వేమన పద్యం - కోతినొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి
కోతినొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి
కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్టు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యం:కొండముచ్చులు కోతిని తెచ్చి, కొత్త వస్త్రం కట్టి పూజించినట్టే, నిర్భాగ్యులు గుణము లేని వారిని కొలుస్తారు.
0 comments:
Post a Comment