తెలుగు అక్షరములు - 57
అందులో అచ్చులు - 16: ఇవి ప్రాణాక్షరములు - స్వరములు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ (అం అః)
హల్లులు - 38: ఇవి వ్యంజనములు
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
ఉభయాక్షరములు - మూడు; సున్న, అరసున్న, విసర్గము
అచ్చుల విభాగములు
హ్రస్వములు : 6 - అ ఇ ఉ ఋ ఎ ఒ
దీర్ఘములు : 6 - ఆ ఈ ఊ ౠ ఏ ఓ
వక్రములు : 4 - ఎ ఏ ఒ ఓ
వక్రతమములు : 2 - ఐ ఔ
హల్లుల విభాగములు
పరుషములు : 5 - క చ ట త ప
సరళములు : 5 - గ జ డ ద బ
ద్రుతము : 1 - న
స్థిరములు : 25 - ఖ ఘ ఙ ఛ ఝ ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ఱ ల ళ వ శ ష స హ
కేవల స్థిరములు : 10 - ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ
అనునాసికములు : 5 - ఙ ఞ ణ న మ
అంతస్థములు : 6 - య ర ఱ ల ళ వ
ఊష్మములు : 4 - శ ష స హ
వర్గములు
వర్గ ప్రథమములు : క చ ట త ప
వర్గ ద్వితీయములు : ఖ ఛ ఠ థ ఫ
వర్గ తృతీయములు : గ జ డ ద బ
వర్గ చతుర్థములు : ఘ ఝ ఢ ధ భ
వర్గ పంచమములు : ఙ ఞ ణ న మ
ఈ ఇరువది అయిదు స్పర్శములు
కంఠ్యములు : అ ఆ క ఖ గ ఘ ఙ హ
తాలవ్యములు : ఇ ఈ చ ఛ జ ఝ ఞ య శ
మూర్ధన్యములు : ఋ ౠ ట ఠ డ ఢ ణ ర ఱ ష
దంత్యములు : త థ ద ధ న ల స చ జ
ఓష్ఠ్యములు : ఉ ఊ ప ఫ బ భ మ
అనునాసికములు : ఙ ఞ ణ న మ
కంఠతాలవ్యములు : ఎ ఏ ఐ
కంఠోష్ఠ్యములు : ఒ ఓ ఔ
దంతోష్ఠ్యములు : వ
నాసిక్యము : 0
0 comments:
Post a Comment