వేమన పద్యం - వాన రాకడయును బ్రాణంబు పోకడ
వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
గానబడిన మీద గలియేట్లు నడచురా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి.
0 comments:
Post a Comment