Social Icons

Pages

Featured Posts

పొడుపు కథలు

అక్కాచెల్లెలి అనుబంధం. ఇరుగూ పొరుగూ సంబంధం. దగ్గర ఉన్నా చేరువ కాలేని వారెవరు? - కళ్లు  
ఎర్రని బండి, ఎగిరే బండి, మద్దూరి సంతలో మాయమైన బండేమిటి? - సూర్యుడు
అందచందాల వాడికి రోజుకో ఆకారం. చివరికి నిరాకారం లేదా నిండు సున్న. - చందమామ
చేతికి అందదు, కంటికి దొరకదు, ముక్కుకు అందును. - వాసన
చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు. - అక్షరాలు
చెట్టుకు పుట్టని కాయ కొరికితే భలే రుచి. - కజ్జికాయ 
చీర మీద చీర, పదహారు చీరలు. - ఉల్లి పొరలు
చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పటాల మెప్పుడు పక్కన ఉండు. - తేనెపట్టు
చిటపట చినుకులు చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. - కన్నీళ్ళు
ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయట పడ్డారు. - వేరుశనగ కాయ
ఐదువేళ్ళ అప్పడం గోడమీద కూర్చుంది. - పిడక
ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. - చిటికెన వ్రేలు
ఏడిస్తే ఏడుస్తుంది. నవ్వితే నవ్వుతుంది. - అద్దం
చక్కనమ్మ చిక్కినా చక్కనే. - సబ్బు
ఏరంతా ఇసుక బొక్కలే. - పట్టెమంచం
ఎందరు ఎక్కినా విరగని మంచం అందరిని మోసే మంచం. - భూమి
ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది. - విద్య
ఎగిరిన ఎగురును, ఉరికిన ఉరుకును. - నీడ
చాచుకొని సావిట్లో పడుకుంటుంది. ముడుచు కొని మూల నక్కుతుంది. - చాప
ఊరందరికి ఒకే దీపం. - చంద్రుడు
గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది. - చాప
ఊరంతా తిరిగినా గడప ముందొచ్చి ఆగుతాయి. - చెప్పులు
ఉద్యోగం లేదు సద్యోగం లేదు - ఊరంతా వ్యాపకమే. - కుక్క
గూటిలో గువ్వ, ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును. - నాలుక
ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం. - ముక్కు
గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. - కోడిగ్రుడ్డు
గబుక్కున లేచింది వన్నెల చిన్నెల వగలాడి. - గొడుగు
ఈకలు లేని కోడి ఇల్లెక్కింది. - సొరకాయ
ఇల్లంతా నాకి మూల కూర్చుంటుంది. - చీపురు
గట్టు కాలంగా బట్టలు ఆరవేస్తారు. - రొట్టె
కోటలేని రాజుకు కిరీటం ఉంది. - కోడిపుంజు
ఇల్లంతా వెలుగు బల్లక్రింద చీకటి. - దీపం
కోట గాని కోట. - తులసికోట
ఇచ్చేవాడు అతనే, పుచ్చుకొనేవాడు అతనే. - చేయి
కొప్పుందికాని జుట్టు లేదు. కళ్ళున్నాయి కాని చూపులేదు. - టెంకాయ
ఇంటిలో మొగ్గ, బయట పూవు - గొడుగు
ఆకులు లేకనే ప్రాకెడి తీగ. - కరెంటుతీగ
ఆకులేని చెట్టు గలగల మంది. - సంత
కూత వేసి పరుగు దీస్త. ఎరుపు చూస్తే ఆగిపోత! - రైలుబండి
ఆకుపుల్లన కాయచప్పన. - శనగకాయ
కంచం నిండా పరమాన్నం నువ్వూ తిన లేవు, నేనూ తినలేను. - సున్నం
అగ్గిమీద గుగ్గిలం అటూ యిటూ తప్పితే అరక్షణం. - అప్పడం
కాళ్ళు లేవు గాని నడుస్తుంది. కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. - మేఘం
కంటికి కనబడుతుంది. కాని గుప్పిట్లో పట్టను వీలుకాదు. - పొగ
కడుపు నిండగానే లేచి నిలబడతాడు. - గోనెసంచి
ఒంటి పై చేయివేస్తే కరవందే మానదు. - నిప్పు
ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం. - కరివేపాకు
ఆకారం పుష్టి నైవేద్యం నష్టి. - పుచ్చకాయ
అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నది ఎవరు? - ఉప్పు
అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది - చల్లకవ్వం
ఒక నోట్లో రెండు నాలుకలు - పాము
ఒక వైపు తింటూ ఒకవైపు కక్కుతాడు -  తిరగలి
అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు -  ఉల్లిపాయ
మోదం కాని మోదం? -  ఆమోదం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? -  పాలు, పెరుగు, నెయ్యి
రసం కాని రసం, ఏమి రసం? -  నీరసం
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? -  తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? -  లవంగ మొగ్గ
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? -  తేనె పట్టు
మూత తెరిస్తే, ముత్యాల పేరు? -  దంతాలు
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? -  సూర్యుడు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? -  దీపం
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? -  పత్తి పువ్వు
లాగి విడిస్తేనే బ్రతుకు? -  ఊపిరి
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? -  వేరుశెనగ కాయ
జాన కాని జాన, ఏమి జాన? - ఖజాన
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? -  ఉల్లిపాయ
అందమైన చిన్నది, అందాల చిన్నది, నువ్వు చుస్తే నిన్ను చూస్తుంది, నేను చుస్తే నన్ను చూస్తుంది? -  అద్దము
అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది? -  ప్రాణం
కాయలు కాని కాయలు, ఏమి కాయలు? -  మొట్టి కాయలు
అందని వస్త్రం పై అన్నీ వడియాలే? -  నక్షత్రాలు
నల్ల స్తంభం పైన నలుగురు దొంగలు? - లవంగం మొగ్గ
చిన్నోడి ఒంటినిండా నారబట్టలు - టెంకాయ
పళ్లు లేవు కానీ కరుస్తుంది - చెప్పులు
ఆ ఆటకత్తె ఎప్పుడూ లోపలే నాట్యం చేస్తుంది? నాలుక
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేల మీద కూలబడతాను- కెరటం
ఆకలేయదు, నీరు తాగదు, నేలని పాకదు... ఏమిటా తీగ? విద్యుత్తు తీగ
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. మామిడి పిందె
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? - తాటిచెట్టు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? - తేనెపట్టు
తండ్రి గరగర, తల్లి పీచుపీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవలు బొమ్మ రాళ్లు. ఎవరు వారు? - పనస కాయ
మూత తెరిస్తే ముత్యాల పేరు.- దంతాలు
చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం. తియ్యగా నుండు.ఏమిటది? - కొబ్బరి కాయ
ఎక్కలేని మానుకి దుక్కిలేని కాపు. - మిరప చెట్టు
ఊరంతటికీ ఒక్కటే దుప్పటి.ఏమిటది? - ఆకాశం
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. బాట వెంట పోయేవారిని కొంగు పట్టుకు లాగింది. - ముళ్లకంప
కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారి ఉంటుంది. కానీ ఏనుగు కాదు. - నత్త 
పచ్చని ఆకు, తెల్లని అన్నం, నల్లని కూర. ఏమిటది? సీతాఫలం
కాళ్లు, చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.-ఉల్లిపాయ
పర్వతమున పుట్టి, పయనించి అడవుల పట్టణాలు దాటి పరుగులెత్తి సమసి పోదుతుదకు జలరాశిలో దూకి - తెలుగుబిడ్డ! నన్ను తెలియగలవా? -  నది
మనుషుల్లేని దేశాలు నీళ్లులేని సముద్రాలు  మంచులేని ధ్రువాలు ఏమిటది? - ప్రపంచపటం
పులినిపట్టి బోనులో పెట్టే మనిషి ఇంత చిన్న జీవికి భయపడి తెరలచాటున దాక్కుంటున్నాడు? - దోమ 
రెక్కల్లేని పిట్ట. కళ్లు లేకపోయినా గురితప్పని దిట్ట. చందమామ ఒడిలో చేరాలని ఆరాటం .-  చంద్రయాన్ 
పాదములు నాల్గు గలవైన ప్రాణి గాను. చేరియుండును గణములు, శివుడ గాను. కలవలంకారములు పెక్కు, కాంత గాను తెలుగు బిడ్డనన్ను తెలియగలవె? - పద్యం 
గుండ్రని కుప్పెలో మంటలేని వెలుగు పగలంతా నిద్ర, రాత్రంతా జాగరణ. - ఎలక్ట్రిక్ బల్బ్ 
నూరు దుప్పట్లు కప్పుకుని మొద్దు నిదుర పోతుంది. దుప్పట్లను తీయాలంటే ఏడవటం తప్పదు మరి. - ఉల్లిగడ్డ 
తలపై పచ్చని కుచ్చుల టోపి కనిపించని ఎర్రని దొరసాని నాజూకుగ తయారై ఇంటింటా వంటింటికి నడిచొస్తుంది - క్యారెట్ 
హాయిగా కూర్చోపెట్టి ఇంటికి తీసుకుపోయే ఇల్లు, పరుగులు తీసే ఇల్లు. - బస్సు 
కొండలు దాటి, పట్టణాలు దాటి, అడవుల్లో నడచి మును ముందుకె సాగుతా, వెనుదిరిగే పనిలేదు, గమ్యం చేరేదాకా. -  నది
రెక్కలు ఉన్నాయి, పక్షి కాదు.చుక్కాని ఉంది, పడవ కాదు. కాళ్ళు లేవు, చకచకా కదిలిపోతుంది. - చేప 
వంకర లేని ఒకే పలువరస, కొరికానంటే కసకస,నున్నగ పరపర ముక్కలు చెక్కలు చేస్తా. -  రంపం
రెండు మెరిసే కొమ్ములతో మబ్బుల్లో తేలియాడుతుంటాను. చంద్రవంక 
చక చకా పోయేవి రెండు - కాళ్లు
గట్టెక్కి చూచేవి రెండు -  కళ్లు 
అంది పుచ్చుకునేవి రెండు - చేతులు
ఆలకిస్తుండేవి రెండు - చెవులు 
అడవిలో పుట్టాను, మేదరి ఇంట్లో మెలిగాను. వంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. - వేణువు
ఆరు కాళ్ళుంటాయి తుమ్మెదను కాదు, తొండం ఉంటుంది, ఏనుగును కాను, దోమనూకాను, రెక్కలుంటై గాని, పక్షిని కాను. - ఈగ 
అన్ని ఋతువుల్లోను ఆదుకుంటాను, విచ్చుకుని నీపైన కాచుకుంటాను. - గొడుగు
అందరికీ నేనవసరం, నాకెవరూ అనవసరం,  కంటికి కనపడకున్నా, అందర్నీ అరుసుకుంటూ ఉంటాను.-  గాలి
సాచుకుని సావిట్లో పడుకుంటాను,ముడుచుకుని మూల కూర్చుంటాను.- చాప
వేయి కళ్ల పులి ఏట్లో  వేటాడబోయింది. - వల
లోన తీసి ఒకటి - అరటి
పైన తీపి ఒకటి - ఖర్జురం 
అంతా తీపి ఒకటి - బెల్లం 
ఏలక్కాయంత పగడాన్ని, ఎంత వాళ్లైనా పట్టలేరు, ఏనుగు కూడా మోయలేదు. -  నిప్పు 
అంతులేని తోటలో పూలే పూలు, చూసే వారేగాని కోసేవారు లేరు.- నక్షత్రాలు
మేసేది వేలంత, కూసేది పిడుగంత, తీసేది ప్రాణం తుపాకి 
బరువు మోతుగాని బండినేమియు గాను, కాళ్లు నాల్గు గలవు ఖరము గాను , చేతులున్నవైన చేయలేనే పని,తెలుగు బిడ్డ నన్ను తెలియగలవా? - కుర్చీ 
చలన శక్తిగలదు, జంతువు కాదది,చేతులెపుడు త్రిప్పు శిశువు కాదు, కాళ్లు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ.- గడియారం 
నీరు తాగి, నిప్పు మింగి, గుప్పు గుప్పున తేన్చుతుంది, - ఎందరెక్కి కూచున్నా ఇట్టే పరుగు తీస్తుంది.- రైలు 
చెవులు పట్టుకుని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు! - కళ్లజోడు
పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు.-  ఉల్లిపాయ
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. - మద్దెల
వెనక్కి వెనక్కి పోతే గెలుపు.ముందు ముందు కొస్తే ఓటమి.-  తాడులాగే ఆట
చెట్టుకు కాయని కాయ,ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ.- ఆవకాయ
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు,తియ్యని విందులు - సీతాఫలం 
తియ్యటి కోట,  కోట చుట్టూ కోటి మంది భటులు. ఏమిటది? తేనెపట్టు
ప్రాణంలేని నాలుగు కాళ్ల జంతువు. తన వీపు మీద మనల్ని మోస్తుంది. ఎవరది? మంచం 
ఆకాశంలో అందమైన పండు. రోజుకో రూపంలో ఉండు. ఒక్కో రోజు మాత్రం కనిపించకుండా ఉండు. ఏమిటది? చందమామ 
కడవలో మునిగింది, అటుఇటూ తిరిగింది. తల్లి నుంచి అన్నదమ్ముల్ని వేరుచేసింది. ఎవరది? కవ్వం
అడవిలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి? తేనే పట్టు
అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది? విస్తరాకు
అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను, అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను? టెలిఫోన్
అది లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు? ఆకలి
ఐదుగురిలో బుడ్డోడు! పెళ్ళికి మాత్రం పెద్దోడు!!? చిటికెన వ్రేలు
కొప్పు ఉన్నా జుట్టు లేదు, కళ్ళు ఉన్నా చూడలేదు? టెంకాయ
గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది? తాటి చెట్టు
జానెడు ఇంటిలో, మూరెడు బెత్తం?  కుండ, గరిట
తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?  అత్తి చెట్టు
చెట్టుకు కాయని కాయ? ఆవకాయ
ఆకుల్లేని అడవుల్లో వంద దంతాల రాక్షసి? దువ్వెన
వానాకాలంలోనూ, ఎండాకాలం లోనూ విరిసే నల్లకలువ? గొడుగు 
వేలెడంత ఉండదు కానీ ఇంటిని కాపాడుతుంది? తాళంచెవి
ఎంత శుభ్రం చేసినా చెరిగిపోని మచ్చ? పుట్టుమచ్చ
వేడి నూనెలో అందమైన ముగ్గు. తీసి తింటే కరకరమంటుంది. ఏమిటో చెప్పండి? జంతిక
నాలుగు కాళ్లతో కూర్చుంటుంది. రెండు కాళ్లతో నిల్చుంటుంది. ఎవరది? కాలం
నిత్యం ముందుకు వెళ్తుంది. .. వేగం పెంచమన్నా పెరగదు.  తగ్గించమన్నా తగ్గదు. ఏమిటది? మడత కుర్చీ
కాళ్లూ చేతులు లేవు కానీ ఎప్పుడూ నెత్తినెక్కి కూర్చుంటుంది. ఎవరు? టోపీ
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది? శంఖం
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు? ఉల్లి
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? మురళి
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది. దీపం వత్తి
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు? తేలు
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది? ఎండ, వాన, చలి
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన? తాటి చెట్టు
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు? మంగలి
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి? సీతాకోక చిలుక
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది? ఉత్తరం
మోదం కాని మోదం? ఆమోదం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? పాలు, పెరుగు, నెయ్యి
రసం కాని రసం, ఏమి రసం? నీరసం
ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం? తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ? లవంగ మొగ్గ
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? తేనె పట్టు
మూత తెరిస్తే, ముత్యాల పేరు? దంతాలు
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే? దీపం
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు? సూర్యుడు
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు? పత్తి పువ్వు
లాగి విడిస్తేనే బ్రతుకు? ఊపిరి
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది? వేరుశెనగ కాయ
జాన కాని జాన, ఏమి జాన? ఖజాన
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది? ఉల్లిపాయ
ప్రాణం ఉన్నా నడవలేనిది. ఏమిటి? - గుడ్డు
 అల్లుడు వచ్చాడు. చొక్కా విప్పాడు. నూతిలో దూకాడు. ఏమిటది? - అరటి పండు 
ఊరంతా తిరిగినా గుమ్మంచూస్తే ఆగుతాయి. ఏమిటవి? - చెప్పులు
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషిని కాను, ఆకాశంలో ఉండగలను  కానీ మేఘాన్ని కాను. ఎవరునేను? - చిలుక 
నీళ్లలో మునగదు. నిప్పులో కాలదు. కొట్టినా చావదు. ఏమిటది? - నీడ 
నీటి లో ఉంటె ఎగిసి పడతాను,నేలమీదికి రాగానే  కూలబడతాను. - కెరటం
గదినిండా రత్నాలు గదికి తాళం.  ఏమిటది? - దానిమ్మ పండు
ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది.  ఏమిటది? - విద్య
వేయి కన్నులు గల దేవునికి చూపు లేదు.  ఏమిటది? - మంచం
వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేధి.  ఏమిటది? - నది
మొగము లేనిది బొట్టు పెట్టుకుంది .  ఏమిటది? - గడప
తెల్లని పొలంలో నల్లటి విత్తనాలు చేతిలో చల్లడం నోటితో ఏరుకోవడం. ఏమిటది? - పుస్తకం
మూత తెరుస్తే ముత్యాల సరాలు - పళ్ళు
ఎందరు ఎక్కిన విరగని మంచం. ఏమిటది? - అరుగు
పిల్ల చిన్నదాన కట్టిన చీరలు ఎక్కువ - ఉల్లిపాయ
పచ్చని బాబుకి రత్నాల ముగ్గులు - విస్తరాకు
తడిస్తే గుప్పెడు ఎండితే బుట్టెడు. - దూది
చక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యగ నుండు ఏంటది? - కొబ్బరి బొండం
 అడవిలో పుట్టాను ఎదురింట్లో అలిగాను వంటినిండా గాయాలు కడుపునిండా రాగాలు. - మురళి
ఇంట్లో ముగ్గు బయట పువ్వు ఏంటది? - గొడుగు
ఒక అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు. - వేరుశెనగ కాయ
కందుకూరి కామాక్షి కాటుక పెట్టుకుంది. ఏమిటది? - గురువింద గింజ
తొడిమ లేని పండు ఆకు లేని పంట ఏంటవి? - విభూది పండు, ఉప్పు
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ఏంటది? - నిప్పు
నల్లకుక్కకు నాలుగు చెవులు ఏంటది? - లవంగం
 ఆటకత్తె ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది. ఏమిటది? - నాలుక
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడు పాలిస్తుంది? - తాటిచెట్టు
తోలు నలుపు, తింటే పులుపు - చింతపండు
ఆకు చిటికెడు, కాయ మూరెడు - మునగకాయ
అరచేతిలో లెక్కించలేని ఇళ్లు, వెళ్లే దారే కానీ, వచ్చే దారే లేదు? - జల్లెడ
పాము లేదు కానీ పుట్ట ఉంది, తల లేదు కానీ గొడుగు వేసుకుంది? -  పుట్టగొడుగు
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊళ్లోకొచ్చి అరుస్తుంది. ఏమిటది? - శంఖం
ముగ్గురన్నదమ్ములు, రాత్రింబవళ్లు నడస్తూనే ఉంటారు. ఎవరు వారు? - గడియారం లో ముల్లులు
చూస్తే గజిబిజి... తింటే కరకర.. - జంతికలు 
కన్ను ఉన్నా తల లేనిది? - సూది
కాళ్లు చేతులు ఉన్నా నడవలేనిది? -  కుర్చీ
ఒకటే తొట్టె రెండు పిల్లలు  - వేరు శెనగ
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించే ఓడ - ఒంటె
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. - శబ్దం
తలపుల సందున మెరుపు గిన్నె - దీపం
నల్లకుక్కకు నాలుగు చెవులు - లవంగం
తల్లి దయ్యం ... పిల్ల పగడం - రేగు పండు
అమ్మంటే దగ్గరగా వచ్చేవి... అయ్యంటే దూరంగా పోయేవి? - పెదవులు
ఆవిడ వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. ఇంతకీ ఎవరావిడ? - ఆవులింత
చీకటి లో వెలిగే చిరు దారి. (పాపిట)
అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారికాని వచ్చే దారే లేదు. ( జల్లెడ)
ఒకటే తొట్టె, రెండు పిల్లలు.( వేరు శెనగ)
ఎర్రటి పండుపై ఈగైనా వాలదు. ( నిప్పు కణిక)
గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది. గడగడా త్రాగుతుంది.కళ్ళు మూసుకుని, తననెవ్వరు చూడలేదు అని అనుకునే అమాయకురాలు.(పిల్లి)
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. (ఉల్లిపాయ)
నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను,పెరిగి ఎర్రగా మారతాయా, చివరికి నల్లగా ఉంటా.నాతొ కళ్ళని పోలుస్తారు. (నేరేడు పళ్ళు)
తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు.అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. (మద్దెల)
ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే, మరొకటి నలుపునే చూస్తుంది. (ఆకాశం (రాత్రి, పగలు))
చూస్తే చిన్నోడు, వాడి ఒంటినిండా నారబట్టలు. (టెంకాయ)
అమ్మ కోసి ఇచ్చినప్పుడు ఎర్రగా ఉంది. తినటం పూర్తవగానే ఆకుపచ్చ రంగుకొచ్చింది. ఏమిటది?(పుచ్చకాయ)
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి( ఉంగరం)
నన్ను వేసే వాళ్ళే గాని తీసేవాళ్ళు లేరు …నేను ఎవరిని?. (గోడకి సున్నం)
తల లేదు కానీ రక్షణకు గొడుగు ఉంది. పాము లేదు కానీ పుట్ట ఉంది. (పుట్టగొడుగు)
పోకంత పొట్టి బావ, కాగంత కడవ మోస్తాడు. (పొయ్యి)
ఒక ఇంటిలో ఒక పిల్ల, ఆ ఇంటికి కిటికీలు, తలుపులు లేవు. విరగ్గొట్టుకునే బైటికి రావాలి. మళ్ళీ లోపలి పోలేదు. ఏమిటది? (కోడిగుడ్డు)
నేను కరుస్తాను కానీ పళ్ళు లేవు. (చెప్పులు)
నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మురికిగా ఉంటే, తెల్లగా అయిపోతా. (బ్లాక్ బోర్డు)
అందరూ నన్ను తినడానికి కొనుక్కుంటారు కానీ నన్ను తినరు. (కంచం)
మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ నన్ను చూడలేరు. (శబ్దం)
నా నిండా రంధ్రాలు, అయినా నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని? ( స్పాంజి)
నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు, ఎన్నో దారులున్నాయి కానీ ఏ వాహనము పోదు, ఎన్నో దేశాలున్నాయి కానీ భూమిని కాదు, మరి ఎవరిని? ( ప్రపంచ పటం (మ్యాప్))
పచ్చగా ఉంటాను కానీ ఆకుని కాను, మాట్లాడగలను కానీ మనిషి ని కాను, ఆకాశాన ఉండగలను కానీ మేఘాన్ని కాను. మరి నేను ఎవరిని? (రామ చిలుక)
కొన్నప్పుడు నల్లగా ఉంటాను. వాడినప్పుడు ఎర్రగా మారతాను., తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని? (బొగ్గు)
నేను నడుస్తూనే ఉంటా..నన్ను ఎవరూ ఆపలేరు. (సమయం)
వెలుతురూ ఉంటేనే కనిపిస్తాను, చీకటి పడితే మాయమౌతాను. (నీడ)
నీటిలో ఉంటే ఎగసిపడతాను, నేలమీద మాత్రం కూలబడతాను. (కెరటం)
నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే, లేచి కూర్చుంటా, ఎండినవైతే మరీ ఇష్టం, కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. (అగ్ని)
అది మనకి మాత్రమే సొంతమైనది. కానీ మన కన్నా ఇతరులే వాడుకుంటారు. (పేరు)
ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది. (చెప్పులు)
నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తా. ( మైకు)
దాని పువ్వు పూజకు పనికిరాదు, దాని ఆకు డొప్పగా చేయటానికి సాయపడదు,కానీ దాన్ని అందరూ కోరతారు. (చింత పండు)
హద్దు లేని పద్దు, అదుపు లేని ఎద్దు, ఎన్నడూ ఆడొద్దూసుమా!. ( అబద్దం)
నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ!. (ఒంటె (ఎడారి ఓడ))
ఎంతెంతో వింత బండి, ఎగిరి ఎగిరి పోయేసుమండీ! మండుతూ మండుతూ మాయమయ్యెను. (రాకెట్ )
చిత్రమైన చీరకట్టి షికారుకెళ్ళిందో చిన్నది. 
పూసిన వారింటికే గాని, కాసిన వారింటికి పోనే పోదు. (సీతాకోక చిలుక)
చూస్తే గజి బిజీ, తింటే కరకర. (జంతిక)
తలకు తోకకు ఒకటే టోపీ (పెన్ను)
చారెడు కుండలో మానెడు పగడాలు. (దానిమ్మ పండు)
కన్ను ఉన్నా తలలేనిది. (సూది)
కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు. ( నవారు మంచం)
ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు. (కాకర కాయ)
సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద, అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. (అరటిపండు)
తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు, 
కన్ను లెర్రగా ఉండు, రాకాసి కాదు,
పాకి పోవు చుండు, పాము కాదు. (రైలు)
తొడిమ లేని పండు, ఆకు లేని పంట. (విభూది పండు)
నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడేస్తుంది. (చిచ్చుబుడ్డి)
చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము. (పొట్లకాయ)
అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది,వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. (మురళి)
కిట కిట తలుపులు, కిటారి తలుపులు, ఎప్పుడు మూసిన చప్పుడు కావు. (కంటి రెప్పలు)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. (కవ్వం)
నేను నడుస్తూనే ఉంటా... నన్ను ఎవరూ ఆపలేరు? (కాలం)
ఆకలేయదు, నీరు తాగదు, నేలపై పాకదు, ఏమిటి ఆ తీగ? (విద్యుత్ తీగ)
మూట విప్పితే ముత్యాలు.... ఏమిటది? (దానిమ్మ పండు)
అన్నీ వేసి చూడు, నన్నలా వేసి చూడు!ఏమిటది? (ఉప్పు)
తెల్లని బంతి, చల్లని బంతి, అందని బంతి,
ఆడని బంతి...... ఏమిటది? (జాబిలి)
మా తాత దొడ్డిలో మంచి ఎద్దుల మంద, 
ఎద్దులు పడుకుంటే పగ్గాలు మేస్తాయి.... ఏమిటది? (గుమ్మడిపాదు)
నిగనిగలాడే నిర్మల వస్తువు, 
భుగభుగ మండే పరిమళ వస్తువు, 
నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుకు మండు.... ఏమిటది? (కర్పూరం)
ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే 
చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. (మద్దెల)
వెనక్కి వెనక్కి పోతే గెలుపు. 
ముందు ముందు కొస్తే ఓటమి. (తాడులాగే ఆట(Tug of War))
చెట్టుకు కాయని కాయ 
ఎర్రఎర్రగా పెట్టే కాయ 
ఏడాదంతా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తిను కాయ. (ఆవకాయ)
పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు. 
తియ్యని విందులు.  (సీతాఫలం)
పండుకు పన్నెండు తొనలు 
తొనకు ముప్పై పిక్కలు 
పదిహేను తెలుపు - పదిహేను నలుపు (కృష్ణ పక్షం, శుక్ల పక్షం)
నోరులేని పిట్ట, తోకతో నీళ్లు తాగుతుంది. (వత్తి)
నేలంతా నాకి మూలకేగి కూర్చుంటుంది. (చీపురు)
నాలుగు రోళ్లు నడవంగ 
రెండు చేటలు చెఱగంగ
అబకా ఒక్కటి ఆడంగ
చక్కని దొరలు ఎక్కేరు! (ఏనుగు)
నల్లని చేను మధ్యగా తెల్లని ఇరుకు బాట. (పాపిట)
కాళ్ల కింద నలిగాను. 
చక్రంపై తిరిగాను. 
చేతుల్లో ఒదిగాను
అగ్గిలో పడ్డాను. 
మనిషి ఇంటికెళ్లాను 
చెయ్యి జారితే పుట్టింటికే ఇక! (కుండ)
గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ
వచ్చి పోయే వారిని వడ్డించే బొమ్మ. (తేలు)
కిటకిట తలుపులు 
కిటారి తలుపులు 
ఎప్పుడు మూసిన చప్పుడు కావు (కంటిరెప్పలు)
సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ. (కొబ్బరి నీళ్లు)
అందంగా కన్నుల విందుగా అప్పుడప్పుడు ఆకాశంలో దర్శనం ఇస్తుంది. ఎండావానల సయ్యాట ఇది!(ఇంద్రధనస్సు)
పన్నెండు కొమ్మల మాను, కొమ్మకు ముప్పై ఆకులు (సంవత్సరం, నెలలు)
ఏ రాయి వద్దన్నా, ఈ రాయి కావలసిందే (ఉప్పురాయి)
ఊరంతటికీ ఒకటే దుప్పటి (ఆకాశం)
సంపాదన ఒకరిదీ,
అనుభవం ఒకరిదీ,
ఇంట్లో కాదు, వంట్లోనే! (చేతులు, నోరు)
పుట్టెడు గులక రాళ్ళల్లో ఒక మెరుపు రాయి(చుక్కల్లో చంద్రుడు)
ఎండలో నడిచి ఇంటికి వచ్చి గడప అవతల ఇద్దర్నీ 
గడప మూల ఒక్కర్నీ కాపలా ఉంచి పడుకున్నాడు. (చెప్పులు, గొడుగు)
అట్లు కాని అట్లు. పెద్దలు పెడతారు. పిల్లలు తింటారు. ఏమిటవి? (చీవాట్లు)
నేను ఎక్కువయ్యే కొద్దీ మీ చూపు మందగిస్తుంది. నా పేరేంటి? (చీకటి)
పైన పసుపు, లోన తెలుపు, మధ్యలో గులకరాళ్లు, పులుపు నీళ్ళు. నేనెవరో చెప్పగలరా? (నిమ్మకాయ)
వీధి పక్కన ఎర్రచొక్కా అబ్బాయి. ఎప్పుడు చూసినా నోరు తెరుచుకునే ఉంటాడు. ఎవరికీ తోచింది వారు తినిపిస్తారు. ఎవరది? (పోస్ట్ బాక్స్)
ఆకుపచ్చగా ఉంటాను. నన్ను తినరు కానీ నన్ను చంపి నల్లని నా పిల్లల్ని తింటారు. నేనెవర్ని?(యాలకలు)
వింతాకాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? (ఆవులింత)
కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది. ఏమిటది? (కలం)
గొప్ప మాటకారి. గడపదాటి బైటికి రాదు గానీ మాట్లాడుతూనే ఉంటుంది? (నాలుక)
వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది. ఏమిటది? (సూది - దారం)
కాళ్లు నాలుగున్నా కదలలేదు
చేతులు రెండున్నా ఏమీ చెయ్యలేదు. ఏమిటది? (కుర్చీ)
చెయ్యని కుండ
పొయ్యని నీళ్లు, పెట్టని పిలక. ఏమిటది? (టెంకాయ)
'అమ్మా' అంటే దగ్గర కొచ్చేవి,
'నాన్నా' అంటే దూరంగా పోయేవి, ఏమిటవి? (పెదవులు)
నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి పోతుంది,
ఎక్కడ అనుకున్నామో అక్కడ తాకి తీరుతుంది. ఏమిటది? (రాకెట్)
నవ్విన నవ్వును, ఏడ్చిన ఏడ్చును
కొట్టిన కొట్టును. ఏమిటది? (అద్దంలో బొమ్మ)
ఎంత దూరం నెట్టితే అంత దగ్గరవుతుంది.
గాలిలోనే తేలుతూ కదలాడుతుంటుంది. ఏమిటది? (ఊయల)
దేహమెల్ల కనులు దేవేంద్రుడా కాడు
నరుడె వాహనంబు నడువ లేదు
తాను ప్రాణి కాదు తవిలి ప్రాణుల జంపు
దీని భావమేమి తిరుమలేశ? (వల)
నది ఒడ్డున అందాలొలికించే పాలరాతి బొమ్మ. ఏమిటది? (తాజ్ మహల్)
వెయ్యిమందికి ఒకటే మొలతాడు. ఏమిటది? (చీపురు కట్ట)
వేదంలో ఉంది పురాణంలో లేదు,
మనస్సులో ఉంది ధనుస్సులో లేదు,
మూడక్షరాల ఆ కవి పేరేమిటి? (వేమన)
కాలం వస్తేనే గళం విప్పుతుంది.
వెక్కిరిస్తే రెచ్చి పోతుంది. ఏమిటది? (కోకిల)
సన్న తొడవు తొలగిస్తే కమ్మని వెన్నముద్ద,
అందరూ ఇష్టంగా ఆరగిస్తారు. ఏమిటది? (అరటి పండు)
పచ్చని పెట్టెలో తెల్లని విరులు
తెచ్చుకోబోతే గుచ్చుకుంటాయి. ఏమిటవి? (మొగలి పువ్వు)
పోషణలో ఉంది కాని, దూషణలో లేదు.
మడతలో ఉంది కాని, మడమలో లేదు.
నడకలో ఉన్నా తడకలో లేదు.
ఒక మహనీయ కవీశ్వరుని పేరు. ఎవరు వారు? (పోతన)
పడుకోగానే వచ్చి పక్కలో జేరుతుంది.
చెవిలో సంగీతం వినిపిస్తుంది, గిచ్చుతుంది అదిలిస్తే పారిపోతుంది. ఏమిటది? (దోమ)
సరస్సులో తేలియాడు తెల్లని పుష్పం.
కదలాడే స్వచ్ఛమైన పుష్పం కలువ కాదు,
తెల్లని పద్మం కాదు. ఏమిటది? (హంస)
ఒకటి పట్టి ఎత్తితే
రెండు ఉయ్యాల లూగుతాయి. ఏమిటది? (త్రాసు)
చీకట్లో ఎగురుతూ తిరుగుతుంది, పక్షి కాదు.
ఆగి ఆగి మెరుస్తుంది నక్షత్రం అసలే కాదు. ఏమిటది?(మిణుగురు పురుగు)
ఎనిమిదేనుగులున్న దర్బారు
ఎదురులేక ఏలుకున్న దర్బారు. ఏమిటది?(కృష్ణదేవరాయల దర్బారు)
మూరెడు పిట్టకు బారెడు తోక.
ఎగిరి ఎగిరి ఎటో ఎటో పోతుంది. ఏమిటది? (గాలిపటం)
మూడు కాళ్లతో ముందుకు వెళ్తుంది. కానీ వెనక్కు మాత్రం రాలేదు. ఏమిటో చెప్పండి? (కాలం)
ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే? (ఆవులింత)
జానెడు పొడుగుంటుంది. దాని పొట్టనిండా ముత్యాలే. ఎవరది? (బెండ)
ఎనిమిది రెక్కల పువ్వు. కావాలంటే విచ్చుకుంటుంది, వద్దంటే ముడుచుకుని మొగ్గ అవుతుంది. ఏమిటది? (గొడుగు)
పనిలో ఉన్నా కానీ పదిలో లేను
ఋతువులో ఉన్నా కానీ క్రతువులో లేను
తావులో ఉన్నా కానీ తారులో లేను
అయితే ఇంతకీ నేను ఎవరిని?  (పరువు)
వరంలో ఉన్నా కానీ భారంలో లేను
జారులో ఉన్నా కానీ జాములో లేను
తాడులో ఉన్నా కానీ తారులో లేను
అయితే ఇంతకీ నేను ఎవరిని?  (వరుడు)
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్ట గొడుగు)
అంగుళం ఆకు అడుగున్నర కాయ? (ములక్కాయ)
ఆకాశంలో పాములు? ఏమిటవి?(పొట్లకాయలు)
మంచం కింద మామయ్య ఊరికి పోదాం రావయ్యా? (చెప్పులు)
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది! ఏమిటది? (తాటిచెట్టు)
మీ అక్క తమ్ముడిని కాదు, కానీ మీ అందరికీ మేనమామనే! నేనెవరిని? (చందమామ)
యంత్రం కాని యంత్రం ఏమిటి? (సాయంత్రం)
సంతలన్నీ తిరుగుతాడు, సమానంగా పంచుతాడు? ఏమిటది? (త్రాసు)
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండకు పాలిస్తుంది? (తాటిచెట్టు)
రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గానీ లెక్కేసే వారే లేరు? (చుక్కలు)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు? (పిల్లనగ్రోవి) 
దాస్తే పిడికిలిలో దాగుతుంది....... తీస్తే ఇల్లంతా జారుతుంది? (దీపం వెలుగు)
ఎందరు ఎక్కినా విరగని మంచం? (అరుగు)
ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి? (దీపం)
ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది. ఏమిటది? (చీపురు)
తోకలేని పిట్ట తొంభై ఆమడలు తిరిగింది. (ఉత్తరం)
తెల్లని పోలీసుకు నల్లని టోపీ (అగ్గిపుల్ల)
పళ్లున్నా నోరు లేనిది? (రంపం)
చిటపట చినుకులు, చిటారు చినుకులు, ఎంత రాలినా చప్పుడు కావు? (కన్నీళ్లు)
నిలబడితే నిలుచుంటుంది, కూర్చుంటే కూలబడుతుంది. (నీడ)
ముక్కు మీదకు ఎక్కుతుంది. ముందర చెవులు నొక్కుతుంది. సోకులు పోయే టక్కులాడి జారిందంటే ...... పుటుక్కుమంటుంది? (కళ్లజోడు)
పిడికెడంత పిట్ట అరచి గోల పెడుతుంది. ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది?
(సెల్ ఫోన్ )
అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది?(అగ్గిపెట్టె)
అంగుళం ఆకు, అడుగున్నర కాయ. ఏమిటది?(ములక్కాయ)
అందరాని వస్త్రం పై అన్నీ వడియాలే. ఏమిటది?(నక్షత్రాలు)
అందమైన అప్పన్న, మూతిలాగి నాకన్నా. ఏమిటది?(మామిడి పండు)
అడుగులు ఉన్నా కాళ్లు లేనిది. ఏమిటది?(గజం బద్ద)
అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. ఎవరు వారు?(సూర్యుడు, చంద్రుడు)
అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించుకుంది. ఏమిటది?(పుట్టగొడుగు)
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది. ఏమిటది?(ఈత గెల)
అడవిలో అక్కమ్మ ఆసుబోసింది. ఏమిటది?(సాలీడు)
అడవిలో పుట్టాను
మేదరింట్లో మెలిగాను
వంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు. ఏమిటది?(మురళి)
చెక్కని స్తంభం - చేతి కందదూ,
చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు,
చెయ్యని సున్నం - తియ్యని బెల్లం. ఏమిటది?(కొబ్బరి)
చూస్తే ఒకటి,
చేస్తే రెండూ,
తలకూ తోకకూ ఒకటే టోపీ చెప్పండీ, ఇది చెప్పండి(కలం)
చూపు లేని కన్ను సుందరమౌ కన్ను,
తోట లేని కన్ను తోక కన్ను,
కన్ను గాని కన్ను కాలకంఠుని కన్ను. ఏమిటది?(నెమలి)
చిటపట చినుకులు కురియంగా,
సీతాదేవి పుట్టంగా,
లంకాదీపం పెట్టంగా,
రావణుని తల కొట్టంగా,
చిలప చిలప నీళ్ళ లో సీతమ్మ జడలంట,
భూమంటే నెల్లూరు కోటంట,
కోటలో రాజు పెళ్ళాం కొలువంట. ఎవరు నేను?(అరటి)
ఎనిమిది చేతుల ఏబ్రాసీ,
ఎప్పుడు తిరిగే సోబ్రాసీ,
వెన్నున జంజె వ్రేళ్ళాడు తీసిన కొద్దీ తెర్లాడు(రాట్నం)
ఆకాశాన అరవై ఆరు కొడవళ్ళు?
(జవాబు : చింతకాయలు)
తలుపుల లోపల మెలికల పాము.
ఏమిటది?(జవాబు :నాలుక)
పొడవుగా పండే పంటను పొడిగా వాడతాం.
ఏమిటది?(జవాబు :చెక్కెర)
గుండ్రటి భవనంలో బోలెడన్ని తెరలు,
తెరల చాటున ఎర్ర సిపాయిలు.  ఎవరువారు?(జవాబు :దానిమ్మ పండు)
బైటది పారేస్తాం లోపలది తింటాం.
బైటది తింటాం, లోపలది పారేస్తా. ఏమిటది?(జవాబు :మొక్కజొన్న)
1. ఆకాశంలో అరవై గదులు, గది గదికో సిపాయి.
 సిపాయికో తుపాకి?
ఏమిటది? (జవాబు : తేనెతుట్టె)
2. ఆకాశాన ఎగురుతుంది, పక్షి కాదు.
మనషుల్ని ఎగరేసుకుపోతుంది, గాలి కాదు.
ఏమిటది? (జవాబు : విమానం)
3. ఆకాశాన పటం, కింద తోక?
ఏమిటది? (జవాబు : గాలి పటం)
4. ఆకులేని అడవిలో జీవం లేని జంతువు
జీవమున్న జంతువులను వేటాడుతుంది. ఏమిటది? (జవాబు : దువ్వెన)
5. ఆకు లేయదు, నీరు తాగదు, నేలను పాకదు.
ఏమిటా తీగ?  (కరెంటు తీగ)
6. 'పోషణ' లో ఉంది, 'దూషణ' లోలేదు;
 'మమత' లో ఉంది, 'మమకారం' లో లేదు;
'మన' లో ఉంది, 'మాట' లో లేదు. ఈ పొడుపు కథలోని కవి  పేరు?
(జవాబు : పోతన)
చూసింది ఇద్దరు,
కోసింది అయిదుగురు,
తిన్నది 32 మంది
ఏమిటది?(జవాబు : కళ్ళు, వేళ్లు, పళ్ళు)
ఒక కన్ను కలది కాకి కాదు,
ఒక కన్నం ఉంది పుట్ట కాదు,
ఏమిటది?(జవాబు : సూది)


అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు ఛాయ 
చెట్టుకి కట్టిన ఉట్టి, ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది?(ఊయల)
పచ్చటి దుప్పటి కప్పుకొని తియ్యటి పండ్లు తింటుంది?(చిలుక)
ఎంత ప్రయత్నించినా చేతికి చిక్కదు, ముక్కుకి మాత్రమే దొరుకుతుంది. ఏమిటది ?(వాసన)
పిఠాపురం చిన్నవాడా , పిట్టల వేటగాడా  బతికిన పిట్టను కొట్టవద్దు, చచ్చిన పిట్టను తేనువద్దు, కూర లేకుండా రానువద్దు, మరేం తెచ్చాడు?(కోడి గుడ్డు )
మూతి వేలెడు, తోక బారెడు? (సూది , దారం)
ఆకాశాన వేలాడే వెన్నముద్దలు ?(వెలగ పండ్లు)
ఆకు బారెడు తోక మూరెడు ?(మొగలి పువ్వు)
ఆకు చిటికెడు కాయ మూరెడు?(మునగ కాయ)
చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు?(అద్దం)
అమారా దేశం నుంచి కొమారా పక్షి వచ్చింది. ముక్కుకి ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది.(ప్రమిద)
ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన(రామచిలుక)
మేసేది కాసింత మేత, కూసేది కొండంత కూత (తుపాకి)
కోట గాని కోట ఇంటికో కోట? (తులసి కోట)
కన్నులు ఎర్రగా ఉంటాయి , రాకాసి కాదు, తలనుండి పొగొస్తుంది,   భూతం కాదు
చరచర పాకుతుంది పాముకాదు ( రైలు )
కత్తులు లేని భీకర యుద్ధం , గెలుపూ ఓటమి చెరిసగం (చదరంగం)
కతకత కంగు ,మాతాత పింగు, తోలు తీసి మింగు (అరటి పండు)
పైనొక పలక , కిందొక పలక, పలకల నడుమ మెలికల పాము (నాలుక)
అమ్మ కడుపున పడ్డాను,  అంతా సుఖాన ఉన్నాను ,నీచే దెబ్బలు తిన్నాను,
నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయినాను(పిడక)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, మహలక్ష్మిలాగుంది.(గడప)
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.(చల్లకవ్వం)
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు,
అన్నిపువ్వుల్లో రెండేకాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యుడు)
సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ,ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. ఏమిటది?(శంఖం)
ముగ్గురన్నదమ్ములు , రాత్రింబవళ్ళు నడుస్తూనే ఉంటారు. ఎవరువారు?(గడియారం ముళ్ళు)

అర్థాలు - Telugu Meanings


చకోరములు = వెన్నెలను త్రాగి జీవించే పక్షులుతమము = చీకటి
వేడ్క = సంతోషముచెలంగి = విజృంభించి
పేరి = గొప్పదైనవ్రేకదనం = అతిశయము
ఒండొండ = క్రమంగాభూరుహం = చెట్టు
దీధితి = వెలుగుపొదిలి = పెరిగి, వ్యాపించి
సుధాకరుడు = చంద్రుడుసూత్రధారి = దర్శకుడు
అంకురం = మొలకసౌరభం = సువాసన
ఉపలము = శిల, రాయిఎఱకలు = రెక్కలు
తఱి =  సమయంషండం = సమూహం
కడలి = సముద్రంకైరవం  = తెల్ల కలువ
రజనీశ్వరుడు = చంద్రుడుకళంకము = మచ్చ
గరువపు = గొప్పకరవటము = బరిణె
గురి = లక్ష్యముతేజము = కాంతి
ఇనుడు = సూర్యుడుభృంగం = తుమ్మెద
కీడు = చెడు మేను = శరీరం
కొదువ = తక్కువనిగ్రహించు = గర్వపడు
ధనం=డబ్బుకేటాయింపు=ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం
ప్రశంసాపత్రం=మెచ్చుకొంటూ ఇచ్చే  పత్రంనగదు=డబ్బు.
పతకం=గుర్తింపుగా ఇచ్చే బిళ్ళ.అవార్డు=బహుమతి,పురస్కారం
కృతజ్ఞతా=ధన్యావాదాలు.క్షేమంగా=సురక్షితంగా .
సాహసం=తెగింపు(ధైర్యంగా)చేసే పని ఊపిరి=గాలిపీల్చడం 
వ్యాపించు=విస్తరించు.ప్రమాదం =ఆపద.
అచేతనం =కదలకుండా  ఉండు.పినతండ్రి =తండ్రితమ్ముడు,బాబాయి.
పద్మం=కమలం,తామరపువ్వు.నాట్యగత్తె= నృత్యంచేసే స్త్రీ.
నిర్మించుట=కట్టుట.శతాబ్ది=నూరు సంవత్సరాలు.
ఆలయం=గుడి. విగ్రహం=దేవుని బొమ్మ.
వైశాల్యం=ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం.సేనాని=సేనలకు అధికారి,సైన్యాధికారి.
తీరం = ఒడ్డు సర్పం = పాము
యుక్తి = ఉపాయంపచ్చిక = గడ్డి
కొలను = సరస్సుజలకం = స్నానం
మింటికి = ఆకాశానికికుమిలి = బాధపడి
శిల్పం=రాతిలో చెక్కిన బొమ్మ.డబ్బు = ధనము 
తోట = వనము పాట - గానము 
నిశ్శబ్దం = మౌనము గొప్ప = ఘనము 
కాల్చు = దహనము మురికి = మలినము 
పిలుపు = ఆహ్వానము ఆకాశం = గగనము 
కదలిక = చలనము పరంపర = వరుస 
పరిశీలన = వివరంగా తెలుసుకొనటం తపన = కోరిక 
మన్నన = మర్యాద ప్రోత్సహం = పురికొల్పటం 
స్వానుభవం = స్వయంగా అనుభవించినది నిరంతరం = ఎల్లప్పుడు 
సింధువు = సముద్రం అమాయకముగా = మోసము తెలియని 
అరయు = చూచు, తెలుసుకొను అర్చన = పూజ 
అర్భకుడు = బక్కపలచటి వాడు, చేతకాని వాడు ఆచరించుట = చేయుట 
ఆడంబరము = డంబము, బింకము ఆర్తి = ఆతురత 
ఆవేశము = కోపము ఆహ్వానము = పిలుపు 
ఇల = భూమి ఉల్లాసంగా = సంతోషముగా 
ఊహ = ఆలోచన ఋణం = అప్పు 
ఋషి = ముని ఏక = ఒకటి 
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పటం ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట 
ఒప్పందం = కట్టుబాటు ఔషధం = మందు 
కంటకం = ముల్లు కంపం = కదలిక, వణుకు 
అనువు = ఉపాయము కఠోరం = కఠినం 
కథానిక = చిన్నకథ కనకము = బంగారము 
కమఠము = తాబేలు కర్తవ్యం = చేయవలసిన పని 
కలప = కట్టె, కర్ర కల్ల = అబద్ధం, అసత్యం 
కలిసి మెలిసి = ఇకమత్యంతో కునుకు = చిన్నపాటి నిద్ర 
ప్రవాహము = పరంపర, వెల్లువ వాచికము = వక్కాణము, సమాచారము 
అపరాధం = తప్పు, నేరము అపహరించు = దొంగలించు 
అపహసించు = వెక్కిరించు, ఎగతాళి చేయు అపాయం = ప్రమాదం, ఆపద 
అప్రియం = ఇష్టం కానిది అభిరామ = అందమైన, మనోహరమైన 
అమాంతముగా = అకస్మాత్తుగా, ఒక్కసారిగా అమిత = ఎక్కువైన 
అర్థమత్తుడు = ధనం చేత పొగరెక్కినవాడు అర్పించు = ఇచ్చు 
అరుగు = వెళ్ళిపోవు అలుక = కోపం 
అవధి = హద్దు అశ్రువు = కన్నీరు 
 అసంఖ్యాక = లెక్కలేనన్ని అహం = నేను అనే భావం 
అహంకృతుడు = గర్వం చూపేవాడు మోతుబరి = ఎక్కువ భూమిని సేద్యం చేసే రైతు(భూస్వామి) 
తగాదా = పోట్లాట అరమరికలు = తేడాలు 
అవరోధం = అడ్డు అవసానకాలం = చివరి కాలం 
సమీపించు = వచ్చు యోగ్యులు = మర్యాదస్తులు 
వ్యవహారాలు = పనులు దక్కు = లభించు 
విషమించు = చేయి దాటిపోవు కుశలత = నేర్పు 
భంగ పడు = అవమానపడు వృద్దాప్యం = ముసలి వయస్సు 
నిశ్చింత = చింతలేకుండా జగడం = పోరు 
తరణం = దాటడం తగాదా = తగువు 
లుబ్దత్వం = పిసినారితనం తకతకలాడు = తొందరపడు 
మంకు = మొండి ఉక్తి = మాట 
లోభి = పిసినారి సౌరభం = సువాసన 
నీహారం = మంచు శీతలం = చల్లని, చందనం 
సౌమ్యం = శాంతం ఉపకరణములు = సాధనాలు 
లయం = వినాశం లంక = దీవి, ద్వీపం 
క్లిష్టం = కష్టమైన ఉత్సుకత = కుతూహలం 
రయం = వేగం అనిలం = గాలి 
కృపాణం = కత్తి తావి = పరిమళం 
మహి = భూమి సమగ్రం = సంపూర్ణం 
పైకం = డబ్బు కళంకం = మచ్చ, గుర్తు 
నింగి = ఆకాశం ప్రతిష్ఠ = గౌరవం 
హారం = దండ పికం = కోకిల 
ఇల = నేల దండు = సేన 
నవల = స్త్రీ, ఒక సాహితీ  ప్రక్రియ ఊత = ఆధారం 
కోమలి = స్త్రీ అట్టహాసం = పెద్దనవ్వు 
అడచు = తగ్గించు, అణగకొట్టు జగత్తు = ప్రపంచం 
క్షామం = కరువు ఆదిత్యుడు = సూర్యుడు 
ప్రసూనం = పువ్వు స్వప్నం = కల 
ఆకాంక్ష = కోరిక భీతి = భయం 
ప్రీతి = ఇష్టం పీచమణచు = నిర్వీర్యం చేయడం 
ఖరవు = గర్వం ఉద్వాహం = పెళ్లి 
అన్యం = ఇతరమైన ఎఱుక = తెలుసు 
స్నేహితులు = మిత్రులు మోదం = సంతోషం 
ధరిత్రి = భూమి పోరితము = యుద్ధము 
కపి = కోతి వ్యాఘ్రము = పులి 
మైకం = మత్తు పికం = కోయిల 
అనంతం = అంతం లేనిది అమాత్య పీఠం = మంత్రి కూర్చునే స్థానం 
అరుదెంచి = వచ్చి వైనం = విధం 
సలిలం = నీరు అనాలం = నిప్పు 
కౌశలం = నేర్పు దామం = హారం 
జాయువు = మందు, ఔషధం సర్పం = పాము 
సాటి = సమానం తరువు = వృక్షం 
ఠీవి = గాంభీర్యం పరిపాటి = క్రమం 
ఉద్ది = జత కుటిలం = మోసం 
వ్యవహారాలు = పనులు నమ్రత = వినయం 
అపరంజి = బంగారం కలిమి = సంపద 
కనికరం = దయ  జిత్తు = మాయ 
అర్కుడు = సూర్యుడు మదం = గర్వం 
దోషము = పొరపాటు మాసము = నెల 
భంగము = ఆటంకం కరము = చేయి 
తమస్సు = చీకటి అంబరం = ఆకాశం 
కడుపు = ఉదరం, పొట్ట క్షణము = లిప్త, త్రుటి, ముహూర్తం 
తామర = పద్మము, అంబుజము విమర్శ = సమీక్ష, అవలోకనము 
పావడము = వస్త్రం పానీయము = నీరు 
పాటవం = నైపుణ్యం పావనము = పవిత్రం 
కేళి = ఆట ధారణ = జ్ఞాపకం 
మూక = సమూహం తరుణి = స్త్రీ 
శౌర్యం = పరాక్రమం విస్తృతం = విరివిగా 
వల్లి = భూమి, తీగ భానుడు = సూర్యుడు 
పస = సారము, సమృద్ధి సొంపు = సౌందర్యము 
కంక = వెదురు, కోడె అగ్గువ = చౌకగా 
పిరం = ఎక్కువ ధరకుములు =  బాధపడు
కైకిలి = కూలిపిసరు =  చిన్నముక్క
పిడాత = అకస్మాత్తుగాఅక్కెర = అవసరం
ఆయిల్ల = గత రాత్రిఅనుకుడు = వణకడం
మడిగె = దుకాణంగట్లనే = అట్లాగే
గత్తర = కలరాగంతే = అంతే
తత్తర = తడబాటుఅతిశయిల్లు  - పెరుగుతూ ఉండటం
అధికం = ఎక్కువఅద్భుతం = ఆశ్చర్యం 
అనంతరం = తర్వాత అనర్గళం = ఎడతెరిపిలేకుండా, ఆగకుండా మాట్లాడడం
అనుభవించు  = సొంతం చేసుకొనుఅపహరించు = దొంగిలించు 
అభినందించు  = ఒక మంచిపని చేసినందుకు కాని,                ఒక మంచి సందర్భంలో కాని మెచ్చుకోడం అభిరాముడు = మనోహరమైనవాడు 
అలజడి = మనస్సులో బాధ, కలత, గొడవఅభిమానం = ప్రేమ, గౌరవం 
అమాయకంగా = మోసం తెలియని అరయు = చూచు, తెలుసుకొను 
అర్చన = పూజ అర్భకుడు = బక్కపలచటివాడు, చేతకానివాడు
ఆచరించుట = చేయుటఆడంబరము = డంబము, బింకము
ఆర్తి = ఆతురత ఆవేశం = కోపం, ఒళ్లు తెలియనికోపం 
ఆహ్వానం = పిలుపుఇల = భూమి
ఉల్లాసంగా = సంతోషంగాఊహ = ఆలోచన
ఋణం = అప్పు ఋషి = ముని
ఏక = ఒకటి ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పడం 
ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుటఒప్పందం = కట్టుబాటు
ఔషధం = మందుకంటకం = ముల్లు 
కఠోరం = కఠినం కథానిక = చిన్నకథ 
కంపం = కదలిక, వణుకు కజ్జికాయ = ఒకరకమైన తియ్యటి తినుబండారం 
కనకము = బంగారముకమఠం = తాబేలు
కర్తవ్యం = చేయాల్సిపని కలప = కట్టె, కర్ర 
కల్ల = అబద్ధం, అసత్యం కలిసిమెలిసి = ఐకమత్యంతో
కుండపోత = కుండముంచినట్లుగా పెద్ద ధారగా పడుతూండటం కుదురు = కదలకుండా ఉండటం, స్థిరత్వం, నిలకడ 
కునుకు = చిన్నపాటి నిద్ర కొంటెపనులు = చిలిపి పనులు
కొలను = చెరువుకొలువు = ఉద్యోగం
కోవెల = గుడిఖగం = పక్షి 
ఖరం = గాడిదఖుషీ = సంతోషం
పింఛం = నెమలిపురిపిన్నలు = చిన్నవాళ్ళు
ప్రీతి = ఇష్టం , ప్రేమ పూరిగుడిసె = గడ్డిపాక 
పేడ = పెండఫలం = పండు
బంక = జిగురు బృందగానం = జట్టుగా పాడుట, జతగా పాడుట
బహుమానం  = కానుక, ప్రైజు, ఇనాము బువ్వ = అన్నం
భవనం = ఇల్లు, మేడభాగ్యం = డబ్బు, ధనం, సంపద 
భిన్నము = వివిధము, వేరువేరుభూషణం = అలంకారం
భౌతికం = శారీరకం, శరీరసంబంధంమధురమైన = తియ్యనైన 
మనుజుడు = మనిషి, మానవుడు మనీష = తెలివి, ప్రజ్ఞ 
మర్కటం = కోతి మర్దన = మసాజు 
మహి = భూమి మహిమ = గొప్పతనం
మానసము = మనస్సుమార్గం = తోవ, దారి 
మిధునం = జంట ముగింపు = చివర, పూర్తి 
మేఖల = ఒడ్డాణం మేఘం = మబ్బు 
మోజు = ఇష్టం మౌనము = మాట్లాడకుండా ఉండుట, ఖామోషీ
యశస్సు = కీర్తియాగం = యజ్ఞం 
యాతన = కష్టం, ఇబ్బంది యానం = ప్రయాణం
రక్షణ = కాపాడుట రాగము = అనురాగము, సంగీతరాగం
రాక్షసులు = రక్కసులు, దేవతల శత్రువులులచ్చి = లక్ష్మి 
లవణం = ఉప్పు, నమక్లాలస = కోరిక 
లెస్స = మంచి లొట్టలు = నోరూరుట
వడి = వేగం వధువు = పెళ్లికుమార్తె 
వనవాసం = అడవిలో నివసించుట వరహా = పూర్వకాలంలో వాడుకలో ఉన్న చాలా విలువైన నాణెం 
వర్ధనం = పెంచడం, వృద్ధి చేయడం; పెరగడం వర్షం = వాన 
వర్గీకరణ = వేరుచేయుట వానరులు = కోతులు 
వారధి = వంతెన వ్యాధి = రోగం 
విచిత్రం = ఆశ్చర్యం విచ్చిన = వికసించిన
విద్యాభ్యాసం = చదువునేర్చుకొనుట విశ్వద = ప్రపంచాన్ని ఇచ్చిన
విస్తరించు = వ్యాపించు సంతతి = జాతి 
ఘనకీర్తి = గొప్పపేరు ప్రాచుర్యం పొందు = విస్తృతి చెందు, బాగా వ్యాపించు
మహోజ్వలం = మిక్కిలి ప్రకాశవంతంవిజయ యాత్ర = గెలిచిన సందర్భంలో చేసే ఊరేగింపు
ఎత్తుపల్లాలు = ఉన్నతి, క్షీణతసంప్రోక్షణ = శుద్ధి చేయటం
ప్రఖ్యాతి = ప్రసిద్ధిసమాగమం = కలయిక
చవి = రుచిపుట = పేజీ
అజరామరం = శాశ్వతంఅర్జించు = సంపాదించు
అవధి = హద్దుయవనిక = తెర  
మాన్యులు = గౌరవనీయులుపరవళ్ళు = ప్రవాహాలు
రహదారులు = రోడ్లు (బాటలు)పాయ = చీలిక
వైభవం = సంపదపరీవాహక ప్రాంతం = ప్రవహించే ప్రాంతం 
రూపుదిద్దుకొను = ఆకారం పొందుచర్మకారుడు = చెప్పులు కుట్టేవాడు 
తరలిపోవు = వెళ్ళిపోవుహర్మ్యం = మేడ
హంగులు = సదుపాయాలు  సచేతనం = చైతన్యంతో కూడిన 

Vemana Shataka Padyalu

కోతినొకటి దెచ్చి క్రొత్తపుట్టము గట్టి
ఆత్మయందె దృష్టి ననువగా నొనరించి
చినుగుబట్ట కాదు చీనాంబరము గాని
రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
విద్యలేనివాడు విద్యాధికుల చెంత
నిక్కమైన మంచినీలమొక్కటి చాలు
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
చెప్పులోన రాయి చెవిలోన జోరీగ
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
చిక్కియున్న వేళ సింహంబు నైనను
ఎలుగు తోలు తెచ్చి యెన్నాళ్లు నుదికినా
ఆత్మశుద్ధి లేని యాచార మదియేల
వాన రాకడయును బ్రాణంబు పోకడ
మేక కుతికపట్టి
వేమన పద్యం - వేమననగ యోగి వెలసె లోకములోన
వేమన శతకము - అల్పుడెప్పుడు బల్కు
వేమన శతకము - జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
వేమన శతకము - పసుల వన్నెవేరు పాలెల్ల ఒక్కటి
వేమన శతకము - వేరుపురుగు చేరి వృక్షంబు జెరుచును
Vemana Satakamu - మేడిపండు చూడ మేలిమై యుండును
వేమన శతకము - తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
వేమన శతకము - అనువుగానిచోట నధికులమనరాదు
Telugu Malika - గంగిగోవు పాలు గంటెడైనను చాలు

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే - పద్యం - అర్థవివరణ

 జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే - పద్యం - అర్థవివరణ

జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ! వినుర వేమ!

తాత్పర్యం: శివుడికి, జీవుడికి మధ్య భేదం లేదు. తరచి చూస్తే జీవుడే
శివుడు, శివుడే జీవుడు! ఏ జీవినీ హీనంగా చూడకూడదు. జీవిని
చంపడమంటే శివభక్తి తప్పడమే! జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు.

సామెతలు - అర్థం - proverbs and its meaning

సామెతలు - అర్థం 
సామెత వివరణ 
అండ ఉంటే కొండలు దాటవచ్చు సహాయసహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు. 
గోరంతలు కొండంతలు చేయడం చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పటం 
అందని ద్రాక్ష పండ్లు పుల్లన దొరకని దానిలో లోపాన్ని ఎంచడం 
చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు ప్రయోజనం లేని శ్రమ 
అగ్నికి వాయువు తోడైనట్లు ఒక బలవంతుడికి మరొక బలవంతుడు తోడై ఇంకా బలవంతుడు అవడం 
అంబలి తాగే వాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం  
అడవిపంది చేను మేస్తే, ఊరపంది చెవులు కోసినట్లు తప్పు చేసిన వారిని శిక్షించలేక, నిరపరాధిని శిక్షించడం 
గుడ్డికన్న మెల్ల మేలు అసలేమీ లేనిదాని కంటే, ఏదో ఒకటి ఉండడం మంచిది 
అభ్యాసము కూసు విద్య అభ్యాసంతో ఎంతకష్టమైన పనైనా సులభమవుతుంది 
విత్తు మంచిదైతే, మొక్క మంచిదవుతుంది ఆలోచన మంచిదైతే, ఫలితం కూడా బాగానే ఉంటుంది
అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు గొప్పతనం కోసం అర్హత లేని పనులు చేయడం 
ముంజేతి కంకణానికి అద్దమేల?ఎదుట కనిపించేదానికి ఋజువు అవసరం లేదు 
అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడం ఉపకారికి అపకారం చేయడం 
ఆలూ లేదు, చూలూ లేదు అబ్బాయి పేరు సోమలింగం పనిని మొదలు పెట్టకుండానే ఫలితాన్ని గురించి ఆలోచించడం 
అర్థ బలం కంటే అంగబలం ఎక్కువ డబ్బుతో కంటే మానవసహాయంతో ఎలాంటి ఘనకార్యాన్నైనా సులభంగా సాధించవచ్చు 
మొక్కై వంగనిది మానై వంగునా?మార్పు అనేది చిన్నవయసు లోనే రావాలి 
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అవసరాలు లోపాలను ఎంచనివ్వవు 
తీగ లాగితే, డొంకంతా కదిలినట్లు ఒక విషయాన్ని గురించి ఆరా తీస్తే, ఇతర విషయాలు ఎన్నో తెలిసినట్లు 
ఆవును చంపి, చెప్పులు దానం చేసినట్లు స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టం కలిగించడం 
చెలిమితో చేదైనా తినిపించవచ్చు కానీ బలిమితో పాలైనా తాగించలేము మంచితనంతో ఏ పని నైనా సాధించవచ్చు 
ఇల్లు అలకగానే పండుగౌతుందా? పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు 
గోరుచుట్టు మీద రోకటి పోటు కష్టాల మీద కష్టాలు రావడం 
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనవసరపు విషయాలకు చేసే ఆర్భాటం 
తింటే గాని రుచి తెలియదు, దిగితే గాని లోతు తెలియదు స్వానుభవం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు 
అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అన్ని రకాలు గాను ఆటంకాలు కలిగించడం 
తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్లు తన చేతిలో లేని పని 
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం మన ప్రవర్తనను బెట్టే, ఎదుటి వారి ప్రవర్తన ఉంటుంది 
చేసిన పాపాలకు, పెట్టిన దీపాలకు సరి చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు 
ఎంత చెట్టుకు అంత గాలి శక్తిని బట్టే ఫలితం కూడా ఉంటుంది 
మా తాతలు నేతులు తాగారు, మేము వారి మూతులు వాసన చూస్తున్నాము సొంత ప్రతిభ లేకపోవడం 
కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం ఎటూ చెప్పలేని పరిస్థితి 
తుంగ దించి బండను ఎత్తుకున్నట్లు చిన్నచిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించి, అధిక కష్టాలను పొందడం 
ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే ఎంత ప్రయత్నించినా, మంచి మంచిగానే ఉంటుంది. చెడు చెడుగానే ఉంటుంది 
తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది?సహజ బలసంపద లేని విషయాలు కలకాలం నిలవవు 
ఏనుగునైనా ఎంటితో కట్టవచ్చు ఐకమత్యంతో ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించవచ్చు 
గోడమీది పిల్లి వాటం సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం 
ఏరుదాటి తెప్ప తగులబెట్టినట్లు అవసరం తీరాకా సహాయం చేసిన వారిని నాశనం చేసినట్లు 

Telugu Malika - Golden words

బంగారు మాట 
ఉచ్చులను గుర్తించడంలో నక్కలా ఉండాలి. తోడేళ్లను జడిపించడంలో సింహంలా ప్రవర్తించాలి.
ఓర్పు చేదుగా ఉంటుంది. కానీ, దాని ఫలితం మధురంగా ఉంటుంది!
మన సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏదీ లేదు. మనం చేసే పని, మన క్రమశిక్షణలోనే పరిష్కారాలు దాగి ఉంటాయి.
తను వెళ్లాల్సిన దారిని మొదట వెతుక్కున్న వాడే.. ఇతరులకు దారి చూపగలడు.
మంచి మిత్రుల స్నేహం, సత్ప్రవర్తన మిమ్మల్ని డబ్బు తీసుకుపోలేని చోటుకు కూడా తీసుకుపోగలవు.
సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ని పేదవానిగా చేస్తుంది!
విజ్ఞతను మించిన మిత్రుడు ...... అజ్ఞానాన్ని మించిన శత్రువు ఈ లోకంలో లేడు.
వైకల్యం అనేది ఓ మానసిక భావన మాత్రమే. మీరు ఒక్క పని మంచిగా చేసినా సరే...ఇంకొకరికి మీ అవసరం ఉంటుంది.
మందలింపు తర్వాత ప్రోత్సహించడ మన్నది ..... వాన తర్వాత వచ్చే ఎండ లాంటిది.
కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. వాటితో పాటు నా అభిప్రాయాల్లోనూ మార్పులు వచ్చాయి.
పూజ, ఉపవాసాలు.. ఆత్మ బలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు!
భగవంతుడు మీకు ఇచ్చిన శక్తిని మంచికి వాడుకోవాలనుకుంటే ఇతరులకు సేవ చేయండి. అది మీకు సంతృప్తిని, సంతోషాన్ని తీసుకువస్తుంది.
చెట్టులా ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులకు ప్రాణం పోయాలి. ప్రతి ఒక్కరికీ నీడను ఇవ్వాలి. అందరికీ పండ్లను పంచాలి. మొత్తంగా... చెట్టులా మంచిగా బతకాలి.
నవ్వడం, నవ్వించడం అలవాటైతే.. జీవితంలోని ఒడుదొడుకులు ఏమీ చెయ్యలేవు!
సంతోషం ఉంటే.. అన్ని నిధులూ ఉన్నట్టే! అదే లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థమే!
పుస్తక ప్రేమికులు గని కార్మికుల్లాంటి వాళ్లు. బంగారం కోసం వాళ్లు అన్వేషిస్తూనే ఉంటారు.
మనిషి ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. అలానే, ఆ వ్యక్తి సంపాదించే వేతనం అతను బతకడానికైనా సరిపోవాలి.
మీరు బయటికి ప్రదర్శించే దాని కంటే ఎక్కువ మొత్తాన్ని దాచుకోండి. మీకు తెలిసిన దాని కంటే కొంత తక్కువ మాట్లాడండి.
గంగానది... చిరస్మరణీయమైన గతానికి ప్రతీక. వర్తమానంలో ప్రవహించడమే కాదు, భవిష్యత్తు అనే మహాసముద్రంలోకి కూడా ప్రవహిస్తూనే ఉంటుంది.
సహనం అంటే వేచిచూడటమే. అలాగని నిర్లిప్తంగా ఉండిపోవడం మాత్రం కాదు. అది సోమరితనం! నడక కష్టంగా, నెమ్మదిగా సాగుతున్నప్పుడు కూడా నడుస్తూ ఉండటమే సహనమంటే. మనిషికి రెండు శక్తిమంతమైన ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అవి.. సహనం, కాలం.
ఎలాంటి ప్రయోజనమూ ఇవ్వని కష్టాన్ని నేను కొంచెం కూడా ఇష్టపడను. కష్టం అనేది సృజనాత్మకంగా ఉండాలి. ఏదో ఒక మంచికి జన్మనివ్వాలి. ఎంతో కొంత మార్పునకు కారణం కావాలి.
ప్రతీ తరం కూడా తన ముందు తరం కంటే తెలివైనదే అనుకుంటుంది. అదే సమయంలో, రాబోయే తరం కంటే కూడా విజ్ఞానవంతులమే అనుకుంటుంది.
మనం దుష్కార్యం చేస్తే దుష్పలితాన్నీ, సత్కార్యం చేస్తే సత్ఫలితాన్నీ అనుభవించే తీరాలి. దాన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదు. కారణం ఉంటే కార్యం ఉండి తీరాలి.దాన్ని ఏదీ ఆపలేదు.
దృఢసంకల్పం' లేకపోతే ఎందరు దేవుళ్ళు మనకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా మన సోమరితనాన్ని పోగొట్టలేరు.
చమురులో తడిసిన కాగితం మీద వ్రాయలేము. అలాగే దుర్గుణాలు, విషయభోగాలు అనే నూనెలో నాని పాడైన మనస్సులో పారమార్థిక భావాలు నిలువవు.
దేవాలయమనే హృదయతాళాన్ని తీయాలంటే తాళంచెవిని వెనక్కు తిప్పాలి. అంటే భగవంతుణ్ణి పొందడానికి మనస్సును ప్రాపంచిక భోగాల నుండి భగవంతునివైపుకు మరల్చాలి.
శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి, వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి, హృదయంలో ఉన్న ఆత్మను దర్శింపజేసుకోవడానికి చేసే ప్రయత్నమే దీపారాధనలోని ఆంతర్యం.
కార్యాచరణకు మూలం ఆలోచన. కాబట్టి బుద్ధిని ఉన్నత విషయాలతో, అద్వితీయమైన ఆదర్శాలతో నింపండి. వాటినే స్మరించండి. అప్పుడే అద్భుతాలను సాధించగలరు.
యౌవనోత్సాహం పరవళ్ళు తొక్కుతున్నప్పుడే మీ భవిష్యత్తును నిర్దేశించుకోండి. ఒక ఆదర్శాన్ని స్వీకరించి, దాన్నే మీ జీవితంగా చేసుకోండి. ఇతర విషయాలను వదలిపెట్టండి.
పిల్లలు ముందంజ వేయడానికి మీరు తోడ్పడాలి. విషయాన్ని నిర్దేశం చేయడం మీ పనికాదు, అడ్డంకులను  తొలగించడమే మీ పని. అప్పుడు వారిలో జ్ఞానం దానంతట అదే వస్తుంది.
మనం ఇతరులపై నిందలను మోపుతున్నంతవరకు మన తప్పులను మనం గుర్తించలేం.కాబట్టి మన తప్పులకు ఇతరులను నిందించకుండా పూర్తి బాధ్యతను మనమే వహించాలి.
మనం చేసే ప్రతి పని లోనూ ఆనందం లేకపో వచ్చు. కానీ.. ఏ పనీ చెయ్యకుండా ఆనందాన్ని పొందలేం.
ఒక్కక్షణం సహనం ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు,  అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు,  అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతారు,  అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు,  అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతారు,  ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు
విజయం అంటేనీ సంతకం ఆటోగ్రాఫ్ గా  మారడం.
గెలిచిన వారికి గతం ఉంటుంది. ఓడిన వారికి భవిష్యత్తు ఉంటుంది.
మంచి పుస్తకం చదువడం అంటే ఇష్టమైన ప్రాంతానికి ప్రయాణించడం. పూర్తిగా చదివితే గమ్యాన్ని చేరుకున్న అనుభూతి కలుగకమానదు.
మారాలి అనుకునే వాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునే వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు.
యౌవనం అంటే పాటలు, ఆనందం అని తేలికగా తీసుకోకు. దాని మీద దయతలచి, నీ గులాబీలు ఎంత త్వరగా వాడిపోతాయో గుర్తుచేసుకో.
మన శక్తి కన్నా సహనం చాలా సార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
నేను సత్యాన్ని తప్ప మరొకటి చెప్పలేను. ఎవరినో సంతృప్తి పరచడం కోసం విధి నిర్వహణలో వెన్ను చూపలేను. 
కోరికలు అనుభవించేకొద్దీ ఇంకా పెరుగుతాయే కానీ తరుగవు 
ధనానికి అందరూ దాసులే 
దైవం వక్రించినపుడు  గడ్డిపోచ కూడా వజ్రాయుధమవుతుంది 
దానంతో శత్రువులు కూడా మిత్రులవుతారు 
విశ్వాసపాత్రుడైనవాడే మిత్రుడు 
పడిన శ్రమకు ఫలితం లభించినప్పుడు శ్రమగా తోచదు 
అన్ని అనర్థాలకు కోపమే మూలం 
పనిచేసేవాడికి దేనికీ కరువు ఉండదు 
ఉపకారం పొందినపుడు ప్రత్యుపకారం చేయాలి 
చెడుపని చేయనంతవరకే కీర్తి ఉంటుంది 
మహాత్ములకు ధర్మమే ధనం 
కష్టపడే వాడే ఫలితాన్ని పొందుతాడు 
సజ్జనుల మాట పాటించాలి 
కలహం పెరగడానికి సహాయపడొద్దు 
కోరికలు కష్టాలకు లోను చేసే శత్రువులు 
పీడితులకు సహకరించేదే ఉత్తమమైన హస్తం 
శ్రమించని వారిని దేవతలు అనుగ్రహించరు 
గర్వం చేతికి చిక్కిన పనిని కూడా చెడగొడుతుంది 
వట్టి ప్రగాల్భాలు పలికేవానికన్నా కార్యాచరణ చేసి చూపేవాడు గొప్పవాడు 
దానం చేసేవాడి ధనం ఎప్పుడూ వ్యర్థంగా పోదు 
కఠినమైన వాక్కును త్యజించు 
ఈర్ష్య కలహానికి మూలం; ఓర్పు సంపదలకు మూలం 
ఆశయమే పరమ దుఃఖం, నిరాశ పరమ సుఖం 
తండ్రి వందమంది ఆచార్యులతో సమానం 
ఆచార్యుణ్ణి దేవునిగా భావించు 
పెద్దల ఆశ్రయం ఉన్నప్పుడు, అసమర్ధుడు కూడా శోభిస్తాడు 
విద్య రాని బ్రతుకు వ్యర్థం 
బుద్ధిమంతుడు తన లేమిని మనస్తాపాన్ని వెల్లడించకూడదు 
శత్రువునుండైనా సచ్చిలం నేర్చుకోవాలి 
విద్య అభ్యాసాన్ని బట్టీ, కర్మను బట్టీ ఉంటుంది 
అన్నదానం కన్నా ఉత్తమదానం లేదు 
దైవం అనుకూలిస్తే అందరికీ శుభం కలుగుతుంది 
సాహసం చేయందే శ్రేయస్సు కలుగదు 
వచ్చిన మేలును కాదనకూడదు 
ఎంత మేధ ఉన్నా, అభ్యాసం చేయకపోతే చదువుకున్న విద్య నశిస్తుంది
ధనం సుఖాన్ని సాధించదు 
అన్నింటా అతిని వర్జించాలి 
అతిథిని దేవునిగా భావించు
కఠినమైన మాట నిప్పుకన్నా ఎక్కువ బాధిస్తుంది  
శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి. 
నిరాశ కొందరిని కుంగదీస్తుంది. దురాశ అందరినీ దెబ్బతీస్తుంది. 
చేదు ఆలోచనలు ఆలస్యంగా నైనా చెడ్డ ఫలితాల్నే ఇస్తాయి. 
తోటివారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించడమే న్యాయకత్వం. 
పుస్తకాలలో ఉన్న జ్ఞానం, ఇతరుల దగ్గర దాచిన డబ్బు...... ఈ రెండు అవసరానికి ఉపయోగపడవు. 
చెయ్యలేమని గొప్ప పనులనూ చెయ్యాలని లేదని చిన్న పనులను వదిలేస్తే ఏమీ చెయ్యని చాతకానివాళ్ళు గా మిగిలిపోతాం. 
ఉత్తములు - ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా తామే సహాయం పొందుతున్నంత వినయంతో మెలుగుతారు. 
నిరాశ ఓటమికి ముఖద్వారం. ఆ దారి నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత త్వరగా విజయం చేరువవుతుంది. 
మంచి పొరుగు వల్ల ఇంటి విలువ రెట్టింపవుతుంది. 
మేథాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం. 
వైఫల్యాలతో పలువురు వెనుదిరుగుతారు. పట్టుదల గల కొద్దిమంది అక్కడి నుంచే విజయయాత్ర మొదలుపెడతారు. 
మీరు రాసేవారైతే చదవదగినది రాయండి. చేసేవారైతే రాయదగ్గది చేయండి. 
మనిషి జీవితానికి వెలుగునిచ్చేది విద్య. 
పనిపట్ల మీకున్న అభిమానమే విజయానికి రహస్యం. 
నువ్వు వందమంది ఆకలి తీర్చలేకపోవచ్చు. కానీ ఒకరి ఆకలి తీర్చు. 
ప్రేమగుణం కలిగిన వారు ఎదుటివారి నుంచి ఏమీ ఆశించరు. 
కోపగించుకోవడమంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. 
ఒక పని సాధించాలని ముందుకు వెళితే దాని గురించి ప్రతికూల భావనలు చేయకూడదు. 
మన వ్యక్తిత్వాన్ని బట్టే సమాజంలో గౌరవం లభిస్తుంది. 
ధైర్య సాహసాలు, ప్రతిభ అనేవి వ్యక్తి విజయసాధనకు సోపానాలు. 
కోరికలు లేని వ్యక్తి ఎప్పుడూ తృప్తిగానే జీవిస్తాడు. 
మన అజ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళడమే అసలైన విద్య. 
జీవితంలో జరిగిన ఆనందకర సంఘటనలను గుర్తు తెచ్చుకొని, ఆనందాన్ని పెంచుకోవడం వల్ల మనిషి ఆనందంగా ఉండగలడు. 
కష్టాలు నీ శత్రువులు కాదు. నీ బలాల్నీ బలహీనతల్నీ నీకు తెలిపే నిజమైన నేస్తాలు 
ఏ పొరపాటూ చేయ్యట్లేదంటే కొత్తగా ఏదీ ప్రయత్నించట్లేదన్న మాట 
బాగుపడాలనుకునే మనిషి .......... అతినిద్ర, సోమరితనము, పనిలో అలసత్వం, భయం, కోపం........... అనే ఐదు దుర్గుణాలను వదల్చుకోవాలి 
ఆపదలకు ప్రతిక్రియను ముందుగానే ఆలోచించుకోవాలి. ఇల్లు తగలబడుతున్నప్పుడు బావి తవ్వడానికి ప్రయత్నించడం తెలివి తక్కువ పని
మాటలకూ చేతలకూ తేడా ఉంటే మన మాటలను ఎవరు విశ్వసించరు 
చెడు ఆలోచనలు ఆలస్యంగా అయినా చెడు ఫలితాల్నే ఇస్తాయి
ఆగ్రహం వివేకశూన్యతతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది 
వెంటనే అమలులో పెట్టని ఆలోచనలు కేవలం ఆశయాలుగానే మిగిలిపోతాయి 
తెలివికి నిదర్శనం తప్పులు వెదకటం కాదు, పరిష్కారాలు సూచించగలగడం 
పొగడ్తలో తక్కువ భాగాన్నీ, నిందలో ఎక్కువ భాగాన్నీ తీసుకునే వారే నాయకులు
కాకులతో కలిసి తిరిగితే పావురం రూపుమారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుంది. 
ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది. ... అప్పుడు మన ఆత్మ సంగీతం ద్వారా సమాధానాలనిస్తుంది. 
అందమైన వస్తువు నిరంతరం ఆనందాల జలపాతాలని అందిస్తూ ఉంటుంది. అందం తాలూకు ఆనందం నానాటికీ ఎదుగుతుండే జీవన మాధురి. అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు. 
మనిషి జీవితంలో అన్నిటి కన్నా ముఖ్యమైన విషయం - ప్రతి మనిషీ తన పని తాను నిజాయితీ తో వ్యవహరించగలగడం. 
సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే, యిక మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూ ఉండవు. 
తల్లిదండ్రులు తమ సంతానానికి అందించినవాటికి ప్రతిఫలం యీ సృష్టి లోనే లేదు. 
ఎంత సారవంతమైన క్షేత్రమైనప్పటికి దున్నకపోతే గుట్టలు, ముళ్లపొదలే మొలుస్తాయి. మానవుని మనస్సు కూడా అంతే. 
జరిగిపోయిన దాని గురించి విచారం అనవసరం. అది జరిగిపోయిందని సంతోషించాలి. మనం మనలాగే ఉండాలి. మన మనసులో ఏముందో దాచుకోకుండా చెప్పగలగాలి. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్నది మనకు అవసరం లేదు. అలా అనుకున్నా ...... దానిని పట్టించుకోనవసరం లేదు. 
ఒక బొమ్మ, దాని పక్కనో మాట రాసి ఉన్నంత మాత్రాన ప్రతి విషయాన్ని నమ్మకూడదు. 
హాయిగా నవ్వుకోవడాన్ని మించిన ఆటవిడుపు లేదు. 
దేవుడు మనకు విజయాలను అందివ్వడు. విజయానికి కావలసిన శక్తిసామర్థ్యాలను ఇస్తాడు. 
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. 
అతి పొగడ్తలు అజ్ఞానానికి బిడ్డల్లాంటివి. 
కల్మషం లేని వాడిని ప్రపంచమంతా ప్రేమిస్తుంది. 
మనసుని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే జీవితం సుఖమయమవుతుంది. 
మనసుకు ఇష్టమైన పని ఏదైనా కష్టముగా అనిపించదు. 
విజయం సాధించాలంటే మొదట పనిని ప్రేమించాలి. 
పూలలో సువాసన, వ్యక్తులలో యోగ్యత దాచినా దాగవు!
సహనం చేదుగా ఉన్నా, దాని ఫలితాలు తియ్యగా ఉంటాయి. 
చేసే పనిలో ఆనందం దొరికితే, వేరే ఆటవిడుపు అక్కర్లేదు. 
మంచి వారు మంచి వారితోనే స్నేహం చేస్తారు. 
కోపం తెచ్చుకోవటం తేలికే! కానీ కోపగించుకోవలసిన వ్యక్తిని సరైన సమయంలో, సరైన తీరులో, సరైన మేరకు, సరైన కారణంతో కోపగించుకొనే శక్తి అందరికి ఉండదు. ఆ శక్తి సంపాదించటం అంత తేలిక కాదు. 
ఆత్మానందం పొందాలంటే - ఆచారంతో పాటు ఆచరణ కూడా చేయాలి . 
జగన్నాదుడే ప్రాణనాధుడు - విశ్వెశ్వరుడే ప్రాణేశ్వరుడు . 
కష్టనష్టాలు కదిలే మేఘాల వంటివి . 
ధర్మాచరణ వలన సద్భుద్ది కలుగుతుంది . 
రాగ, ద్వేష రహితుల గృహమే స్వర్గం . 
ఆశలను తగ్గించు - ఆశయాలను పెంచు . 
గొప్పవారు కావాలి, అయితే మంచివారుగా ఉండాలి . 
దేహ శుభ్రతతో పాటు భావ శుద్ధత అత్యంత అవసరం . 
వాంఛల త్యాగమే మహోన్నతికి మార్గం . 
శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు . 
మితిమీరిన ఆశల వలన మనసు గతి తప్పుతుంది . 
కోరికలు పెరిగే కొలది ఆనందం తగ్గుతుంది. 
సంసార సాగరం దాటాలంటే - సంస్కారముల పరివర్తన కావాలి 
ఆచరణ లేని ప్రచారం పంట పండని భూమి వంటిది 
కష్టాలు ఒంటరిగా రావు - అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి.
తృప్తి సహజ సిద్ధమైన సంపద. భోగం కృత్రిమమైన బీదరికం. 
వంద మందికి సాయపడలేక పోవచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. 
విద్య అనేది మనిషి నుంచి వేరుచేయలేని విలువైన సంపద. 
కొద్దిపాటి కోరికలు ఉన్నవాడే అందరికంటే ధనవంతుడు. 
ద్భుతాలను సాధించటానికి మూలం దృఢమైన నమ్మకం. 
శ నుంచి విముక్తి పొందుతే దుఃఖం అంతమవుతుంది. 
మౌనముగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. 
విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మంచి పుస్తకాలు చదవాలి. 
క్రమ సంపాదనతో చేసే విందు భోజనం కన్నా, కష్టార్జితంతో తాగే గంజి ఎంతో సంతృప్తిని ఇస్తుంది. 
ముందూ వెనకా ఆలోచించకుండా వాగ్దానాలు ఇచ్చేవారు వాటిని నెరవేర్చలేరు. 
స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది. సంతోషాన్ని హెచ్చిస్తుంది. 
ర్మాన్ని మనం రక్షిస్తే - ధర్మం మనలను రక్షిస్తుంది. 
జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి. 
చేసిన మేలు మరచిపో - పొందిన మేలు గుర్తుంచుకో. 
శ్రేష్టకర్మల జ్ఞానమే భాగ్యరేఖలు గీసే కలము. 
చితి నిర్జీవులను కాలుస్తుంది - చింత సజీవులను దహిస్తుంది. 
జీవితం కరిగిపోయే మంచు - ఉన్నంతలో నలుగురికి పంచు. 
తినటం కోసం జీవించకు - జీవించటం కోసం తిను. 
ణుగుల కొద్ది మాటల కన్నా - చిన్నమెత్తు ఆచరణ మిన్న. 
హాద్భుతాలు సాధించాలంటే దృఢ నమ్మకం కావాలి. 
నసు ప్రశాంతముగా ఉంటే, ప్రపంచం మొత్తం ప్రశాంతముగా ఉన్నట్లు కనిపిస్తుంది. 
సూయ అగ్నికణం వంటిది. అది అంటుకుంటే కాల్చే వరకూ వదలదు.
దుటివారి లోపాలను ఎత్తి చూపడం కన్నా మనలోని లోపాలను సవరించుకుంటే జీవితంలో ఉన్నత వ్యక్తిగా ఎదుగుతాం.
చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్మినట్లు.
న బలిమి కన్నా స్థాన బలిమి మిన్న 
నువు గాని చోట అధికుల మనరాదు.
కోపం వల్ల మనషులు మూర్ఖులుగా తయారవుతారు.
మండిన కొవ్వొత్తి మనది కానట్టే, గడచిన కాలం తిరిగిరాదు.
చిరునవ్వుల దరహాసంతో వెలిగిపోయేవారితోనే మీరు స్నేహం చేయండి.
పొదుపు చేయాల్సిన చోట ఖర్చు చేయకు, ఖర్చు చేయాల్సిన చోట పొదుపు చేయకు.
రులను నిందించటం కాదు, ఎప్పటికప్పుడు నీ తప్ప్పులు తెలుసుకొని సరిదిద్దుకో.అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోగలవు                                                                                 
దుండగాలను కత్తితో ఎదరించినప్పుడు అవి మరింత పెచ్చరిల్లిపోతాయి.ప్రేమతో,శాంతితో వాటిని ఎదుర్కొన్నట్లయితే అవి శాశ్వతంగా అంతరిస్తాయి.                                                              -                   
నం వెళ్ళింది ముళ్ళదారి అయిన  ప్పుడు,ఇంకెవరినీ ఆ  వైపు రావద్దని హెచ్చరించడం మన  ధర్మం
                                                                                             
 

Kids Rhymes

Telugu Meanings

జాతీయాలు