Pages

Showing posts with label వేమన శతకము. Show all posts
Showing posts with label వేమన శతకము. Show all posts

Vemana Shataka Padyalu

కోతినొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి
ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
చినుగుబట్ట కాదు చీనాంబరము గాని
రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నిక్కమైన మంచినీలమొక్కటి చాలు
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
చిక్కియున్న వేళ సింహంబు నైనను
ఎలుగు తోలు తెచ్చి యెన్నాళ్లు నుదికినా
ఆత్మశుద్ధి లేని యాచార మదియేల
వాన రాకడయును బ్రాణంబు పోకడ
మేక కుతికపట్టి
వేమన పద్యం - వేమననగ యోగి వెలసె లోకములోన
వేమన శతకము - అల్పుడెప్పుడు బల్కు
వేమన శతకము - జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
వేమన శతకము - పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి
వేమన శతకము - వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును
Vemana Satakamu - మేడిపండు చూడ మేలిమై యుండును
వేమన శతకము - తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
వేమన శతకము - అనువుగానిచోట నధికులమనరాదు
Telugu Malika - గంగిగోవు పాలు గంటెడైనను చాలు

Telugu Malika - Vemana Satakamu - Alpudeppudu Palku

వేమన శతకము - అల్పుడెప్పుడు బల్కు 
అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను 
సజ్జ నుండు బల్కు చల్లగాను 
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ. 

భావము : తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి 
               గలవాడు తగినంత మాత్రముగానే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా 
                బంగారము మ్రోగదు కదా!

Vemana Satakam - తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు

వేమన శతకము - తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు 
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు 
పుట్టనేమి వాడు గిట్టనేమి 
పుట్టలేని చెదలు పుట్టవా గిట్టవా 
విశ్వదాభిరామ వినురవేమ !

భావము :  ఓ వేమా ! తల్లితండ్రులపై ప్రేమ  లేని కుమారుడు పుట్టినను, చచ్చినను ఒకటే.
                 పుట్టలలో  పుట్టి ఎవరికి ఉపయోగము లేక ఆ పుట్టలోనే చచ్చెడు  చెదపురుగుల 
                 వలె తల్లితండ్రులపై  ప్రేమలేని కుమారుని జన్మము వ్యర్థము కదా. 

Vemana Satakam - అనువుగానిచోట నధికులమనరాదు

వేమన శతకము - అనువుగానిచోట నధికులమనరాదు 
అనువుగానిచోట నధికులమనరాదు,
కొంచెముండు టెల్ల కొదువ గాదు 
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినురవేమ !

భావము : మనకు తగని ప్రదేశములోను, గొప్పవారమనిగాని, ఎక్కువ మంచిది కాదు. మనకు 
               గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రమున 
               మన ఔన్నత్యమునకు భంగము కలగదు. కొండ ఎంత పెద్దదైననూ అద్దములో
               చూచినపుడు చిన్నదిగానే కనిపించును గదా ! 
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు