వేమన పద్యం - చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: చెప్పులో పడిన రాయి, చెవి దగ్గర జోరీగ, కంటిలో పడిన నలుసు, కాలికి గుచ్చుకున్న ముల్లు, ఇంట్లో తగవులు చెప్పలేని బాధ కలిగిస్తాయి.
0 comments:
Post a Comment