జీవగఱ్ఱ’-ఈ వాక్యంలో ‘జీవగఱ్ఱ’ అనే జాతీయానికి వివరణ?
1) జీవనాధారం 2) చేతికర్ర 3) కొరత 4) లెక్కచేయక పోవడం (1)
59.‘యత్నం’ అనే పదానికి వికృతి?
1) యాగము 2) జతనం 3) జగం 4) జంధ్యము (2)
60. ‘ముద్ర’ అనే పదానికి నానార్థాలు?
1) చంద్రుడు, అచ్చువేయడం 2) గుర్తు, నీరు
3) ఒక అలంకారం, రెల్లు పూవు 4) గుర్తు, ఒక అలంకారం (4)
61. 'పనిలేక ఖాళీగా ఉన్నవాడు పనిచేస్తున్నవాడిని చెడగొట్టినప్పుడు' ఈ సామెతను ఉపయోగిస్తాం?
1) కందకులేని దురద కత్తికెందుకు 2) కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు
3) కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లు 4) కూసే గాడిదవచ్చి మేసే గాడిదను చెరిపినట్లు (4)
62. 'పారావారం' అనే పదానికి వ్యుత్పత్త్యర్థం?
1) ప్రజలను మేల్కొలుపునది 2) పనికిరాని పూర్వపు కథ
3) భూమిని ధరించునది 4) అంతులేని తీరంగలది (4)
0 comments:
Post a Comment