Showing posts with label సుమతీ శతకం. Show all posts
Showing posts with label సుమతీ శతకం. Show all posts
Sumati Satakamu - అప్పిచ్చువాడు వైద్యుడు
సుమతీ శతకము - అప్పిచ్చువాడు వైద్యుడు
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ !
భావము : ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండ ప్రవహించు
నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసింపుము. వారు లేనట్టి
గ్రామమందు నివసింపకు.
Sumati Satakamu - ఎప్పుడు సంపద కలిగిన
సుమతీ శతకము - ఎప్పుడు సంపద కలిగిన
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెరువు నిండిన
గప్పలు పదివేలు జేరు గదరా సుమతీ!
భావము : మనకు ఎప్పుడైతే ఎక్కువగా సంపదలు చేకూరునో, అప్పుడు బంధువులు
అధికముగా వచ్చెదరు. అదెట్లనగా చెరువు నిండా నీరు జేరి అలలు వచ్చునట్టి
సమయమున వేల కొలది కప్పలు వచ్చి చేరును కదా!
Sumati Shatakamu - ఉపమింప మొదలు తియ్యన
సుమతీ శతకము - ఉపమింప మొదలు తియ్యన
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెరుకు కైవడనే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ !
భావము : చెరుకుగెడ మొట్ట మొదట తియ్యగా నుండి, చివరకు పోయిన కొలది
మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధము గనే పోల్చి
చూడగా మోసగాడైన దుర్మార్గుడితోడి స్నేహము మొదట ఇంపుగా
నున్నను చివరకు తప్పులకు వెదకుటకు ప్రారంభించును గదా.
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెరుకు కైవడనే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతిపొందు గదరా సుమతీ !
భావము : చెరుకుగెడ మొట్ట మొదట తియ్యగా నుండి, చివరకు పోయిన కొలది
మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధము గనే పోల్చి
చూడగా మోసగాడైన దుర్మార్గుడితోడి స్నేహము మొదట ఇంపుగా
నున్నను చివరకు తప్పులకు వెదకుటకు ప్రారంభించును గదా.
Sumati Satakamu - తన కోపమే తన శత్రువు
సుమతీ శతకము - తన కోపమే తన శత్రువు
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !
భావము : ఎవరికైననూ తన కోపమే తనకు శత్రువగును. తన శాంతమే తనకు రక్షణగా
నిలుచును. తను చూపెడి దయాగుణమే బంధువులవలె సహకరించును.
తానూ సంతోషముగా నుండగలిగినచో అది స్వర్గముతో సమానము. తాను
ధుఃఖమును చేతులార తెచ్చుకొనినచో అదియే నరకమగుట తథ్యము.
Subscribe to:
Posts (Atom)





