వేమన పద్యం - చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం: మనసు పెట్టి చేస్తే ఏ చిన్న పనైనా సత్ఫలితాలనిస్తుంది. మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రిచెట్టు విత్తనము ఎంతో చిన్నది అయినా ఎంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసారా చేయమని భావము.
0 comments:
Post a Comment