బహుళైశ్చిక ప్రశ్నలు
1. దిశాంచలము విడదీస్తే
ఎ) దిశా + అంచలము బి) దిశాం + చలము
సి) దిశ + అచలము డి) ది + శాంచలము (ఎ)
2. కురిసినట్లు + అనిపించింది
ఎ) కురినినట్టనిపించింది బి) కుర్సినట్టనిపించింది
సి) కురిసినట్లనిపించింది డి) కురిసినట్లు అనిపించింది (సి)
3. 'దారినిచ్చాం' ఏ సంధికి ఉదాహరణ
ఎ) సవర్ణదీర్ఘ సంధి బి) ఉకార సంధి
సి) ఇకార సంధి డి) గుణ సంధి (సి)
4. కిందివాటిలో వృద్ధి సంధికి ఉదాహరణ
ఎ) దుర్భరమైన బి) స్వచ్ఛతరోజ్జ్వల
సి) ఆంద్రాంబికా డి) అష్టైశ్వర్యాలు (డి)
5. వికార దుష్ట్రలు ఏ సమాసం?
ఎ) విశేషణోభయపద కర్మధారయం బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) విశేషణోత్తర పద కర్మధారయం డి) తత్పురుష సమాసం (బి)
6. రూపక సమాసానికి ఉదాహరణ
ఎ) తెలంగాణ రాష్ట్రం బి) విద్యాభ్యాసం
సి) మతపిశాచి డి) బీదరాలు (సి)
7. సమానపదంలో మొదటి పదంగా సంఖ్య ఉంటే అది?
ఎ) అవధారణ పద కర్మధారయం బి) ద్విగు సమాసం
సి) తత్పురుష సమాసం డి) ఉపమానోత్తర పద కర్మధారయం (బి)
8. అర్థభేదంతో హల్లుల జంట వెంట వెంటనే వాడితే దానిని.......
ఎ) లాటానుప్రాసాలంకారం బి) వృత్యనుప్రాసాలంకారం
సి) చేకాను ప్రాసాలంకారం డి) అంత్యానుప్రాసాలంకారం (సి)
9. కింది వాటిలో అంత్యానుప్రాసాలంకారానికి ఉదాహరణ?
ఎ) అరటి తొక్క తొక్కరాదు
బి) నగారా మోగిందా నయాగారాగుమిగిందా
సి) మెచ్చిన మచ్చికగల్గిన
డి) నీ శుభంకర కరములు (బి)
10. నీ శుభంకర కరములు ఏ అలంకారానికి ఉదాహరణ?
ఎ) ఉత్పేక్ష బి) రూపకాలంకారం
సి) చేకానుప్రాసం డి) లాటానుప్రాసం (సి)
11. కింది వాటిలో ఇంద్రగణం కానిది?
ఎ) 'న' గణం బి) 'భ' గణం సి) నగము డి) 'త' గణం (ఎ)
12. ఉత్పలమాల పద్యపాదంలో ఉన్న అక్షరాల సంఖ్య?
ఎ) 22 బి) 21 సి) 20 డి) 19 (సి)
13. స, భ, ర, న, మ,య, వ గణములు ఉండే పద్యం?
ఎ) ఉత్పలమాల బి) చంపకమాల
సి) శార్దూలం డి) మత్తేభం (డి)
14. ఇంద్ర గణాల్లో మూడక్షర గణాలు కింది వాటిలో ఏవి?
ఎ) 'హ ' గణం బి) 'వ' గణం, 'హ' గణం
సి) గలము, లగము డి) భ, ర, త (డి)
15. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలుండే పద్యమేది?
ఎ) తేటగీతి బి) ఆటవెలది సి) కందము డి) సీసం (బి)
16. కింది పద్యాల్లోని అన్ని పాదాల్లో సమాన గణాలు లేని పద్యం?
ఎ) ఆటవెలది బి) ఉత్పలమాల
సి) మత్తేభం డి) చంపకమాల (ఎ)
0 comments:
Post a Comment