| జీవిత సౌఖ్యం - జీవితమందు సౌఖ్యం - సప్తమీ తత్పురుష సమాసం |
| ప్రత్యక్షం - అక్షుల యొక్క సమీపం - అవ్యయీభావ సమాసం |
| అస్థిరభావం - అస్థిరమైన భావం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
| అస్థిరం - స్థిరం లేనిది - నఞ తత్పురుష సమాసం |
| వెలగపండ్లు - వెలగ అను పేరుగల పండ్లు - సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం |
| శిల్పసంపద - శిల్పమనెడి సంపద - రూపక సమాసం |
| శతాబ్ది = నూరు సంవత్సరాలు గలది - బహువ్రీహి సమాసం |
| కృష్ణానది - కృష్ణ అను పేరుగల నది - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం |
| నవ్యాంధ్ర - నవ్యమైన ఆంధ్ర - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం |
| జీవితఘట్టాలు - జీవితమందలి ఘట్టాలు - సప్తమీ తత్పురుష సమాసం |
| వైభవోపేతం - వైభవముతో ఉపేతం - తృతీయా తత్పురుషసమాసం |
| కాలానుగుణం - కాలమునకు అనుగుణం - షష్ఠీ తత్పురుష సమాసం |
సమాసములు
నానార్థాలు
| ఉపాద్యాయుడు - గురువు, పురోహితుడు | కొమ్ము - ఏనుగు దంతం, శరీరం |
| వేరు - వేర్పాటు, మూలం | నరుడు - మానవుడు, అర్జునుడు |
| విద్య - జ్ఞానం, చదువు | పాదం - ఆంపాదం, పద్యపాదం |
నవ - క్రొత్త, తొమ్మిది
|
మేషం - మేక, రాశి
|
తుల - త్రాసు, రాశి
|
రాశి - కుప్ప, అందం
|
దృష్టి - చూపు, జ్ఞాపకం
| సమయం - కాలం, శపథం |
| దళము - గుంపు, ఆకు | ముద్ర - గుర్తు, ప్రభావము |
| అక్షము - బండి, ఇరుసు, కన్ను, సర్పం, జూదం, పాచిక | అనలము - అగ్ని, కృత్తిక, నల్లజీడి, మూడు అంకె |
| అనిమిషం - చేప, రెప్పపాటులేనిది | అరుణం - ఎరుపు, కాంతి, కుష్టు రోగం, బంగారం |
| అశని - వజ్రము, పిడుగు | ఆస్తరణం - ఎఱ్ఱ కంబళి, పరుపు, ఆసనం, ఏనుగు మీద పరిచే ఎఱ్ఱ కంబళి |
| ఇనుడు - సూర్యుడు, ప్రభువు, పోషకుడు, భర్త | ఇల - బుధుని భార్య, ఆవు, మాట, భూమి |
| ఉల్క - నిప్పు కణం, కాగడా | ఎద - హృదయం, భయం |
| కంఠీరవం - సింహం, మత్తగజం, పావురం | కదళీ - అరటి, ఏనుగు అంబారీ మీద టెక్కెం, ఇరవై అంగుళాల పొడవు ఉన్న లేడి |
| కరము - చెయ్యి, మిక్కిలి, తొండము, కిరణము | కరి - నిదర్శనం, ఏనుగు, కోతి |
| కల్యాణం - శుభము, బంగారం, పెండ్లి, అక్షయం | కారు - నలుపు, అడవి, వర్షర్తువు |
| కాయం - శరీరం, సమూహం, స్వభావం | కాలం - సమయం, నలుపు, చావు, తాడి (చెట్టు) |
| కుడ్యం - గోడ, పూత | కుశ - తాడు, నీరు, దర్భ, ఒక ద్వీపం |
| కేతనం - జెండా, ఇల్లు | ఖగము - పక్షి, బాణం, సూర్యుడు(గ్రహాలు), గాలి |
| గుణం - దారం, స్వభావం, వింటినారి | ఘటం - కుండ, శిఖరం, పాడునూయి |
| చరణం - పాదం, వేరు, కులం, పద్యపాదం | జలం - నీరు, ఎఱ్ఱ తామర, ఎఱ్ఱ కలువ |
| జిహ్వ - నాలుక, వాక్కు, జ్వాల | తార - నక్షత్రం, వాలి భార్య, కంటి పాప, ఓంకారం |
| తీర్థం - పుణ్యనది, జలం, ఉపాధ్యాయుడు, మంత్రి | తుండం - పక్షి ముక్కు, నోరు, ఖండం |
| దక్షిణ - ఒక దిక్కు, సంభావన | దర్శనం - చూపు, కన్ను, అద్దం, బుద్ధి, శాస్త్రం |
| దాహం - దప్పిక, కాలుట | దిక్కు - దిశ, శరణం |
| ధర్మం - పుణ్యం, న్యాయం, ఆచారం, యజ్ఞం | ధ్వని - శబ్దం, వ్యంగ్యార్థం |
| నందనుడు - కొడుకు, సంతోషపట్టేవాడు | పక్షం - వరుస, రెక్క, 15 రోజులు, వైపు |
| పదము - చిహ్నము, పాదము, స్థలము, అడుగు | పరిఘము - బాణం, గాజు, కుండ, దెబ్బ |
| పాకం - పంట, వంట, నారికేళాది కావ్యపాకలు | పావనం - జలం, గోమయం, రుద్రాక్ష, పవిత్రం |
| బుధుడు - పండితుడు, బుధ గ్రహం, వేల్పు, వృద్ధుడు | వస్రం - కోట, వరిమడి, తీరం |
| సూత్రం - నూలుపోగు, జంధ్యం, ఏర్పాటు | వివరం - రంధ్రం, దూషణ |
| హరి - విష్ణువు, సూర్యుడు, కోతి, కప్ప, గుఱ్ఱం | గుణము - దారము, వింటినారి, స్వభావము, విద్య, దయ |
| రాజు - ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, క్షత్రియుడు | ఆశ - కోరిక, దిక్కు |
| వీధి - త్రోవ, వాడ, పంక్తి | కులము - జాతి, వంశం, ఇల్లు, శరీరం |
| మిత్రుడు - స్నేహితుడు, సూర్యుడు, శత్రుదేశపురాజు | ధర - వెల, భూమి, మెదడు, సంహారము |
| నరుడు - మానవుడు, అర్జునుడు | కులము - వంశము, ఇల్లు, శరీరము, దేశము, జాతి |
| క్షేత్రము - భార్య, భూమి, వరి మడి, శరీరము, పుణ్య స్థలము | హరి - విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు, సింహం, పాము |
| చిత్రము - అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు (బొమ్మ) | అంకిలి - ఆపద, క్షోభ. |
| అంగుష్ఠం: బొటనవ్రేలు, అంగుళం. | అండజయు: పాము, చేప, పక్షి,తొండ, కస్తూరి. |
| అంతర్యామి: పరమాత్మ, జీవాత్మ. | ఆశరుడు: రాక్షసుడు, అగ్ని. |
| ఆర్యుడు: మంచివాడు, పూజ్యుడు. | ఆళి: పంక్తి, తేలు, చెలికత్తె |
| ఇష్టి: కోరిక, యజ్ఞం, కత్తి | ఈశుడు: రాజు, శివుడు, మన్మథుడు, సంపన్నుడు. |
| ఉక్తి: సరస్వతి, మాట. | ఉదాత్తుడు: గొప్పవాడు, ఇచ్చువాడు. |
| ఉమ: పార్వతి, కాంతి, పసుపు. | అక్షరం: వర్ణం, రూపం, నాశనం లేనిది, పరబ్రహ్మం. |
| అశని: వజ్రాయుధం, పిడుగు, మెరుపు. | సౌరభం: సువాసన, కుంకుమపువ్వు, ఎద్దు. |
| ధనం: విత్తం, ధనిష్ఠానక్షత్రం, ధనియాలు. | కేసరి: సింహం, గుర్రం, ఆంజనేయుని తండ్రి. |
| గురువు: ఉపాధ్యాయుడు, తండ్రి బృహస్పతి. | తీర్థం: పుణ్యక్షేత్రం, జలం, యజ్ఞం |
| శ్రీ: సంపద, లక్ష్మి, విషం, సాలెపురుగు | పుండరీకం: పెద్దపులి, తెల్ల తామర, తెల్ల గొడుగు. |
| కరము: చేయి, తొండం, కిరణం. | ఉద్యోగం: పని, అధికారం,యత్నం. |
| వ్యవసాయం: కృషి, పరిశ్రమ, ప్రయత్నం | సుధ: సున్నం,పాలు, అమృతం. |
| ఉచితం: ఊరక, తగినది, మితం. | తాత: బ్రహ్మ, తండ్రికి తండ్రి, తల్లికి తండ్రి. |
| గగనం: ఆకాశం, శూన్యం,దుర్లభం | శిఖ: సిగ, కొన, కొమ్ము. |
| భవం: పుట్టుక, బ్రతుకు, ప్రపంచం. | వాసము = ఇల్లు, వస్త్రము, పరిమళము |
| సూత్రము = నూలిపోగు, త్రాడు, (దారం), జంద్యము | చరణము = పాదము, కిరణము, పాతిక, పద్య పాదము |
| హరి = విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు | రత్నము = మణి, సూదంటురాయి, శ్రేష్ఠము |
| ఈశుడు = ప్రభువు, యజమానుడు, భర్త, శివుడు | ఛాయ = నీడ, సూర్యుని భార్య, కాంతి, ప్రతిబింబము |
| బ్రహ్మ = బ్రహ్మదేవుడు, బ్రాహ్మణుడు,బృహస్పతి, ఒక ఋత్విజుడు | పతి = భర్త, ప్రభువు, యజమానుడు, గతి |
| వాసము = ఇల్లు, వస్త్రము | చరణము = పాదము, పద్యపాదం, వేదభాగం,కిరణము |
| బలము = సత్తువ, సేన | పుణ్యము = సత్కర్మం, పవిత్రత, నీరు |
| హరి = విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప, గుఱ్ఱము, సూర్యుడు | సంతానం = బిడ్డ, కులము, వరుస, దేవతావృక్షం |
| బంధము = కట్టు, దేహం, సంకెల, దారం | భాగ్యం = సంపద, అదృష్టము |
| చైత్యం = గుడి, బౌద్ధాలయం, భవనం | అవధి = హద్దు, ఏకాగ్రత |
| కళ = శిల్పము, అందము, చంద్రుని 16 కళలలో ఒక భాగం, వడ్డీ | కవి = కావ్యం రాసేవాడు, శుక్రుడు, నీటిపక్షి |
| తీర్థము = పుణ్యనది, ఘట్టము, పుణ్యోదకం | పేరు = నామం, ప్రసిద్ధి |
| యాత్ర = జాతర, ముట్టడి, ఉత్సవం | రాజు = ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు, రేడు |
| మిత్రుడు - స్నేహితుడు, సూర్యుడు | కాలం - సమయం, చావు |
| వర్షం - వాన, సంవత్సరం, మబ్బు | జీవితం - బ్రతుకు, జీతం |
పర్యాయపదాలు
| ఆకాశం - నింగి , అంబరం | సముద్రం - సాగరం , అంబుది , సింధువు |
| దండు - మూర , గుంపు | నక్షత్రం - తార , చుక్క |
| ఆసక్తి - అభిరుచి , కోరిక | అరణ్యం - అడవి, వనం |
| తల్లి - మాత , జనని | తండ్రి - పిత , జనకుడు |
| అరణ్యం - అడవి,వనం | వైరం - శత్రుత్వం,విరోధం |
| ఉపాధ్యాయుడ - శిక్షకుడు,అధ్యాపకుడు | తల్లి - అమ్మ,మాత |
| తండ్రి - నాన్న,పిత | ఆసక్తి - ఇష్టం,ఉత్సాహం |
| దండు - గుంపు,సమూహం | ఉపాద్యాయుడు - గురువు , ఆచార్యుడు |
| వైరం - విరోధం , శత్రుత్వం | అంబోధి - సముద్రము, రత్నాకరవము |
| పుత్తడి - బంగారము, పసిడి | వసుధ - భూమి, ధరణి |
| పెండ్లి - పరిణయం, వివాహం | మిత్రుడు - స్నేహితుడు, నేస్తం |
| అజ - యుద్ధం, సమరము | ఈప్సితము - కోరిక, వాంఛ |
| అవని - భూమి, ధరణి | భృంగము - తుమ్మెద, ఉతృలము |
| తురంగము - గుఱ్ఱం, అశ్వం, వాజి | పంచాస్యం - సింహం, సింగం, కేసరి |
| విపత్తు - ఇడుము, ఆపద | ఏనుగు - మాతంగం, గజం, హస్తి |
| భుజంగం - సర్పం, ఫణి, వాతాశనం, పాము, పన్నగము | తనువు - శరీరం, దేహం |
| సత్యం - నిజం, యదార్థం | గురువు - ఆచార్యుడు, బృహస్పతి |
| ఖగము - పక్షి, విహంగము | అగ్ని - చిచ్చు, వహ్ని, అనలము |
| పువ్వు - పుష్పము, విరులు | అంధకారం = తమస్సు, తిమిరం, ఆంధ్యం |
| అక్షములు = కన్నులు, నేత్రాలు, నయనాలు | అనలుడు = అగ్ని, హవ్యవాహనుడు, వహ్ని, హుతభుక్కు |
| అనిమిషులు = దేవతలు, సురలు, అమరులు, త్రిదశులు | అభీష్టం - కోరిక, కాంక్ష, ఈప్సితం, ఆశ |
| అశని - పిడుగు, కులిశం, నిర్ఘాతము | ఆర్తవం - పుష్పం, సుమం, కుసుమం, పూవు |
| ఇక్షు - రసాలము, కరటము, అంగారిక, చెఱకు | ఇనుడు - సూర్యుడు, రవి, ద్యుమణి, నభోమణి |
| ఇల - భూమి, పుడమి, ఉర్వి, ధరణి | ఉరగము - పాము, సర్పము, ఫణి, అహి |
| ఎద - హృదయం, మది | కంఠీరవం - సింహం, మృగరాజు, కేసరి, పంచాస్యం |
| కదళీ - అరటి, రంభ, సప్తపర్ణము | కరము - చేయి, హస్తము, కేలు |
| కరి - ఏనుగు, హస్తి, గజము, ఇభము | కళ్యాణం - పెళ్లి, వివాహం, పరిణయం, ఉద్వాహం |
| కృషి - ప్రయత్నం, శ్రమ | కాయం - శరీరం, దేహం, తనువు |
| నుతి - పొగడ్త, స్తోత్రము, స్తుతి | పడతి - స్త్రీ, ఉవిద, ఇంతి, మహిళ, నవల, కొమ్మ |
| పవనాశనము - పాము, సర్పం, ఫణి | పావనం - పవిత్రం, పునీతం, పూతం |
| పుటభేదనం - పట్టణం, నగరం, పురం | బుధులు - పండితులు, విద్వాంసులు, కోవిదులు |
| భానుడు - సూర్యుడు, అర్కుడు, ఫూషుడు, రవి | వసనం - వస్త్రం, ఉడుపు, వలువ |
| వెండి - కలదౌతం, రజతం | రంతు - క్రీడ, ఆట, కేళి |
| వారిజం - పద్మం, సరసిజం, జలజం, తామర | వారిజగర్భుడు - బ్రహ్మ, చతుర్ముఖుడు, నలువ, విధి |
| శరధి - సముద్రం, వార్ధి, నీరధి, జలధి | సేతువు - వారధి, వంతెన |
| పుష్పము - పూవు, కుసుమం, విరి, సుమం | గుడి - దేవాలయం, ఆలయం, కోవెల |
| రాజు - ప్రభువు, భూపాలుడు, నృపాలుడు | కేలు - చేయి, హస్తం, పాణి |
| బాంధవుడు - బంధువు, చుట్టం | బాణము - అమ్ము, తూపు, మార్గణం, ఆశుగం |
| గురువు - ఆచార్యుడు, ఒజ్జ, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు | వేదండం - ఏనుగు, హస్తి, ఇభం, కరి |
| కీర్తి - యశస్సు, పేరు, శ్లోకం | దురితము - పాపం, అఘం, కిల్బిషం |
| జనని - తల్లి, అంబ, అమ్మ, మాత | బుధుడు - పండితుడు, విద్వాంసుడు |
| పుడమి - భూమి, ధరణి, అవని, వసుధ, ధర | ఏనుగు - కరి, గజము |
| కృపాణము - కత్తి, ఖడ్గము | కేలు - చేయి, హస్తము |
| జనని - తల్లి, అమ్మ | ఆకాశము - అంబరము, గగనము, అంతరిక్షము, నింగి |
| భూమి - వసుధ, ఉర్వి, ధరణి, ధరిత్రి | జిజ్ఞాస - ఆసక్తి, అభిరుచి |
| దృక్పథం - ప్రగతి, ఆలోచనా సరళి | ఇంచుమించు - దాదాపు, సుమారు |
| ఉపాధ్యాయుడు - ఆచార్యుడు, అధ్యాపకుడు | ఆసక్తి - కోరిక, ఇచ్ఛ, వాంఛ |
| పథం - మార్గము, త్రోవ | అమాంతము - అకస్మాత్తు, అదాటు, అటాత్తు, హఠాత్తు, ఏమరుపాటు, అదరి పాటు, |
| అమాయకుడు- అంబేద, గోల,బేలరి, మేదకుఁడు, నిష్కపటి వెర్రిబాగులవాడు. | అర్ధరాత్రి - అద్దమరేయి. నడిరాతిరి. నడి రేయి,మధ్య రాత్రమ,మాం దారి: ప్రొద్దు: నిశీధము |
| అర్జునుఁడు- ఫల్గునుఁడు. పార్థుడు. కిరీటి, శ్వేత వాహనుఁడు: బీభత్సుడు, విజయుడు, కృష్ణుడు, సవ్యసాచి, ధనంజయుఁడు; నరుడు, కఱ్ఱి, కవ్వడి, వివ్వచ్చుఁడు. క్రీడి. | అమావాస్య - అమవస, అమాస,దర్శము, అమావాసి, అమవాసి, అమావాసి: అమావస్య, కుహువు, అమామాసి, అమాసె, అమాస |
| అల - ఊర్మి, కడలు, కల్లోలము, తరంగము, భంగము; వీచిక, లహరి | అమృతము- ఘృతము, పీయూషము, సుధ. |
| అమ్మమ్మ- అవ్వ, మాతామహి. | అలాతము- ఆలాతము, కొరవి, ఉల్ముకము. అంగారకము |
| అమ్మవారు- అమ్మతల్లి, మశూచి, మసూరిక,పోటకము, స్పోటకము | అల్పుడు- వివర్ణుఁడు: పామరుడు. నీచుఁడు, నిహీనుఁడు, అపశదుఁడు, ప్రాకృతుఁడు |
| అమ్ములపొది- తూణము, తూణి, ఉపాసంగము, నిషంగము, అంపపాది, అంబులపొది. | అయస్కాంతము- అంటురాయి, కృష్ణ లోహము, సూదంటు, సూదంటురాయి. |
| అయివచ్చు- అచ్చివచ్చు, కలిసివచ్చు, అనుకూలించు, మేలైవచ్చు. | అల్లము - అనూవజము, అపాకశాకము: ఆర్థ(శా)కము. కందరము, భేషజము: మూలజము; రోలము, శృంగిబేరము; |
| అర- అర్ధ(ము), అద్ద, సగము; సవము; సాము | అరచేయి- అరచేయి; లోజెయ్యి; చప్పట, కరతలము; చపటము; చపేటము; ఉద్ఘతము, ప్రహస్తము. |
| అరటి చెట్టు- కదళి, వారణబుస, రంభ, మోచ,గిరిజ. | అల్లరి- గలాటా, గలిబిలి; గందరగోళము; గోల, రభసము, ఆగడము, గొడవ, గడబిడ, గలాభా. |
| అరిదళము- అలంతాళము, కనకప్రభము, గోదంతము, అలము, గోరోచనము, చిత్ర గంధము; తాలము, పింజరము, హరితాళము. | అల్లిక - అళియ, జామాత, అల్లువాడు, ప్రజాపతి, వరుడు, యామాత |
| అరుగు- తీనె, జగతి, వితర్ది, వేదిక,తిన్నె, తిన్నియ. | అల్లుడు- తంత వానము, తంతువాయము, నేత, పటకర్మము; వయనము; వ్యూతి, వానము. |
| ఆకురాయి- పత్రపరశువు, ఒరిపిడిరాయి, గరుకురాయి. | ఆర్తి- బాధ, ఆరాటము, ఉద్వేగము, క్షోభ, వ్యథ, వెత. |
| ఆజ్ఞ - ఆదేశము, ఆన, ఆనతి, ఉత్తరువు, నిర్దేశము, నివేశము, పంపు, శాసనము. | ఆటంకము-అడ్డగింత, అడ్డపాటు, అడ్డంకి, అడ్డు, అంకిలి, అవరోధము. |
| ఆలస్యము-క్షేపము, జాగు, తడవు, తడయుట, మసలుట. | ఆట- తాండవము, నటనము, నాట్యము, లాస్యము, నృత్యము, నృత్తము, నర్త నము. |
| ఆలిచిప్ప-గంగచిప్ప, కప్ప చిప్ప, కాకి చిప్ప, గంగాళి, చిప్ప | ఆటలమ్మ-ఆట్లమ్మ, తట్టు, పొంగు. |
| అడికోలు - దూరు, నింద, కారుకూత, దూషణము, దెప్పరము, ఎత్తిపొడుపు, అపవాదు, దెప్పు. | ఆళ్ళు- ఆళులు, ఆరుగలు, కోరదూషము, వరీరూషము. |
| అడుకుక్క-కుక్కురి, శుని, సారమేయి | ఆవాలు-అనఘము, ఆసురి, ఐంద్రము, క్షతకము, క్షవకము, తిక్తగంధ, నాసికావేదనము, వేసవారము, శ్వేతము, సిద్ధార్దము, సుతీక్షక |
| అడుగుఱ్ఱము - అర్వతి, గోడిగ, కంఖాణి, బడబ, వాజిని. | ఆశ్రేష - సప్పపుజుక్క, అసివేరు, అహి, ఉరగము, భుజంగము, వ్యాళము, సర్పము |
| అతతాయి-ఆకతాయి, అకార్యకారి, కొంటె, కూళ, తుంటరి, దుష్టుఁడు, బండడు. | ఆదివారము-ఆదిత్యవారము, భానువారము, రవివారము, ఆకులవారము. |
| ఆసక్తి-అపేక్ష, అనురక్తి, పరాయణత, వ్యసనము, శ్రద్ధ. | ఆనపకాయ-సొరకాయ, ఆనుగము, ఇక్ష్వాకువు, మహాఫల, తుంబిక. |
| ఇంగాలము- ఇంగలము, అంగారము, నిప్పు, అగ్ని, చిచ్చు, జ్వాలి, ధూమకేతువు, వహ్ని, సెగ, అనలము, అగిని, అగ్గి, హసనీమణి. | ఆనవాయితి-మామూలు, రివాజు, వాడుక, అలవాటు. |
| ఇంగిలీకము-అతిరక్తము, కర్కటశీర్షకము, జాతి, మణిరాగము, మణివారిజము, హింగుళకము. | అనవాలు-అభిజ్ఞానము, గురుతు, గుర్తు, చిహ్నము, పొడ, జాడ, చిన్నె, సంజ్ఞ, సంకేతము. |
| ఆపము-అతిరసము, అప్పము, అరిసె, చిప్పట్టు, పూర్ణకోశము; అపూపము. | ఇంగువ-కబరి, కేశరము, జతుకము, పృథ్వి, పృథువు, పిణ్యాకము, ఉగ్రగంధ |
| ఆముదము చెట్టు - ఏరండము, ఉరుబూకము, రుచకము, చంచువు, చిత్రకము, పంచాం గులము, మండము, వ్యడంబకము, వర్ధమానము | ఉభయ పార్శ్వములు- ఇరువంకలు, ఇరుదెసలు: ఇరుచక్కియలు, ఇరుగ్రేవలు; ఇరుగడలు |
| ఉమియుట- నిష్ఠీవనము; నిష్యూతి; నిష్ఠేవనము | ఉమ్మెత్త-ఉన్మత్తము; కితవము; ధూర్తము; కనకము; మదనము; గాంగేయము |
| ఉరుము - గర్జనము; ఘోష; రసితము; స్తనితము. | ఉలవలు-కులత్థ, వాలవృంతము. |
| ఉలిమిరి చెట్టు- మొగలింగ; కుమారకము; వరుణము; ఉలిమిడి; సేతువు. | ఊయల - డోలిక; జోల; లాలి; ఉయ్యెల: ఉయ్యాల; డోల; తొట్టె. |
| ఊరట - ఊరడి; ఓదార్పు, ఉవశమనము: అనునయనము. అనునయము | ఊసరవెల్లి- ముదిరిన తొండ; కామరూపి; కృకవాసము; చిత్రబింబము. |
| ఋజువు - తార్కాణము; దాఖలా; నిదర్శనము; సాక్ష్యము; రుజువు. | ఋణదాత-ఉత్తమర్ణుడు; ఋణదాయి; కుసీదుడు; షావుకారు. |
| ఋతుమతి-ఉదక్య, ఏకవస్త్ర, మలిని; మలిష్ట; ముట్టుత; త్రిరాత్ర. | ఋషి-తపసి; తపస్వి, తాపసి; మౌని; జడదారి. |
| ఉల్లిగడ్డ-ఉల్లి పాయ; ఎఱ్ఱగడ్డ; పలండువు; పలాండువు. | ఎంగిలి-ఉచ్చిష్టము; జుష్టము; ఫేలి; అదిష్టము; ఫేలము. |
| ఉవ్విళులూరు, ఉవ్విళ్ళూరు -తొందరపడు; త్వరపడు; తహతహలాడు; వేగిరపడు; ఆతురపడు. | ఎండ-ఆతపము; ద్యోతము; ప్రకాశము; ప్రొద్దు; వెలుగు |
| ఉసిరిక-అమృత; అనంత; ఆమలకి; తిష్యఫల, ధాత్రి; వయస్థ; రాధ; వజ్రము; నెల్లి. | ఎండమావులు-మరీచిక; మృగతృట్టు; మృగతృష్ణ |
| ఊడ - పడుగొమ్మ: అవరోహము; జట; బుధ్నము: మూలము; శిఫము. | ఎండు-ఈచు; మాడు; డొంకు; నీరారు; ఇగురు; ఇంకు; వాడు; వట్టిపోవు; శుష్కించు; శోషించు. |
| ఊడుగు- అంకోలము; కుందురువు; కుక్కటము; గిరికోలము; దీర్ఘకోలక. | ఎండ్రకాయ-ఎండ్రి; ఎండ్రిక, ఎండ్రకాయ; ఆరువు; కర్కటము; కర్కము; కుళిరము; పీత; వారిలోచనము |
| ఊతము-అండ; ఆధారము; ఆసరా; ఆలంబము; ఆనిక; ఊనిక; మోపిక. | ఎక్కిలి-ప్రాణంతి; వెక్కిలి; హిక్క, హేక్క, హృల్లాసము; ఎక్కిలి; వెక్క; వెక్కు. |
| ఊతు-ఊత; డొంకవల. | ఎడతెగని వాన-కుంభవృష్టి; ధారాపాతము,ముసురు. |
| ఎడబాటు-ఎడయుట; జతవీడుట; విప్ర యోగము, విప్రలంభము; వియోగము. | ఊదకడుపు- బానబొజ్జ, లంబోదరము; స్థూలోదరము; పొట్ట, బొజ్జ, |
| ఊపిరి-ఊర్పు; ఊష్మము; శ్వాసము; దమ్ము, | ఐకమత్యము-ఒందిక; పొందిక, ఒరిమ; పొత్తు; ఏకీభావము; సంఘీభావము. |
| ఒల్లెవాటు-ఒలెవాటు; వల్లెవాటు; వలెవాటు | ఓడ-కప్పలి; నౌక, నావ; రోకము; యాన పాత్రము; హాడము. |
| ఐక్యమగు-ఏకమగు; లీనమగు; లయమగు; మునుగు; లయించు. | ఓడనడుపువాడు- సరంగు; ఓడంగి; కర్ణధారుడు; పీలికాడు; ఆరకాటి; పోతవాహుడు; మార్గరుడు. |
| ఐరావతము- అభ్రమాతంగము; అభ్రము; వల్లభము; ఐరావణము; వెలిగౌరు. | ఐశ్వర్యము-సంపద, కలిమి; శ్రీ; సిరి; లచ్చి; భూతి; లక్ష్మి, |
| ఓణి-ఓణీ; ఓని; వల్లె; వాణి; పైటకండువా. | ఓర్పు- ఓరిమి; క్షమ; క్షాంతి; తాలిమి; తాళిక; తితిక్ష; సహనము; సైరణ, నిమ్మళము. |
| ఒంకి- ఒంకు; ఒంకె; కొక్కెము; వంకె; చిలుక కొయ్య. | ఔషధము-భేషజము; భైషజము; అగదము; జాయువు; మందు. |
| ఒంటె- లొట్టె; లొట్టిపిట్ట, ఉష్ట్రము; క్రమేలకము; మహాంగము; వాసంతము. | కంకు- గద్దించు; కసరు; గదుము; తిట్టు. |
| ఒగరు-కషాయము; కస్సెము; కసియము; తొగర; కారు; తవరము. | కంచము-తలిగ; తలియ; తళియ; పళ్ళెము; పళ్ళెరము. దడెము; తబుకు. |
| కంచర గాడిద-కంకర గాడిద; వేసడము; వేసరము; అశ్వఖరజము; అశ్వేతరము అశ్వతరము; ఖరము; గోకర్ణము; ప్రఖరము; అగరభము. | ఒడగట్టు-వడగట్టు; వడియగట్టు; వడబోయు. |
| ఒట్టు-ప్రతిజ్ఞ; ప్రతిన; ప్రమాణము; పణము; ప్రత్యయము; బాస; బిరుదు; బాఢము; శవనము; సంధ్య; సంగరము; శపథము; సమయము. | కంచు- కంచము; కాంస్యము; కాంసీయము; తామ్రార్థము; లోహము; కంసాస్థి |
| ఒడలు-అంగకము; ఒళ్ళు; మేను; కళేబరము; రూపు; బొంది | కంటె-కంటియ; కఠిక, కంటసరి. |
| కంఠము-అఱ్ఱు; కంధర; కంబువు; గొంతు; గొంతుక, కుతిక; కుత్తిక; కుత్తుక; మోర. | ఒడ్డాణము-ఒడ్డణము; ఒడ్యాణము; కలాపకము; కలాపము; కటిత్రము; శక్వరి |
| కండువా-ఉత్తరానంగము; ఉత్తరీయము; బృహతిక; బైరవాసము; ఖండువా, సంవ్యానము. | ఒడ్డు-కూలము; రోధము; తీరము; తలము; వప్రము; మర్యాద; దరి; గట్టు; శంబలము; సంబలము. |
| కండె - కండియ; కండెన; కంకి; కంకెన; వెన్ను. | కంతి-గుబ్బ, బుడిపి; బొప్పి; కదుము; కణితి; బొడప. |
| ఒత్తు- అదుము; అద్దు; తాచు; నొక్కు | ఒర-కోశము; గౌసెన, గవుసెన; పైతొడుగు. |
| ఒరవడి - ఆణి బంతి; మేలుబంతి; ఒజ్జబంతి; మాదిరి బంతి. | కడుగు-కుడితి; జ్యేష్ఠాంబువు; తండురీణము. |
| కడుపు- కుక్షి; గర్భము; ఉదరము; జఠరము; తుందము; డొక్క; బొజ్జ. | కంది- ఆఢకి; కరవీ భుజ; కాక్షితాలిక; పీత పుష్ప; ప్రగ్రీవ; వృత్తబీజ; సూప్య. |
| కణము- నెరసు; రవ్వ; రవ; నలుసు; జీరము; అంశువు; అణువు; రేణువు. | కందురీగ-కణుదురీగ; గండోలి; వరటము; భృంగము; భృంగరోలము; శూక కీటకము; గంధాలి; వరట. |
| కణుపు-కనుపు; కన్సు; గనుపు; గంటు; చెట్టె; పర్వము. | కత్తి-ఖడ్గము; అసి; రిష్టి; కృపాణము; కరవాలము; కౌక్షేయకము; చంద్రహాసము; రిష్టము; టంకము; వాలు; అడిదము. |
| కంబలి -ఊర్ణాయువు; కంబళము; కుతపము;కంబళి | కచోరము-గంధమాలిక; గంధాళి; గంధాహ్వ; గ్రంథిపర్ణి; ద్రావిడము; కచ్చురము. |
| కత్తిపిడి- ఆయుగము; జర; పరుజ; త్సరువు; తలము; సెమ్మలి; పరుజ. | కజ్జికాయ -కజాయము; కజ్జాయము; కజ్జియము; కజ్జెము. |
| కత్తెర- కర్తని; కర్తరి; కల్పని; ఖండదార; కేశకారము. | కదలునది-చలనము; కంపనము; కంప్రము; లోలము; చంచలము; తరళము; పరిప్లవము. |
| కటుక రోహిణి- అశోక; కటుంభర; కటువు; చక్రాంగి; శకులాదని. | కథ-ఆఖ్యాయిక; కత; ఇతివృత్తము; గాథ,చరితము; చరిత్రము. |
| కట్టాణిగుండ్లు- ముక్తావళి; ముక్తాహారము; ముత్తెసరము;ముత్తేసరి; ముత్యాల దండ. | కనుగ్రుడ్డు, కనుపాప -కనీనిక; కామనిక; గోలము; సింగనాదము; నల్లగ్రుడ్డు; కంటిపాప; పాప; తారకము; తారము |
| కట్నము-అరణము; ఉడుగర; వరదక్షిణ; శుల్కము. | కఠినము-కర్కశము; క్రూరము; కఠోరము; దృఢము. |
| కడ-అంతరము; అంతము; చరమము; చివర; తుద. | కనుబొమ్మ-ఆవి; కూర్చిక, కోదండము; భ్రూవు, బొమ. |
| కడవ-ఘటము; భాండము; కలశము; కరిరము; కుండ; కుంభము; కుటము | కన్నము-కంత; కలుగు; తూటు; బెజ్జము; రంధ్రము; బొక్క; క్రంత; బొరియ; బొర్రు |
| కడిమి చెట్లు- కదంబము; కర్ణపూరము; దూతఘ్ని; బలిప్రియము; వోఢము; సువాసము; సురభి. | కన్నీరు-అశ్రువు; నేత్రాంబువు; రోదనము; అస్రము; అస్రువు; బాష్పము. |
| కడియము-కటకము; వలయము; కడెము; (కిందివి రవ్వలు ముత్తెములతో కూడినవి) కంకణము; ముంగామురము; ముంగ (గా) మురారి. | కన్ను- అక్షి; చక్షుస్సు; చక్షువు; నేత్రము; నయనము; దర్శనము; దృక్కు, దృష్టి. |
| కన్య- కన్నె; కుమారి; బాలిక; వధూటి; వృషలి; చిన్నది; పిల్ల, | కంద-అర్మోఘ్నము; ఆర్మము; ఉల్లువు; ఓలము; కాలకచువు; ఓల్లము; కుష్ఠహంత, చిత్రదండకము; దుర్నామారి; మేహనాశము; శూరణము; వజ్రముష్టి; వనకుండలి; నూరణము; కండూరము; కంఠీలము. |
| పుణ్యము = సుకృతము, ధర్మము, కుశలము, శ్రేయము | ఓష్ఠము - పెదవి, అధరము, వాతెర |
| చరణము - పాదము, పదము, అడుగు,అంఘ్రి | అంబుదము - మేఘము, పయోధరము,జలదము, మబ్బు |
| సౌదామిని - మెరుపు, తటిత్తు, విద్యుల్లత | అనలం - అగ్ని, వహ్ని, చిచ్చు |
| మార్గం - దారి, పథము, బాట | అంబుధి - సముద్రం, సాగరం, పయోథి, పారావారం, కడలి, ఉదధి |
| పతివ్రత - సాధ్వి, పురంధ్రి, సతి | యవనిక = తెర, పరదా |
| శరీరం = తనువు, కాయం, మేను | గాథ = కథ, చరిత్ర, ఆఖ్యాయిక |
| సంపద = వైభవం, ఐశ్వర్యం | దీపము = దివిటీ, దివ్వె, తెల్లిక, దీపిక |
| పేరు = నామము, ఆఖ్య, అభిదానము | జాబు = ఉత్తరం, లేఖ |
| మిత్రుడు = స్నేహితుడు, నేస్తం | సముదాయం = గుంపు, రాశి, సమూహం |
| పల్లె = ఊరు, గ్రామం | పని = క్రియ, వ్యాపారం |
| రాత్రి = నిశ, యామిని | చెట్లు = తరువులు, వృక్షాలు, భూజములు |
రుగాగమ సంధి - సూత్రము - ఉదాహరణలు
రుగాగమ సంధి
ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి.
అ) పేదరాలు
ఆ) బీదరాలు
ఇ) బాలింతరాలు
పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాం. ఎట్లా మారాయో పరిశీలిద్దాం.
పేద + ఆలు = పేదరాలు
బీద + ఆలు = బీదరాలు
బాలింత + అలు - బాలింతరాలు
పేద + ఆలు -> పేద + ర్ + ఆలు = పేదరాలు
బీద + ఆలు -> బీద + ర్ + ఆలు = బీదరాలు
బాలింత + అలు -> బాలింత + ర్ + అలు = బాలింతరాలు
పై మూడు సందర్భాలలో పర పదం 'ఆలు'
పేద, బీద, బాలింత పదాలకు 'ఆలు' పరమైంది.
పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను 'పేదాదులు' అంటారు.
పేదాదిపదాలకు 'ఆలు' అనే పదం కలిసినప్పుడు 'ర్' అనే అక్షరం అదనంగా వచ్చింది.
'ర్' అనేది అదనంగా రావడాన్ని 'రుగాగమం' అంటారు.(ఒక వర్ణం మిత్రుడివలె అదనంగా చేరడమే 'ఆగమం'.)
దీన్నే ఇట్లా కూడా చెప్పవచ్చు
పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైనప్పుడు రుగాగమమవుతుంది.
పైన చెప్పిన మూడు పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం (నామవాచకం)
ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయమంటారు.
* కర్మధారయమందు పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే రుగాగమమవుతుంది.
పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి. విశ్లేషించండి.
ముద్దరాలు = ముద్ద + ఆలు
జవరాలు = జవ + ఆలు
మనుమరాలు = మనుమ + ఆలు
కొమరాలు = కొమ + ఆలు
పైన చెప్పిన పేదాది పదాలు తెలుగుపదాలు. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన (తత్సమ) పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం.
గుణవంత + ఆలు = గుణవంతురాలు
బుద్దిమంత + ఆలు = బుద్ధిమంతురాలు
శ్రీమంత + ఆలు = శ్రీమంతురాలు
ఈ సందర్భాలలో కూడా 'ర్' వస్తుంది. కానీ స్వల్పమైన తేడా వచ్చింది గమనించారా? అదేమిటో పరిశీలిద్దాం!
గుణవంత + ఆలు -> గుణవంత + ఉ+ ఆలు - > గుణవంతు + ఆలు - >గుణవంతు + ర్ + ఆలు - గుణవంతురాలు
శ్రీమంత + ఆలు - శ్రీమంత + ఉ + ఆలు
శ్రీమంత + ఆలు - > శ్రీమంత + ఉ+ ఆలు - > శ్రీమంతు + ఆలు - > శ్రీమంతు + ర్ + ఆలు ->శ్రీమంతురాలు
అలాగే
బుద్ధిమంత + ఆలు → బుద్ధిమంత + ఉ+ ఆలు → బుద్ధిమంతు + ఆలు - బుద్ధిమంతు + ర్ + ఆలు - > బుద్ధిమంతురాలు
పై మూడుచోట్ల తత్సమపదాలకు 'ఆలు' కలిస్తే మొదటిపదం చివర ఉన్న అచ్చు 'అ'కారానికి బదులు 'ఉ' కారము వచ్చి తరువాత రుగాగమయింది. దీన్ని ఇట్లా చెప్పవచ్చు.
కర్మధారయమందు తత్సమ శబ్దములకు 'ఆలు' శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివరఉన్న 'అకారానికి' ఉకారము వచ్చి రుగాగమం అయింది.
పద్యం - భావం
పద్యం - భావం
