Pages

Showing posts with label సుమతి శతకం. Show all posts
Showing posts with label సుమతి శతకం. Show all posts

Sumati Padyalu - సుమతి పద్యాలు

తలనుండు విషము ఫణికిని
ఎప్పుడు దప్పులు వెదకెడు
చీమలు పెట్టిన పుట్టలు
కనకపు సింహాసనమున
శ్రీరాముని దయచేతను
తనవారు లేనిచోటను - సుమతీ పద్యం
సుమతీ శతకము - ఎప్పటి కెయ్యది ప్రస్తుత
సుమతీ శతకము - అప్పిచ్చువాడు వైద్యుడు
సుమతీ శతకము - ఎప్పుడు సంపద కలిగిన
సుమతీ శతకము - పాలసునకైన యాపద
సుమతీ శతకము - ఉపమింప మొదలు తియ్యన
సుమతీ శతకము - తన కోపమే తన శత్రువు
సుమతీ శతకము - పుత్రోత్సాహము తండ్రికి
సుమతీ శతకం - చీమలు పెట్టిన పుట్టలు
ఆకొన్న కూడె అమృతము
బలవంతుడు నాకేమని
Sumati Satakam - లావుగల వానికంటెను

Sumati Satakamu - అప్పిచ్చువాడు వైద్యుడు

సుమతీ శతకము - అప్పిచ్చువాడు వైద్యుడు 
అప్పిచ్చువాడు వైద్యుడు 
నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ !

భావము : ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండ ప్రవహించు 
               నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము. వారు లేనట్టి 
               గ్రామమందు నివసింపకు. 

Sumati Satakamu - ఎప్పుడు సంపద కలిగిన

సుమతీ శతకము - ఎప్పుడు సంపద కలిగిన 
ఎప్పుడు సంపద కలిగిన 
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్ 
దెప్పలుగ జెరువు నిండిన 
గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ!

భావము : మనకు ఎప్పుడైతే ఎక్కువగా సంపదలు చేకూరునో, అప్పుడు బంధువులు 
               అధికముగా వచ్చెదరు. అదెట్లనగా చెరువు నిండా నీరు జేరి అలలు వచ్చునట్టి 
               సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరును కదా! 

Sumati Satakamu - పాలసునకైన యాపద

సుమతీ శతకము - పాలసునకైన యాపద 
పాలసునకైన యాపద 
జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకుం 
దే లగ్ని బడగ బట్టిన 
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!

భావము : తేలు నిప్పులో పడినప్పుడు, దాని యందు జాలిపడి దానిని బయటకు 
               తీయుటకు పట్టుకొనినచో కుట్టును. కాని మనము చేయబోవు మేలును 
               తెలుసుకొన జాలదు. ఆ విధముగనే జాలిపడి మూర్ఖునకు ఆపద యందు 
               అడ్డుపడ జూచిన తిరిగి మనకపకారము చేయును కావుననట్లు చేయరాదు. 

Sumati Shatakamu - ఉపమింప మొదలు తియ్యన

సుమతీ శతకము - ఉపమింప మొదలు తియ్యన 
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెరుకు కైవడనే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ !

భావము : చెరుకుగెడ మొట్ట మొదట తియ్యగా నుండి, చివరకు పోయిన కొలది
               మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధము గనే పోల్చి
               చూడగా మోసగాడైన దుర్మార్గుడితోడి స్నేహము మొదట ఇంపుగా
               నున్నను చివరకు తప్పులకు వెదకుటకు ప్రారంభించును గదా. 

Sumati Satakamu - తన కోపమే తన శత్రువు

సుమతీ శతకము - తన కోపమే తన శత్రువు 
తన కోపమే తన శత్రువు 
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ 
తన సంతోషమె స్వర్గము 
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !

భావము : ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువగును. తన శాంతమే తనకు రక్షణగా 
               నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును. 
               తానూ సంతోషముగా నుండగలిగినచో అది స్వర్గముతో సమానము. తాను 
               ధుఃఖమును చేతులార తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యము. 

Sumati Satakam - పుత్రోత్సాహము తండ్రికి

సుమతీ శతకము - పుత్రోత్సాహము తండ్రికి
పుత్రోత్సాహము తండ్రికి 
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా 
పుత్రుని కనుగొని పొగడగ  
పుత్రోత్సాహమునాడు పొందుర సుమతీ !

భావము : ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు 
               గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన 
               సంతోషము కలుగును. 

Sumati Satakam - లావుగల వానికంటెను


లావుగల వానికంటెను
భావింపక నీతిపరుడు బలవంతుడౌ
గ్రావం బంత గజంబును
మావటి వాడెక్కినట్లు మహిలో సుమతీ!

అర్థాలు : లావు = బలం ; గ్రావం = కొండ ; గజం = ఏనుగు ; మావటి = ఏనుగును తోలేవాడు.

బావం : బలంగల వానికంటే నీతిగా ప్రవర్తించే వాడే మిక్కిలి బలవంతుడు. ఏనుగు బలమైనదే, కాని దానిని కూడా        నేర్పుతో అదలించి నడుపగలవాడు మావటివాడు. ఆకారం కంటే బుద్ధికుశలత ప్రధానమని భావం.
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు