Pages

ఋతువులు

ఋతువులు 
చైత్ర, వైశాఖ మాసాల్లో
వసంత ఋతువు వస్తుంది
లేత చిగుళ్ళతో చెట్లను నింపుతూ
మనసు పరవశింపజేస్తుంది.
       
       జేష్ఠ, ఆషాడమాసాల్లో
       గ్రీష్మ ఋతువు వస్తుంది
      ఎర్రని సూర్యుని వేడిమితో
      భగభగ మంటలు రేపుతుంది.

శ్రావణ, భాద్రపదమాసాల్లో
వర్ష ఋతువు వస్తుంది
వానజల్లులు కురిపిస్తూ
చెరువులను నింపేస్తుంది.

       ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో
        శరదృతువు వస్తుంది
        చల్లని వెన్నెల కాంతులనిస్తూ
         మెల్లగ చలిని తెస్తుంది.

మార్గశిర, పుష్య మాసాల్లో
హేమంత ఋతువు వస్తుంది
మంచుబిందువులను కురిపిస్తూ
గజగజమని వణికిస్తుంది.

        మాఘ, ఫాల్గుణ మాసాల్లో
         శిశిర ఋతువు వస్తుంది
         పండుటాకులను రాల్చేస్తూ
         వసంత ఋతువును పిలుస్తుంది. 

0 comments:

Post a Comment

 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు