Pages

Showing posts with label వేమన పద్యాలు. Show all posts
Showing posts with label వేమన పద్యాలు. Show all posts

వేమన పద్యాలు - మూర్ఖ పద్ధతి (Vemana Padyalu)

తన్నుజూచి యొరులు తగ 
తనలో సర్వం బుండ గ
తనదు బాగుగోరి
తగదు తగదటంచు
జననమరణములకు
కుండ చిల్లిపడిన
ఖరముపాలుతెచ్చి
గాడ్డెమేను మీఁద
గ్రుడ్డువచ్చి పిల్ల గోరడాలాడిన
గురువునకును
వేమన శతకము - ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు 
ఆలయ జేసి మలచి యడిగండ్లు మలిగండ్లు - మూర్ఖ పద్దతి
ఒకని జేరుతుమంచు నుల్లమందెంతురు - మూర్ఖ పద్దతి
ఎదుటనున్నవాని నెప్పుడు గానక - మూర్ఖ పద్దతి
ఎడ్డె దెల్పవచ్చు నేడాదికైనను - పద్యం
ఋషు లెరుగనట్టి విషయంబు భువిలేదు - మూర్ఖ పద్ధతి 7
ఉత్త తిత్తి దీని యుపయోగములు లేవు - మూర్ఖ పద్ధతి 6
ఇన్ని జాతులందు నేజాతి ముఖ్యమన్ - మూర్ఖ పద్ధతి 5
ఇంటియాలి విడిచి యిల జారకంతల - మూర్ఖ పద్ధతి
ఆసన మెరుగక యా నామకర్మంబు - మూర్ఖ పద్దతి
శ్రీ యన మంగళదేవత
శ్రీరామ యనెడు మంత్రము

Telugu Malika - Vemana Satakamu - Alpudeppudu Palku

వేమన శతకము - అల్పుడెప్పుడు బల్కు 
అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను 
సజ్జ నుండు బల్కు చల్లగాను 
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ. 

భావము : తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి 
               గలవాడు తగినంత మాత్రముగానే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా 
                బంగారము మ్రోగదు కదా!

Vemana Shatakamu - జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే

వేమన శతకము - జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే 
జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే 
జీవునరసి కనుడు శివుడె యగును 
జీవుడు శివుడను సిద్దంబు తెలియరా 
విశ్వదాభిరామ! వినురవేమ!

భావము : జీవుడికి, శివుడికి మధ్య బేధము లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే 
               జీవుడు. ఏ జీవిని హీనముగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి 
                తప్పటమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు. 

Vemana Satakamu - పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి

వేమన శతకము - పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి 
పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి 
పుష్పజాతి వేరు పూజ ఒకటి 
దర్శనంబులారు దైవంబు ఒక్కటె 
విశ్వదాభిరామ! వినురవేమ!

భావము : మనుషులంతా ఒకటే. పశువులు వేరు వేరు రంగులతో ఉన్నప్పటికీ అవి 
               యిచ్చే పాలుమాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనషులు వివిధ 
               వర్ణాలవారైనా మనసులు ఒకటిగా మసలు కోవాలంటాడు వేమన. పూవులు 
               వేరు వేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ 
               ఒక్కటే గదా! 

Vemana Satakamu - వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును

వేమన శతకము - వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును 
వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును 
చీడపురుగు చేరి చెట్టు చెరచు 
కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా 
విశ్వదాభిరామ వినురవేమ!

భావము : ఓ వేమ! ఓ మహావృక్షమునకు అడుగుభాగమున చేరిన వేరుపురుగు 
               ఆ వృక్షమును చంపి వేయును. ఒక చీడపురుగు చెట్టును నాశనము 
               చేయును. అట్లే దుర్మార్గుడు మంచివారిని చెడగొట్టును గదా . 

Vemana Satakamu - మేడిపండు చూడ మేలిమై యుండును

వేమన శతకము - మేడిపండు చూడ మేలిమై యుండును 
 
మేడిపండు చూడ మేలిమై యుండును 
పొట్ట విచ్చి చూడ పురుగులుండు 
పిరికివాని మదిని బింకమీలాగురా 
విశ్వదాభిరామ వినురవేమ !

భావము : ఓ వేమా ! పైకి మేడిపండు ఎఱ్ఱగా పండి చక్కగా కనిపించుచుండును. దానిని చీల్చి 
                చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యమును ప్రదర్శించినప్పటికి 
                పిరికితనమును కలిగియుండును. 

వేమన శతకము - ఓగుబాగెఱుగక యుత్తమూఢజనంబు

వేమన శతకము - ఓగుబాగెఱుగక  యుత్తమూఢజనంబు 

ఓగుబాగెఱుగక  యుత్తమూఢజనంబు
నిల సుధీజనముల నెంచ జూచు
కరినిగాంచి కుక్క మొరిగిన సామ్యమౌ,
విశ్వదాభిరామ వినురవేమా !

భావము : మూర్ఖులు మంచి చెడ్డలు గమనింపక బుద్ధిమంతులను లక్ష్యము చేయరు. దానివలన నష్టమేమి?
               ఏనుగు వెనుక కుక్క మొరిగిన, ఏనుగునకు నష్టమేమి?

Telugu Malika - గంగిగోవు పాలు గంటెడైనను చాలు

Telugu Malika - గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
గంగిగోవు పాలు గంటెడైనను చాలు 
కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ. 

 భావము : ఓ వేమ !  మంచి ఆవు పాలు గరిటెడు అయినను ఉపయోగముగా ఉండును. కాని కడవ నిండ ఉన్న గాడిద పాలతో పని యేమి ? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయిన చాలును గదా!

Telugu Malika - Vemana Padyam - చిక్కి యున్నవేళ సింహంబునైనను

వేమన  పద్యం - చిక్కి యున్నవేళ  సింహంబునైనను  
చిక్కి యున్నవేళ సింహంబునైనను 
బక్క కుక్క కరచి బాధచేయు 
బలిమిలేని వేళ బంతంబు చెల్లదు 
విశ్వదాభిరామ వినురవేమ !

అర్థాలు : బలిమి = బలం  ; పంతం = పట్టుదల 

భావం : సింహం మృగరాజు. దానికి జంతువులన్నీ భయపడతాయి. కానీ సింహం , నీరసించి బలహీనముగా ఉంటే బక్క కుక్క కూడా దానిని కరిచి బాధపెడుతుంది. అదేవిధముగా బలం లేనపుడు పట్టుదల , పౌరుషం పనికిరాదు. 

ఆలయ జేసి మలచి యడిగండ్లు మలిగండ్లు - మూర్ఖ పద్దతి

ఆలయ జేసి మలచి యడిగండ్లు మలిగండ్లు
తిరిపెమిడెడు కటికదేబెలెల్ల
నెలమి మన్నుదినెడి యెర్రలౌదురు సుమీ!
విశ్వదాభిరామ ! వినుర వేమా!

తాత్పర్యం : అతిధిని త్రిప్పి త్రిప్పి నానా బాధలు పెట్టి బిచ్చము పెట్టు మూర్ఖులు మరుజన్మలో మట్టి తినెడి ఎర్రలు(వానపాములుగా) గా పుట్టుదురు. 

ఒకని జేరుతుమంచు నుల్లమందెంతురు - మూర్ఖ పద్దతి

ఒకని జేరుతుమంచు నుల్లమందెంతురు
తమకు గలుగు చేటు తా మెరుగక
తమ్ము జెరుచువాడు దైవంబుకాడొకో!
విశ్వదాభిరామ ! వినుర వేమ!

తాత్పర్యం : ఇతరులకు హాని చేయదలచినచో తమకే హాని కలుగునని మూర్ఖులెరుగకున్నారు. ఒకరిని చెరుపదలచిన, దైవమే తమ్ము చెరుపగలడు.

ఎదుటనున్నవాని నెప్పుడు గానక - మూర్ఖ పద్దతి

ఎదుటనున్నవాని నెప్పుడు గానక
కుదుటివాని వెదుక బదరుచుండ్రు
పదట కొడుకులకును భయమేల గల్గదు?
విశ్వదాభిరామ ! వినుర వేమ !

తాత్పర్యం : మూర్ఖులు బట్టబయలు గా నున్న బ్రహ్మమును చూడలేక మారు మూలల దేవుని కొరకు వెదుకుదురు .అట్టి వ్యర్థులకు భయమేల కలుగదో తెలియకున్నది.

ఎడ్డె దెల్పవచ్చు నేడాదికైనను - పద్యం

ఎడ్డె దెల్పవచ్చు నేడాదికైనను
మౌని దెల్పవచ్చు మాసముననె
మొప్పె దెల్పరాదు ముప్పదేండ్లకునైన,
విశ్వదాభిరామ ! వినురవేమ !

తాత్పర్యం : జ్ఞానము లేని వానికి ఏడాది నాటికైనను బోధింపవచ్చును. మాటలాడక ఉండువానికి నెలలో బోధింపవచ్చును.కాని మూర్ఖునకు ఎన్నేండ్లు బోధించినను తలకెక్కదు.
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు